మండల కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన -కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్

          కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండల కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన -కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ మాధవీలత* !


*ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్సులో పదే. పదే . ఉగాదినాటికి ప్రతిపేదవాడికి ఇళ్లస్థలాలు ఇవ్వాలని చెబుతున్నారు* .. *జెసి* 


👉 తాసీల్దార్ కార్యాలయంలో  వున్నా రికార్డులని పరిశీలించిన -జేసి 


👉జాయింట్ కలెక్టర్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేని పరిస్థితిలో  తహసీల్దార్ వీఆర్వోలు . మిగతా సిబంది .. ఆగ్రహించిన జాయింట్ కలెక్టర్ 


👉గత నెలరోజులుగా పదే .. పదే .  తహసీల్దార్ . సర్వేయర్ ,వీఆర్వోలకు ఆదేశిస్తున్నా ప్రభుత్వ భూములు చూడమంటే  ప్రేవేటు భూములు కొనాలని అంటున్నారు . ప్రభుత్వభూములను మీరు గుర్తించిన రికార్డులు ఏవి అని జాయింట్ కలెక్టర్ ప్రశ్నించగా  సమాధానం చేపలేకపోవటంతో  జాయింట్  కలక్టెర్ ఆగ్రహించి . మండలంలో వున్నా అధికారులు నిద్రపోండి , వీఆర్వోలు . తహసీల్దార్లు  చేయాలిసిన పనులు  కృష్ణాజిల్లా కలెక్టర్ . జాయింట్ కలెక్టర్  ఇబ్రహీంపట్నం మండలం కార్యాలయంలో కి వచ్చి విధులకు నిర్వహిస్తారని ఆగ్రహించారు 


👉ఇబ్రహీంపట్నం మండలం లో వున్నా ప్రభుత్వ మరియు అసైన్ట్ మెంట్ భూములు వివరాలు రికార్డులుపూర్తి సమాచారం పై  జాయింట్ కలెక్టర్   పూర్తి వివరణ కోరగా. సమాధానం చెప్పటంలో పూర్తిగా విఫలమైన  తహసీల్దార్ , వీఆర్వోలు ,సర్వేయర్ ,ఆగ్రహం వ్యక్తంచేసిన  జాయింట్ కలెక్టర్ 


👉మండలంలో ప్రభుత్వభూములు , అసైన్ట్ మెంట్ భూములు ఎక్కడ వున్నావో 
 గుర్తించండి సర్వేనంబర్లు తీయండి  అడంగల్ లోకి వెళ్ళండి వివరాలు  సేకరించండి పూర్తి స్థాయి సమాచారం  శనివారంలోపు  జెసి క్యాంప్ కార్యాలయంలో అందచేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు 


👉ప్రభుత్వ భూములు ఖబ్జాలు చేసిన వారు వుంటే  తనకు తెలపండి ,వారు ఎంతటి బడాబాబులైన తాను చూసుకుంటాను  . ఆభూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది 


👉ఇబ్రహీంపట్నంలో  400ఎకరాలు సీలింగ్ భూమి వుండాలి  అది ఎవరిదగ్గరవుందో తనకుతెలపాలి  అని . జెసి ఆదేశించారు ,గుంటుపల్లిలో 844 ఎకరాల ప్రభుత్వభూమి వుండాలి అదిఎక్కడవుంది వెలికితీయండి . వీఆర్వోలుగా విధులు నిర్వహిస్తూ ప్రభుత్వానికి అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాలను అనుసరించకుండా మీకు ఇష్టమైన వారు ఎవరైనా ఉంటే వారికోసం  పనిచేస్తారు అని ఆగ్రహించారు , ఈలప్రోలులో 130 మంది పేదలకు ఇళ్లస్ధలలు ఇవ్వాలని వాలంటరీలు గుర్తించారు దానికి సరిపడా 4ఎకరాల భూమిని చుడండి అని ఆదేశించారు 
35,36,43, సర్వే నంబర్లలో ఎంతభూమివుంది  144 ఎకరాలు సీలింగ్ ల్యాండ్ వుండాలి అది ఎక్కడవుందో తనకు త్వరగా  తెలియజేయాలి  అని ఆదేశించారు 👉 శనివారంలోపు మండలంలో ప్రభుత్వ భూములను గుర్తించండి . నిద్రపోయారా  7గురు వీఆర్వోలను బదిలీ చేసేస్తాను , మాకు ఇబ్రహీంపట్నంకావాలని ఏరికోరి ఈమండలానికి వచ్చింది ప్రెవేట్ పనులుచూసుకోవటానికికాదు . ప్రభుత్వానికి పనిచేయటానికి ప్రభుత్వాదేశాలమేరకు ప్రజలకు సేవచేయాలని అని అన్నారు  


👉మండలంలో 18 సచివాలయాలు వస్తున్నవి . 18 మంది వీఆర్వోలు వస్తున్నారుఅనిఅన్నారు  


👉ఉగాదినాటికి ఇళ్లులేని నిరుపేదలకు ఇళ్లస్థలాలు అందించాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాన్ని తీసుకుందన్నారు దీనికి అనుగుణంగా రెవిన్యూ అధికారులు ఆయా గ్రామాల్లో అందుబాటులో వున్నా ప్రభుత్వ భూమిని  గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్  మండల అధికారులకు సూచించారు 


👉పేదలకు నివాసయోగ్యమైన భూమిని గుర్తించి ఇళ్లస్థలాలు అందించేందుకు చక్కటి ప్రణాళికతో ముందుకు వెళ్లాలని రెవిన్యూ అధికారులకు  జాయింట్ కలెక్టర్  డాక్టర్ మాధవీలత ఆదేశించారు


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆ రోజున జాతీయ బాలల దినోత్సవం అని ఆయనకు తెలియదా?
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నెల్లూరు జిల్లాలో రెండవసారి మహాత్ముని పర్యటన
Image