లక్ష 26 వేల ఉద్యోగాలతో గ్రామ స్వరాజ్యం

 


*లక్ష 26 వేల ఉద్యోగాలతో గ్రామ స్వరాజ్యం*
*పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు*


విశాఖపట్నం సెప్టెంబర్ 30: 


3 మాసాల్లో 80 శాతం వాగ్దానాలను అమలు చేసిన తొలి ముఖ్యమంత్రి గా వైయస్ జగన్మోహన్ రెడ్డి చరిత్ర సృష్టించారని పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. బీచ్ రోడ్డులో గల ఏయు కన్వెన్షన్ హాల్లో ఏర్పాటుచేసిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల నియామక ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి సంపద యువతే నని, వారిని, వారి శక్తిని రాష్ట్ర దేశ ప్రజా సేవకు ఉపయోగ పరిచే క్రమంలో ముఖ్యమంత్రి ముందుగా సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం చారిత్రాత్మక, నిజమైన ఫలవంతమైన పారదర్శకమైన ప్రజాస్వామ్య ప్రభుత్వమని చెప్పారు. వయస్సు అనుభవం కంటే సేవ చేయాలనే మనసు ఆశయం ముఖ్యం అని ఆయన నిరూపించారు అన్నారు. సమాజంలో అంతరాలు తగ్గించి సమసమాజ నిర్మాణానికి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధనము పదవిపై వ్యామోహం లేదని ప్రజాసేవ ఆయనకు ఆనందం కలిగించే అంశమని చెప్పారు. నాయకుడంటే జగనేనని నిరూపించారని అన్నారు.  దేశంలో 60 శాతం ఉన్న యువత ఈ అవకాశాలను వినియోగించు కోవాలని, దేశం నీకేమిచ్చింది అనేకన్నా దేశానికి నువ్వేమి ఇచ్చావన్నది కాదన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని సాధించవలసింది ఇంకా ఉన్నదన్నారు. 
    వి ఎం ఆర్ డి ఎ అధ్యక్షులు ద్రోణంరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రాష్ట్రంలో కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు అన్ని రాష్ట్రాలకు ఆదర్శవంతమైన సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నిజం చేసేందుకు పూనుకున్నారు అన్నారు.
రాష్ట్ర శాసనసభ విప్ బూడి ముత్యాలనాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా సచివాలయ ఉద్యోగులు పని చేయాలని పిలుపునిచ్చారు.  తల్లిదండ్రుల గౌరవాన్ని నిలబెడుతూ గ్రామ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
ఉద్యోగాలు పొందిన మాకవరపాలెం మండలం తూటిపాల గ్రామానికి చెందిన కిల్లాడి  అనురాధ, నాతవరం మండలం సరుగుడు గ్రామానికి చెందిన కుర్రా కిరణ్ కుమార్, అనకాపల్లికి చెందిన సి ఎస్ కుమార్ దేవరపల్లి కి చెందిన దివ్యాంగుడు ఎస్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ మాట్లాడుతూ పురపాలక గ్రామపంచాయతీ లను బలోపేతం చేయడం ప్రజల వద్దకే ప్రభుత్వ సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని దానికి అనుగుణంగా 19 రకాల ఉద్యోగాలకు జూలై 26న నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు జిల్లాలో 807 గ్రామ, వార్డు సెక్రటేరియట్ లలో 10, 873 పోస్టులకు 406 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించామన్నారు.7, 724 అభ్యర్థులను ధ్రువపత్రాల పరిశీలనకు పిలువగా 62 43 మంది హాజరయ్యారు అన్నారు. వారిలో 4362 మందిని ఎంపిక చేయడం జరిగిందని వివరించారు వీరు అక్టోబరు 1వ తేదీన సంబంధిత శాఖల లో రిపోర్టు చేసినట్లయితే కౌన్సెలింగ్ ఇస్తారని అనంతరం రెండవ తేదీన 7 గంటల నుండి విధులలో చేరవలసి ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి శాసనసభ్యులు కరణంధర్మశ్రీ, గొల్ల బాబురావు తిప్పల నాగిరెడ్డి అన్నం రెడ్డి అదీప్ రాజు గుడివాడ అమర్నాథ్ కొట్టగుల్లి భాగ్యలక్ష్మి పెట్ల ఉమాశంకర్ గణేష్, జీవీఎంసీ కమిషనర్ డా జి సృజన జాయింట్ కలెక్టర్ ఎల్. శివ శంకర్, జె సి 2 సూర్య కళ నియోజకవర్గ ప్రత్యేక అధికారులు వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
అన్నింటికీ అచ్చ తెలుగు పదాలు వాడొచ్చు. 
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image