ట్విట్టర్ ఖాతాలను నిలుపుదల చేయడం  దుర్మార్గo.: పోతిన వెంకట మహేష్

జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం శతఘ్ని అధికారిక ట్విట్టర్ ఖాతాతో పాటు 400   పార్టీ మద్దతుదారుల ట్విట్టర్ ఖాతాలను నిలుపుదల చేయడం  దుర్మార్గo.


 


     విజయవాడ సెప్టెంబర్ 19 (అంతిమ తీర్పు) :           బెంజిసర్కిల్ వద్ద గల జనసేన పార్టీ  కార్యాలయంలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం శతఘ్ని అధికారిక ట్విట్టర్ ఖాతాతో పాటు 400 పార్టీ మద్దతుదారుల ట్విట్టర్ ఖాతాలను నిలుపుదల చేయడం  దుర్మార్గమని దీని వెనుక ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల కుట్ర దాగి ఉందని ప్రధానంగా సేవ్ నల్లమల మరియు 100 రోజుల వైఎస్ జగన్ పాలనలో ఫెయిల్ అయ్యారని  పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు స్పందించి నందున దానికి విశేష మైనటువంటి ప్రజా మద్దతు సోషల్ మీడియాలో కూడా వస్తున్నందున ఓర్వలేకే ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు కలసి కుట్ర పన్నాయని ప్రభుత్వాలు చేస్తున్న తప్పులపై నిర్మాణాత్మకమైన విమర్శలు చేస్తే నియంతృత్వ పోకడలతో కక్ష సాధింపు చర్యలు ప్రజాస్వామ్యంలో ఎక్కువకాలం నిలవని పెద్ద పెద్ద నియంతలు కూడా కాలగర్భంలో కలిసిపోయిన విషయాల్ని ముఖ్యమంత్రులు గుర్తుపెట్టుకోవాలని సోషల్ మీడియా వేదికగా కోట్లాది మంది ప్రజలను సమస్యలపై అవగాహన పరుస్తూ ఉత్తేజపరచడం వలన ప్రజలు ఈ ప్రభుత్వాలు చేస్తున్న అక్రమాలపై ప్రజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నందున పార్టీ  సోషల్ మీడియా విభాగం అధికారిక ట్విట్టర్ ఖాతా పై మరియు మద్దతుదారుల ట్విట్టర్ ఖాతాలపై ఇటువంటి కుట్రలు పన్నుతున్నారని ముందు గా వైసీపీ సోషల్ మీడియా ఖాతాలు చూస్తే దిగజారుడుగా ఉంటాయని విజయసాయిరెడ్డి గారి ట్విట్టర్ లో భాష దారుణంగా ఉంటుందని, అసత్యాలతో ట్వీట్స్ ఉంటాయని, ప్రజల్ని తప్పు దోవ పట్టిస్తారాయన, చేయాల్సి వస్తే ముందు విసారెడ్డి ట్విట్టర్ ఖాతా బ్లాక్ చేయాలని, వాస్తవాలను ప్రజల దృష్టికి తీసుకువెళ్తున్న౦దున జీర్ణించుకోలేకపోతున్న వైఎస్ఆర్సిపి నాయకులు ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారని మహేష్ ఆరోపించారు.


ఇంద్రకీలాద్రిపై ఉన్న బెజవాడ కనకదుర్గమ్మ ఆలయంలో హౌస్ కీపింగ్ మరియు యాంత్రిక పారిశుద్ధ్య టెండర్లను పదేపదే వాయిదా వేయడం వెనుక మంత్రి వెల్లంపల్లి హస్తముందని తన సొంత మనుషులకు ఈ కాంట్రాక్టు కట్టబెట్టేందుకు పలు దఫాలుగా వాయిదాలు వేస్తున్నారని దీనికి ఈవో సురేష్ బాబు కూడా  మద్దతు పలుకుతున్నారని సెప్టెంబరు 13న  కాంట్రాక్టులు ఖరారు చేయవలసి ఉండగా నేటి వరకు ఎందుకు ఈ టెండర్లను ఖరారు చేయలేదని కాంట్రాక్ట్ నియమ నిబంధనలు ఉల్లంఘించి మంత్రి సొంత మనుషులకు కట్టబెట్టేందుకు ఈ కాంట్రాక్టు వాయిదా ఈవో సురేష్ బాబు కావాలనే వేస్తున్నారని దేవాలయం లో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాల్సిన మంత్రి అవినీతిని ప్రోత్సహిస్తున్నారని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని మహేష్ డిమాండ్ చేశారు.


 


Popular posts
*వింజమూరు ప్రజలు జాగ్రత్తలు వహించండి* డాక్టర్ రమేష్.... వింజమూరు, సెప్టెంబర్ 22 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి పట్ల తగు జాగ్రత్తలు వహించాలని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైధ్యాధికారి డాక్టర్ రమేష్ కోరారు. ఇప్పటివరకు మండలంలో 500లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగిందన్నారు. అయితే అదే స్థాయిలో బాధితులు కోలుకుంటుండటం సంతోషకరమైన విషయమన్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ వైరస్ పట్ల అవగాహనా రాహిత్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం శ్రేయస్కరం కాదన్నారు. కరోనా నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖలు ఎంతగానో కృషి చేస్తున్నాయన్నారు. అయితే ప్రభుత్వ సూచనలను పెడచెవిన పెట్టడం వలన వైరస్ ప్రబలేందుకు పరోక్షంగా దోహదపడుతున్నామన్నారు. కనీస జాగ్రత్తలు పాటించిన పక్షంలో కరోనాను అంతమొందించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ప్రతి నిత్యం వేడి వేడి ఆహార పదార్ధాలను భుజించడం, దాహం వేసినప్పుడు గోరువెచ్చని నీటిని సేవించడం, యోగా, ముఖానికి మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి సూచనలను ప్రతి ఒక్కరూ విధిగా అలవాటు చేసుకోవాలన్నారు. వైరస్ సోకిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రమేష్ తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.
Image
ఆ నేరస్తుడిని కఠినంగా శిక్షించాలి : సీఎం జగన్‌
16 న చిన్న, మధ్యతరహా పత్రికల రాష్ట్ర మహాసభ : మల్లెల      
చెన్నకేశవ స్వామి ఆలయ ఈవో నారాయణ రెడ్డి మృతి పట్ల మంత్రి సంతాపం
కరోనా నియంత్రణకు దక్కన్ టూబాకో కంపెనీ  గ్రూప్
Image