తెలుగు భాషా అమలులో అధికారులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కీలకం 


తేదీ : 24-09-2019,
అమరావతి


తెలుగు భాషా అమలులో అధికారులతో పాటు తల్లిదండ్రుల పాత్ర కీలకం 


• విభజనచట్టంలోని 9,10వ షెడ్యూల్లోని నిబంధనలను తూ.చా తప్పకుండా పాటించాలి


• ఈ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు చొరవ చూపాలి : అధికార భాషా సంఘం అధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌అమరావతి, సెప్టెంబర్ 24: తెలుగు భాషా అమలులో అధికారులతో పాటు తల్లిదండ్రుల పాత్ర ఎంతో అవసరమని, అధికార భాషా అమలులో వారి వారి మానసిక పరిపక్వత పెంచుకోవాల్సిన అవసరముందని అధికార భాషా సంఘం అధ్యక్షుడు, ప్రముఖ సాహితీవేత్త ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ అభిప్రాయపడ్డారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలోని ప్రచార విభాగంలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్‌ మాట్లాడుతూ... హిందీ భాషా అమలును  బలవంతంగా  రుద్దడం ఎంత తప్పో వద్దు అనడం కూడా అంతే తప్పు అన్నారు. రాష్ట్ర విభజన అనంతరం దామాషా ప్రకారం తెలుగు విశ్వవిద్యాలయంకు సంబంధించి 60:40 నిష్పత్తి ప్రకారం విభజనను చేపట్టడంతో పాటు చట్టంలోని 9,10వ షెడ్యూల్లోని నిబంధనలను తూ.చా తప్పకుండా పాటించాల్సిన అవసరముందని ఈ విషయమై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు చొరవ చూపాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీశైలం, కూచిపూడి, రాజమహేంద్రవరంలో ఉన్న తెలుగు విశ్వవిద్యాలయాల విస్తరణ కేంద్రాల్లో మూడు కోర్సులను మాత్రమే బోధిస్తున్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్ లాంటి రెండు ప్రదేశాల్లో ఎక్కువ కోర్సులను అందజేయడం జరుగుతోందని ఆయన వెల్లడించారు. కోర్టు ఉత్తర్వుల నుండి అధికారులు వెలువరించే ఉత్తర్వుల వరకు అన్ని ఉత్తర్వులు తెలుగులో ఉండేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయమై జిల్లాల నుండి అమలు అయ్యే విధంగా ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో చర్చించి చర్యలు చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. తాను వివిధ పర్యాటక ప్రాంతాలు, విదేశాల్లో పర్యటించడం జరిగిందని పలు పర్యాటక ప్రాంతాల్లో అక్కడి గైడ్ లు పర్యాటకులకు అనువైన భాషలో వివరించుటకు చాలా ఇబ్బందులు పడటం గుర్తించామన్నారు. త్రిభాషా సూత్రాన్ని విధిగా పాటించాల్సిన అవసరముందన్నారు.హిందీని అనుసంధాన భాషగా మాత్రమే పరిగణించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఆయన తెలిపారు.  తమిళనాడులో  సైతం దక్షిణ భారత మహాసభ వంటి కేంద్రాలు ఉన్నాయని, అక్కడ హిందీ నేర్చుకోవడంతో పాటు రాజకీయ లబ్ధికి వాడుకుంటారని అయినప్పటికీ వారి మాతృభాష అయిన తమిళంను మరవలేదని ఆయన వెల్లడించారు. రాజమహేంద్రవరంలో తెలుగు విశ్వవిద్యాలయం త్వరితగతిన ఏర్పాటుకు  చర్యలు చేపట్టాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరనున్నట్లు ఆయన పేర్కొన్నారు. హిందీ భాషా ప్రావీణ్యత లేకపోవడం వలన మాజీ ప్రధాని దేవేగౌడ వంటి వారు పలు సమస్యలను ఎదుర్కొన్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఇటీవల గుంటూరు జిల్లా పెనుమాకలో నిర్వహించిన రాజన్నబడి కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగును ఒక బోధనాంశంగా గుర్తించి అమలు చేయడం జరుగుతుందని తెలిపారని ఇది శుభపరిణామమని ఆయన కొనియాడారు.


 


.........................


Popular posts
*వింజమూరు ప్రజలు జాగ్రత్తలు వహించండి* డాక్టర్ రమేష్.... వింజమూరు, సెప్టెంబర్ 22 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి పట్ల తగు జాగ్రత్తలు వహించాలని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైధ్యాధికారి డాక్టర్ రమేష్ కోరారు. ఇప్పటివరకు మండలంలో 500లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగిందన్నారు. అయితే అదే స్థాయిలో బాధితులు కోలుకుంటుండటం సంతోషకరమైన విషయమన్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ వైరస్ పట్ల అవగాహనా రాహిత్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం శ్రేయస్కరం కాదన్నారు. కరోనా నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖలు ఎంతగానో కృషి చేస్తున్నాయన్నారు. అయితే ప్రభుత్వ సూచనలను పెడచెవిన పెట్టడం వలన వైరస్ ప్రబలేందుకు పరోక్షంగా దోహదపడుతున్నామన్నారు. కనీస జాగ్రత్తలు పాటించిన పక్షంలో కరోనాను అంతమొందించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ప్రతి నిత్యం వేడి వేడి ఆహార పదార్ధాలను భుజించడం, దాహం వేసినప్పుడు గోరువెచ్చని నీటిని సేవించడం, యోగా, ముఖానికి మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి సూచనలను ప్రతి ఒక్కరూ విధిగా అలవాటు చేసుకోవాలన్నారు. వైరస్ సోకిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రమేష్ తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.
Image
ఆ నేరస్తుడిని కఠినంగా శిక్షించాలి : సీఎం జగన్‌
16 న చిన్న, మధ్యతరహా పత్రికల రాష్ట్ర మహాసభ : మల్లెల      
చెన్నకేశవ స్వామి ఆలయ ఈవో నారాయణ రెడ్డి మృతి పట్ల మంత్రి సంతాపం
కరోనా నియంత్రణకు దక్కన్ టూబాకో కంపెనీ  గ్రూప్
Image