అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం
అనంతపురం : జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. హంద్రీనీవా కాలువలో ట్రాక్టర్‌ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కదిరి నియోజకవర్గం నంబులపూలకుంట మండలంలో సోలార్‌ ప్లాంట్‌ పనులకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతులు మహారాష్ట్రకు చెందిన కూలీలుగా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.