ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌తో ‘న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌’ ప్రతినిధుల భేటీ

05–09–2019
అమరావతి


*ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌తో 'న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌' ప్రతినిధుల భేటీ*


అమరావతి: ప్రముఖ అంతర్జాతీయ బ్యాంకు 'న్యూ డెవలప్‌ మెంట్‌ బ్యాంకు' ప్రతినిధులు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌తో భేటీ అయ్యారు. బ్యాంకు వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.జాంగ్, ప్రాజెక్టు హెడ్‌ రాజ్‌పుర్కర్‌ తాడేపల్లి నివాసంలో ఈ ఉదయం ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. రాష్ట్రానికి 6వేల కోట్ల రూపాయల రుణం మంజూరు ప్రతిపాదన త్వరలో బ్యాంకు బోర్డు ఆమోదానికి వెళ్తున్న అంశం వీరిమధ్య చర్చకు వచ్చింది. రోడ్లను మెరుగుపరచడంతోపాటు, వివిధ ప్రాజెక్టులకోసం ఈ మొత్తాన్ని వెచ్చిస్తారు. రుణంలో 30 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుండగా, 70శాతాన్ని బ్యాంకు మంజూరుచేస్తుంది. 32 సంవత్సరాల్లో ఈ రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్కూళ్లు, ఆస్పత్రులు, పరిశుభ్రమైన తాగునీరు సదుపాయం సహా రోడ్ల నిర్మాణం ప్రాజెక్టులకు మరింత సహాయం అందించాలని ముఖ్యమంత్రి బ్యాంకు ప్రతినిధులకు విజ్ఞప్తిచేశారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి రూ.25 వేల కోట్ల రూపాయలను మంజూరుచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. 


బ్రిక్స్‌ దేశాలైన బ్రెజిల్, రష్యా, భారత్,  చైనా, సౌతాఫ్రికా ఈ బ్యాంకును 2015లో ఏర్పాటుచేశాయి. షాంఘై వేదికగా పనిచేస్తున్న ఈబ్యాంకు ఇప్పటివరకూ వివిధ ప్రాజెక్టులకు రూ.75వేల కోట్ల రూపాయలను రుణాలుగా మంజూరుచేసింది. ఒక్క భారత్‌లోనే రూ.25వేల కోట్లు మంజూరు చేసింది.


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image