టీటీడీ లో ఏపీకి అన్యాయం

టీటీడీ లో ఏపీకి అన్యాయం
మాజీ ఎమ్మెల్యే మాజీ టిటిడి పాలకవర్గ సభ్యురాలు అనంతలక్ష్మి 


తిరుమల తిరుపతి దేవస్థానం లో లో ఇటీవల జరిగిన పాలకవర్గ సభ్యులు నియామకాలు ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే,


రెండు సార్లు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకవర్గ సభ్యులుగా సేవలు అందించిన అనంతలక్ష్మి పేర్కొన్నారు.
సోమవారం 
కాకినాడ రూరల్ కాకినాడ రూరల్ వాకలపూడి లోని తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలకవర్గ సభ్యులుగా ప్రత్యేక ఆహ్వానితులుగా 36 మందిని ముఖ్యమంత్రి జగన్ తీసుకున్నారు .అయితే ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారిని కేవలం ఎనిమిది మందికి మాత్రమే స్థానం కల్పించి తెలంగాణకు చెందిన ఏడుగురికి అవకాశం కల్పించడం దారుణమన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏపీకి చెందిన ఎనిమిది మంది మినహాయిస్తే మిగిలినవారు 28 మంది ఇది పక్క రాష్ట్రాల వారన్నారు కనీసం 13 జిల్లాల నుండి జిల్లాకు ఒక్కొక్కరు చొప్పున 13 మందిని తీసుకున్న బాగుండేదన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో శేఖర్ రెడ్డి ను చంద్రబాబు బినామీగా ప్రచారం చేశారని, నారా లోకేష్ 
100 కోట్లు తీసుకొని పాలకవర్గ సభ్యుడిగా నియమించారని అప్పట్లో అంబటి రాంబాబు వైఎస్సార్సీపీ తరఫున చేసిన వ్యాఖ్యలను ఆమె గుర్తు చేశారు. ఇప్పుడు తిరిగి శేఖర్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించడంపై ఎన్ని కోట్లు తీసు తీసుకున్నారో అంబటి రాంబాబు బయట పెట్టాలన్నారు