చకచకా.. బ్రహ్మోత్సవ ఏర్పాట్లు

చకచకా.. బ్రహ్మోత్సవ ఏర్పాట్లు
తిరుమల  : తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. టీటీడీలోని వివిధ విభాగాలు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నాయి. ఇంజినీరింగ్‌ విభాగం పెద్దఎత్తున సివిల్‌, ఎలక్ర్టికల్‌ పనులు చేపట్టింది. కొండపై పలు ప్రాంతాల్లో భారీ దేవతా ప్రతిమల కటౌట్లు ఏర్పాటు చేస్తున్నారు. రహదారులకు ఇరువైపులా ఉన్న వృక్షాలు, భవనాలు, ఎత్తయిన కట్టడాలకు రంగురంగుల విద్యుద్దీప తోరణాలు అమరుస్తున్నారు. సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మతులు, తారు ప్యాచ్‌వర్కులు, కొన్ని ప్రాంతాల్లో కాంక్రీట్‌ వేసే పనులు చురుగ్గా సాగుతున్నాయి. కల్యాణవేదిక వద్ద ఫలపుష్ప ప్రదర్శనశాల ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. పలు రంగాలకు చెందిన నిపుణులు అక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈసారి ప్రత్యేకంగా అత్తి వరదరాజస్వామి ఆలయ సెట్టింగ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. మహారథానికి రంగులు దిద్దుతున్నారు. ఆలయం ముందు, తూర్పు మాడవీధిలో నిపుణులు ఆకర్షణీయంగా రంగవల్లులు వేస్తున్నారు. స్వాగత తోరణాలు, కూడళ్ల వద్ద వుండే వాటర్‌ఫౌంటెన్‌లకు విద్యుత్‌ అలంకరణలు, రాంభగీచ విశ్రాంతి గృహాల ముందు భాగంలో విద్యుదీపాలతో సప్తద్వారాలు ఏర్పాటు చేసే పనులు చురుగ్గా జరుగుతున్నాయి. మాడవీధుల్లో పెద్దసంఖ్యలో చెత్తకుండీలు ఏర్పాటు చేస్తున్నారు.


Popular posts
*వింజమూరు ప్రజలు జాగ్రత్తలు వహించండి* డాక్టర్ రమేష్.... వింజమూరు, సెప్టెంబర్ 22 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి పట్ల తగు జాగ్రత్తలు వహించాలని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైధ్యాధికారి డాక్టర్ రమేష్ కోరారు. ఇప్పటివరకు మండలంలో 500లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగిందన్నారు. అయితే అదే స్థాయిలో బాధితులు కోలుకుంటుండటం సంతోషకరమైన విషయమన్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ వైరస్ పట్ల అవగాహనా రాహిత్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం శ్రేయస్కరం కాదన్నారు. కరోనా నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖలు ఎంతగానో కృషి చేస్తున్నాయన్నారు. అయితే ప్రభుత్వ సూచనలను పెడచెవిన పెట్టడం వలన వైరస్ ప్రబలేందుకు పరోక్షంగా దోహదపడుతున్నామన్నారు. కనీస జాగ్రత్తలు పాటించిన పక్షంలో కరోనాను అంతమొందించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ప్రతి నిత్యం వేడి వేడి ఆహార పదార్ధాలను భుజించడం, దాహం వేసినప్పుడు గోరువెచ్చని నీటిని సేవించడం, యోగా, ముఖానికి మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి సూచనలను ప్రతి ఒక్కరూ విధిగా అలవాటు చేసుకోవాలన్నారు. వైరస్ సోకిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రమేష్ తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.
Image
ఆ నేరస్తుడిని కఠినంగా శిక్షించాలి : సీఎం జగన్‌
16 న చిన్న, మధ్యతరహా పత్రికల రాష్ట్ర మహాసభ : మల్లెల      
చెన్నకేశవ స్వామి ఆలయ ఈవో నారాయణ రెడ్డి మృతి పట్ల మంత్రి సంతాపం
కరోనా నియంత్రణకు దక్కన్ టూబాకో కంపెనీ  గ్రూప్
Image