పశుసంవర్థక, మత్స్య శాఖలపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష

20–09–2019
అమరావతి


అమరావతి: పశుసంవర్థక, మత్స్య శాఖలపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.


శ్రీకాకుళం జిల్లామంచినీళ్లపేట సహా రాష్ట్రంలో గుర్తించిన ప్రాంతాల్లో జట్టీల నిర్మాణాలపై సీఎం సమీక్ష


*వీటిని ప్రణాళికా బద్ధంగా పూర్తిచేయడానికి కార్యాచరణ సిద్ధంచేయాలి: సీఎం*


*దాదాపు 12 జెట్టీల నిర్మాణానికి అధికారుల సన్నాహాలు*


*రాష్ట్రంలో మూడు మేజర్‌ పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది: సీఎం*


*మచిలీపట్నంను మేజర్‌ పోర్టుగా తీర్చిదిద్దుతాం: సీఎం*


*భీమిలి సమీపంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణంపైనా సమావేశంలో చర్చ*


విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌పై ఒత్తిడి తగ్గించాల్సి ఉందని ప్రస్తావన, ప్రణాళిక సిద్ధంచేయాలన్న ముఖ్యమంత్రి
మత్స్యకారుల గురించి ఈ ప్రభుత్వం పట్టించుకుందన్న సంకేతం పోవాలి: సీఎం
దీనికోసం వారు కోరుతున్న ప్రాంతాల్లో జట్టీలు, ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణాలు చేయాలి:సీఎం
ఈ పనుల్లో పారదర్శకత ఉండేలా చూసుకోండి: సీఎం
స్కాంలకు తావులేకుండా చూసుకోండి: సీఎం


గుజరాత్‌లో 25వేల తెలుగు మత్స్యకార కుటుంబాలు ఉన్నాయన్న అధికారులు, ఉపాధిలేక వలస వెళ్లారన్న అధికారులు
వేటకు అవసరమైన సదుపాయాలు కల్పించడం ద్వారా వారిని తిరిగి రాష్ట్రానికి రప్పించే అవకాశాలు ఉంటాయన్న అధికారులు
ఆ దిశగా అడుగులు వేయాలని సీఎం ఆదేశం


చేపలు, రొయ్యలు పెంచుతున్న ప్రాంతాల్లో ల్యాబ్, రైతులకు అవగాహన కల్పించడానికి వర్క్‌షాపుల ఏర్పాటు
జనవరి నాటికి ఏర్పాటు చేసేలా  చర్యలు తీసుకోవాలన్న సీఎం
సీడ్, ఫీడ్‌ల్లో కచ్చితంగా నాణ్యత ఉండాలి: సీఎం
ఎక్కడా కూడా కల్తీ ఉండకూడదు : సీఎం
కల్తీ చేసేవారిపై ఉక్కుపాదం మోపండి: సీఎం
ఎక్కడా నాకు కల్తీ అనేది కనిపించకూడదు : సీఎం
ఆక్వా ప్రాంతాల్లోని గ్రామ సచివాలయాల్లో సంబంధిత రంగానికి చెందిన వారిని ఉద్యోగులుగా తీసుకున్నారు: సీఎం
వారికి సరైన శిక్షణ ఇచ్చి, రైతులకు మంచి జరిగేలా చూడాల్సిన బా«ధ్యత అధికారులదే:సీఎం


తూ.గో.జిల్లాలో హేచరీజోన్‌గా ప్రకటించిన ప్రాంతంలో ఫార్మా కంపెనీలకు అనుమతి ఇచ్చారు: సీఎం
దీనివల్ల కాలుష్యం అంతా సముద్రంలోకి వెళ్తుంది:
ఇదే ప్రాంతంగుండా నేను పాదయాత్ర చేశాను: సీఎం
ఒక ప్రాంతాన్ని పలానా జోన్‌గా ప్రకటించిన తర్వాత అక్కడ వేరే పరిశ్రమలకు అనుమతి ఇవ్వడం, కలుషితం చేయడం కరెక్టు కాదు: సీఎం
దీనిపై పూర్తిగా అధ్యయనం చేసి... ఒక విధానాన్ని రూపొందించండి: సీఎంఆక్వా పంట చేతికి వచ్చే సరికి రేటు పడిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి, ఇది మనకు పెద్ద సవాలు : సీఎం
రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు,దీనిపై అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలి: సీఎం
రైతుల ప్రయోజనాలనురక్షించాల్సిన బాధ్యత మనదే: సీఎం
ఎంత కష్టపడినా గిట్టుబాటు కావడంలేదని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి: సీఎం
ప్రముఖ అంతర్జాతీయ సంస్థలు, సహకారం తీసుకోండి: సీఎం
వారి బ్రాండును వినియోగించుకునేలా ప్రణాళికలు తీసుకు రండి: సీఎం
మేనేజ్‌మెంట్‌లో ప్రతిభావంతుల సహకారం తీసుకోండి:
దీనివల్ల మార్కెటింగ్‌ సదుపాయాలు పెరుగుతాయి:
రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుంది: సీఎం


జనవరిఅనేది రిక్రూట్‌మెంట్‌ నెలగా చేసుకోండి:
ఖాళీల భర్తీకి జనవరి నెలను వాడుకోండి:


వెటర్నరీ ఆస్పత్రులు, క్లినిక్కుల్లో సదుపాయాలను కల్పించాలి: సీఎం
గ్రామ సచివాలయ వ్యవస్థను బాగా వినియోగించాలి: సీఎం
పశువులకూ హెల్త్‌కార్డును ఇవ్వాలి: సీఎం
దీనివల్ల క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు ఇచ్చే అవకాశం ఉంటుంది: సీఎం
పశువుల పెంపకంలో సంప్రదాయ పద్ధతులకు పెద్దపీట  వేయాలి:సీఎం
ఏ కార్యక్రమం చేపట్టినా వాలంటీర్లను భాగస్వామ్యం చేయాలని సీఎం ఆదేశం
పశువుల మందులు కొనుగోలులో ప్రపంచస్థాయి ప్రమాణాలు పాటించాలని సీఎం ఆదేశం


ఏపీకార్ల్‌కు నేరుగా నీటిని తెప్పించుకునేలా నీటిపారుదల శాఖతో మాట్లాడాలని అధికారులకు చెప్పిన సీఎం:
దీనివల్ల పరిశోధనలకు ఇబ్బంది లేకుండా ఉంటుందన్న సీఎం
ఏపీ కార్ల్‌ను లక్ష్యాలకు అనుగుణంగా నడపాలన్న సీఎం
పులివెందులలో ముర్రా గేదెలు, పుంగనూరు జాతి ఆవుల అభివృద్ధికోసం బ్రీడింగ్‌ సెంటర్‌:


కరువు బాధిత ప్రాంతాల్లో పశువులకు ఆహార సమస్యలేకుండా చేయడానికి స్థిరమైన, శాశ్వతమైన విధానాలు తీసుకురావాలని సీఎం ఆదేశం
పశువులకు దాణా కొరత రాకుండా ఉత్తమ విధానాలు అనుసరించాలని సీఎం ఆదేశం
పశువుల వైద్యంకోసం 102 వాహనాలు, వచ్చే ఏడాది నుంచి తీసుకురావడానికి ప్రణాళిక సిద్ధంచేయాలని సీఎం ఆదేశం 


పశుసంవర్ధక, మత్స, మార్కెటింగ్‌  శాఖల పై సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశానికి హాజరైన పశుసంవర్ధక, మత్సశాఖ మంత్రి శ్రీ మోపిదేవి వెంకటరమణ, ఆయా శాఖల ఉన్నతాధికారులు.