పోలేరమ్మ జాతర లో మంత్రులు అనీల్, వెల్లంపల్లి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి పోలేరమ్మ జాతరలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ గారు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుపతి పార్లమెంట్ సభ్యులు బల్లి దుర్గా ప్రసాదరావు గారు వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు మంత్రులకు అలాగే ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి,  శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, గూడూరు శాసనసభ్యులు వెలగపల్లి ప్రసాద్ రావు గార్లకు  శాలువా కప్పి సన్మానించారు. మాజీ డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకనాథ్, కార్పోరేషన్ మాజీ ఫ్లోర్ లీడర్ పి. రూప్ కుమార్ యాదవ్ లు మంత్రులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు.