రైతుకు భరోసా

రైతుకు భరోసా
లబ్ధిదారుల గుర్తింపులో వ్యవసాయశాఖ
నిబంధనలను ఖరారుచేసిన ప్రభుత్వం
గ్రామాల్లో పర్యటిస్తున్న అధికారులు
రాష్ట్రప్రభుత్వం రైతు భరోసా లబ్ధిదారుల గుర్తింపునకు విధివిధానాలను ఖరారుచేసింది. నిబంధనల మేరకు ఈ పథకంలో లబ్ధిదారులను గుర్తించడానికి మండల వ్యవసాయశాఖ అధికారులు (ఎంఏవో), ఏఈవోలు, ఎంపీఈవోలు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. వ్యవసాయశాఖ ఏడీలు, డీడీలు ఈ పథకంలో ఆయా ప్రాంతాల్లో లబ్ధిదారుల ఎంపిక ఎలా జరుగుతుందో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వ్యవసాయశాఖ స్పెషల్‌ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌, ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్యలు ఎప్పటికప్పుడు జిల్లా అధికారులతో సమీక్షిస్తున్నారు.
గుంటూరు : రైతు భరోసా లబ్ధిదారుల ఎంపికకు ప్రభుత్వం సూచించిన నిబంధనలు ఇలా ఉన్నాయి.
- సొంతంగా భూమి ఉంటే పది సెంట్ల నుంచి ఐదు ఎకరాలు ఉన్న ప్రతి రైతుకు ఈ పథకం వర్తిస్తుంది.
-భూమి యజమాని చనిపోతే అతని భార్యకు ఈ పథకంలో లబ్ధిదారులుగా అర్హత పొందుతారు.
-తల్లిదండ్రులు చనిపోతే వారి వారసులలో ఒకరికి మాత్రమే కౌలుకు చేసినట్లు అవుతుంది.
- కౌలు రైతు అయితే 50 సెంట్లు లేదా అంతకంటే ఎక్కువ సాగుచేస్తూ, అతని పేరుతో భూమి లేనట్లయితే ఈ పథకం అమలవుతుంది.
-భూ యజమాని అంగీకారంతోనే కౌలు రైతులకు ఈ పథకం వర్తిస్తుంది.
-యజమాని తన భూమిని ముగ్గురు లేదా నలుగురికి కౌలుకు ఇస్తే... ఆ భూమి యజమానితోపాటు ఆ కౌలురైతులలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
- డీ పట్టా భూముల్లో సాగుచేస్తున్న కౌలు రైతులు కూడా ఈ పథకం కింద అర్హులే.
-ఆన్‌లైన్‌లో భూమి నమోదుకాని రైతులకు కూడా దీనిని వర్తింపచేస్తున్నారు.
-ఉద్యాన పంటలు, పట్టు పరిశ్రమ చేస్తున్న రైతులు కూడా దీనిలో అర్హత పొందుతారు.
-స్థానిక సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులలో... గుమస్తాలు, నాలుగో తరగతిసిబ్బంది, గ్రూప్‌-డీలో ఉన్న వారు సొంత భూమి ఉండి పొలం సాగు చేస్తుంటే ఈ పథకంలో లబ్ధి పొందుతారు.
రైతుభరోసా పథకంలో అనర్హులు
- రాజ్యాంగబద్ధమైన పదవులు చేపట్టిన వారికి ఈ పథకం వర్తించదు. మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు.
- ఒక రేషన్‌ కార్డులో ఉన్న వ్యక్తులలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉంటే ఆ కుటుంబానికి ఈ పథకం వర్తించదు.
-ఒక రేషన్‌ కార్డులో ఉన్న వ్యక్తులలో ఎవరైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో పనిచేసి ... పదవీ విరమణ చేస్తే ఈ పథకంలో అనర్హులు అవుతారు.
-రైతులు తమ వ్యవసాయ భూములను ఇళ్ళపట్టాలుగా మార్చుకుంటే... అనగా రియల్‌ ఎస్టేట్‌ ప్లాట్లు వేస్తే ఈ పథకం వర్తించదు.
-వ్యవసాయ భూములను చేపల చెరువులుగా మార్చుకుంటే ఈ పథకంలో ఆ భూముల రైతులకు పరిహారం అందదు.
-గత ఏడాది వాణిజ్య, వృత్తి పన్నులు, జీఎస్టీ చెల్లించిన వారికి ఈ పథకం అమలు కాదు.
-వృత్తిపరమైన సంస్థల కింద రిజిస్టర్‌ అయిన తమ వృత్తులను కొనసాగిస్తున్న డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, చార్టెర్డ్‌ అకౌంటెంట్లు, ఆర్కిటెక్చర్లకు రైతుభరోసాలో పరిహారం ఇవ్వరు.
-నెలకు రూ.10 వేల కంటే ఎక్కువ పింఛన్‌ పొందుతున్న వారు అనర్హులు..
-భూమి.. భూ యజమాని తండ్రి లేక తల్లి పేరున ఉంటే.. వాళ్ళల్లో ఎవరైనా బతికుంటే ప్రస్తుతం భూమి సాగు చేస్తున్నా వారి వారసులకు ఈ పథకం వర్తించదు.
-బంజరు లేదా బీడు భూములను సాగుచేసుకుంటున్న వారికి ఆ సర్వే నెంబర్లతో ఈ పథకంలో అనర్హులవుతారు.
నెలాఖరులోపు లబ్ధిదారుల పరిశీలన పూర్తి చేస్తాం : కేంద్రప్రభుత్వం పీఎం కిసాన్‌ కింద రెండు విడతలుగా ఆరు నెలల నుంచి రూ.4 వేలు విడుదల చేసింది. ఆ జాబితాల ఆధారంగా గ్రామాల వారీగా వారిలో అనర్హులను తొలగిస్తాం... నెలాఖరు లోపు లబ్ధిదాలరును ఖరారుచేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే మండలాల వారీగా ఈ ప్రక్రియ వేగవంతంగా సాగుతోంది. - విజయభారతి, జేడీ, వ్యవసాయశాఖ


Popular posts
*వింజమూరు ప్రజలు జాగ్రత్తలు వహించండి* డాక్టర్ రమేష్.... వింజమూరు, సెప్టెంబర్ 22 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి పట్ల తగు జాగ్రత్తలు వహించాలని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైధ్యాధికారి డాక్టర్ రమేష్ కోరారు. ఇప్పటివరకు మండలంలో 500లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగిందన్నారు. అయితే అదే స్థాయిలో బాధితులు కోలుకుంటుండటం సంతోషకరమైన విషయమన్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ వైరస్ పట్ల అవగాహనా రాహిత్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం శ్రేయస్కరం కాదన్నారు. కరోనా నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖలు ఎంతగానో కృషి చేస్తున్నాయన్నారు. అయితే ప్రభుత్వ సూచనలను పెడచెవిన పెట్టడం వలన వైరస్ ప్రబలేందుకు పరోక్షంగా దోహదపడుతున్నామన్నారు. కనీస జాగ్రత్తలు పాటించిన పక్షంలో కరోనాను అంతమొందించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ప్రతి నిత్యం వేడి వేడి ఆహార పదార్ధాలను భుజించడం, దాహం వేసినప్పుడు గోరువెచ్చని నీటిని సేవించడం, యోగా, ముఖానికి మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి సూచనలను ప్రతి ఒక్కరూ విధిగా అలవాటు చేసుకోవాలన్నారు. వైరస్ సోకిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రమేష్ తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నేరస్తుడిని కఠినంగా శిక్షించాలి : సీఎం జగన్‌
16 న చిన్న, మధ్యతరహా పత్రికల రాష్ట్ర మహాసభ : మల్లెల      
చెన్నకేశవ స్వామి ఆలయ ఈవో నారాయణ రెడ్డి మృతి పట్ల మంత్రి సంతాపం