మంత్రి మేకపాటి చొరవతో హాస్టల్స్ మరమత్తులకు నిధులు విడుదల

మంత్రి మేకపాటి చొరవతో హాస్టల్స్ మరమత్తులకు నిధులు విడుదల


ఆత్మకూరు : నియోజకవర్గములో యస్సీ హాస్టల్స్ – 11 మరియు బి.సి హాస్టల్స్ – 6 మొత్తము 17 హాస్టల్స్ మరమత్తుల నిమిత్తము రూ.44,25,000/- (అక్షరములా నలభై నాలుగు లక్షలా ఇరవై ఐదు వేల రూపాయలు) మంజూరు కావడం జరిగినది. 


ఏ.యస్ పేట బి.సి బాలుర హాస్టల్ కు రూ.2,40,000/- లు, కామిరెడ్డిపాడు బి.సి బాలుర హస్టల్ కు రూ.2,50,000/- లు, చిలకలమర్రి బి.సి బాలుర హాస్టల్ కు రూ.1,75,000/-లు, రేవూరు బి.సి బాలికల హాస్టల్ కు రూ.2,00,000/- లు, రేవూరు యస్సీ బాలుర హాస్టల్ కు రూ.4,60,000/- లు, మాముడూరు బి.సి బాలుర హాస్టల్ కు రూ.5,20,000/- లు, సంగం బి.సి బాలికల హాస్టల్ కు రూ.1,35,000/- లు, ఆత్మకూరు యస్సీ బాలుర హాస్టల్ కు రూ.1,35,000/- లు, కొరిమెర్ల యస్సీ బాలుర హాస్టల్ కు రూ.4,15,000/- లు, ఆత్మకూరు యస్సీ బాలికల హాస్టల్ కు రూ.2,00,000/- లు, ఆత్మకూరు యస్సీ బాలుర హాస్టల్ కు రూ.1,35,000/- లు, కంపసముద్రము యస్సీ బాలుర హాస్టల్ కి రూ..1,60,000/- లు, మర్రిపాడు యస్సీ బాలుర హాస్టల్ కు రూ.4,80,000/- లు, మర్రిపాడు యస్సీ బాలికల హాస్టల్ కు రూ.4,80,000/- లు, దువ్వూరు యస్సీ బాలుర హాస్టల్ కు రూ.1,70,000/- లు, సంగం యస్సీ బాలికల హాస్టల్ కు రూ.1,00,000/- లు, చేజర్ల యస్సీ బాలుర హాస్టల్ కు రూ.1,70,000/- లు మంజూరు చేయించినందుకు మంత్రి మేకపాటి గౌతం రెడ్డి గారికి నియోజకవర్గ ప్రజలు హర్షం వెళ్ళబుచ్చారు.