24–09–2019
అమరావతి
అమరావతి: పీపీఏలపై కోర్టు తీర్పు చంద్రబాబు, టీడీపీకి చెంపదెబ్బ: విద్యుత్‌శాఖమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
ఇప్పటికైనా చంద్రబాబు, టీడీపీ నేతలు బుద్ది తెచ్చుకోవాలి: విద్యుత్‌శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
ఇవాళ పీపీఏల పునఃసమీక్ష వ్యవహారాన్ని మేం కోరినట్టుగా ఏపీఈఆర్సీకి హైకోర్టు అప్పగించింది: బాలినేని
రేట్లు ముట్టుకోకూడదన్న కంపెనీల వాదనను కోర్టు తోసిపుచ్చింది: బాలినేని
రేట్లు పునఃసమీక్షించ వచ్చని హైకోర్టు చెప్పకనే చెప్పింది:
మేం చేస్తున్న ప్రయత్నాలన్నీ ప్రజలకోసమే: మంత్రి బాలినేని
విద్యుత్‌రంగ వ్యవస్థను గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు : బాలినేని శ్రీనివాసరెడ్డి
అవినీతిరహిత, పారదర్శక పాలనను ప్రజలకు అందించడమే లక్ష్యంగా సీఏం శ్రీ జగన్ ముందడుగు వేస్తున్నారు : మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
అందులో భాగంగా పీపీఏల పై కూడా సమీక్ష చేయాలని నిర్ణయించారు : బాలినేని శ్రీనివాసరెడ్డి
చేతనైతే ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం ధైర్యంగా తీసుకుంటున్న చర్యలను సమర్థించాలి, లేకపోతే మౌనంగా కూర్చోవాలి:
బాలినేని
కొన్ని కంపెనీలతో కుమ్మక్కై అధికధరకు గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలను మాత్రమే పునఃసమీక్షిస్తామని మేం చెప్పాం: మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
ప్రజా ప్రయోజనాల కోసం, విద్యుత్ పంపిణీ సంస్థలు బతికిబట్టకట్టడానికే ఈ నిర్ణయాలని చెప్పాం: మంత్రి బాలినేని
ప్రజలకోసం కాకుండా లోపాయికారీ ఒప్పందాలు కోసం చంద్రబాబు, టీడీపీ నాయకులు పోరాటం చేశారు:
ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకుని ప్రభుత్వంమీద దుష్ప్రచారంచేశారు:
విద్యుత్ కొనుగోలు ఒప్పందాల పునఃసమీక్ష ఘోర అపరాధంగా అభివృద్ధికి నిరోధంగా కట్టుకథలు అల్లారు:
పీపీఏల పునఃసమీక్ష రాజ్యాంగ విరుద్ధం, చట్ట విరుద్ధం అని మాట్లాడారు:
పరిశ్రమలకు తక్కువ ధరకు విద్యుత్ రావాలన్నా, డిస్కంలు బతికి బట్టకట్టాలన్నా, విద్యుత్ కంపెనీలకు సకాలంలో ఛార్జీలు చెల్లించాలన్నా... ఈచర్యలు తప్పనిసరి : మంత్రి బాలినేని
మేం ప్రజల తరఫున మాట్లాడుతున్నాం, ఛార్జీలు తక్కువ ఉంటేనే ప్రజలకు, పారిశ్రామిక రంగానికి మేలు జరుగుతుంది: మంత్రి బాలినేని
చంద్రబాబు లంచగొండి విధానాల వల్లే గడచిన ఐదేళ్లలో విద్యుత్ సంస్థల బకాయిలు 20వేల కోట్లు దాటాయి: మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి