ప్రభుత్వ కార్యాలయాల్లో రిసెప్షన్ సెంటర్లు, గ్రామాల్లో గ్రంధాలయాల ఏర్పాటుకు చర్యలు - చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి
చంద్రగిరి నియోజవర్గ పరిధిలో డ్వాక్రాసంఘాలకు రూ.27.14 కోట్లు రుణాల పంపిణీ
తిరుపతి , సెప్టెంబర్ 20: చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో, పోలీసు స్టేషన్లలో రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు, గ్రామాలలో గ్రంధాలయాల ఏర్పాటుకు తుడా సహకారంతో శ్రీకారం చూడుతున్నామని ప్రభుత్వ విప్ మరియు తుడా చైర్మన్, చంద్రగిరి శాసన సభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం శాసన సభ్యులు స్థానిక ఎస్. వి. యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో ఋణ మేళా నిర్వహించి, జ్యోతి ప్రజ్వలన చేసి చంద్రగిరి నియోజక వర్గ పరిధిలోని డ్వాక్రా మహిళలకు రుణాలను పంపిణీ చేశారు.
ఈ సమావేశం లో శాసన సభ్యులు సంఘాల మహిళలనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య మంత్రి వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి మహిళలంటే అపారమైన గౌరవమని, అందుకే చట్టం తీసుకొని వచ్చి మహిళలకు కాంట్రాక్టు పనుల్లో 50 శాతం అవకాశం కల్పిస్తున్నారని అన్నారు. మహిళ బాగుంటే కుటుంబం , సమాజం, రాష్ట్రం బాగుంటుందని, పట్టుదల, బాధ్యత వున్న వారు మహిళలలేనని అన్నారు. అందుకే ముఖ్యమంత్రి మీ పిల్లల ఛదువులకు అమ్మ ఒడి పధకం తో రూ. 15 వేలు , మీ ఖాతాలకే జమ చేయడం, మాటిచ్చిన మేరకు డ్వాక్రా రుణాలు నాలుగు విడతలలో మాఫీ, వడ్డీ లేని రుణాలు మంజూరు అమలు చేయనున్నారని అన్నారు. నవరత్నాల అమలు చేయడం లక్ష్యంగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారని, పదవి చేపట్టిన 10 వరోజు నుండే పథకాల అమలు ప్రారంభమయిందని అన్నారు. నియోజక వర్గ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలలో రిసెప్షన్ సెంటర్లు ఏర్పాటు చేసి, విజిటర్స్ బుక్ పెడుతున్నామని, సమస్యతో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినపుడు అధికారి అందుబాటులో లేకుంటే , మీకోసం ఏర్పాటు చేసిన రిజిస్టర్ లో నమోదు చేసి వస్తే ఆఅధికారి మీ సమస్యకు ఫోన్ చేసి పరిష్కరిస్తారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో యువతకు గ్రంధాలయలు ఎంతో వుపకరిస్తాయని మరో 4, 5 నెలల్లో ఏర్పాటు చేయనున్నామని అన్నారు. అక్టోబర్ 2 గాంధీజయంతి రోజు నుండి ప్రతి ఇంటికి 4 చెట్లను పంపిణీ చేయనున్నామని అన్నారు. నియోజక వర్గ పరిధిలోని అర్హత గల 475 మహిళా గ్రూపులకు నేడు రూ. 27.14 కోట్లు బ్యాంక్ లింకేజ్ అందిస్తున్నామని, గత మాసంలో పాకాల మండలం వారికి అందించామని గుర్తుచేశారు. వై. ఎస్. ఆర్. ఆసరా ఈ నియోజక వర్గం లో 5323 సంఘాలకు రూ. 237.66 కోట్లు లబ్ది కలగనున్నదని అన్నారు. సభలో చంద్రగిరి మండలం 149, చిన్న గొట్టిగల్లు 67, ఆర్ సి పురం 78, తిరుపతి రూరల్ 88, అర్బన్ 55, ఎర్రవారిపాలెం 38 డ్వాక్రా గ్రూపులకు రూ. 27 కోట్ల 14 లక్షలు చెక్కులను శాసన సభ్యుల చేతులమీదుగా పంపిణీ చేశారు.
డి ఆర్ డి ఎ, పి డి మురళి మాట్లాడుతూ జిల్లాలో మహిళాగ్రూపులు 98 శాతం మంది రుణాల తిరిగి చెల్లిపుచేస్తున్నారని, బ్యాంకర్లు మహిళా రుణాల మంజూరుకు ఆసక్తి చూపుతున్నారని అన్నారు.
ఈ సమావేశంలో తుడా సెక్రెటరీ రాసుందర్ రెడ్డి, డిఎస్పీ నరసప్ప, ఓ ఎస్ డి భాస్కర్ నాయుడు, ఏం పి డి ఓ లు, ఎపిఎంలు, నియోజకవర్గ పరిధిలోని మహిళా సంఘాల సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.