వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

వైద్య ఆరోగ్యశాఖపై సీఎం జగన్‌ సమీక్ష
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య ఆరోగ్యశాఖపై సచివాలయంలో బుధవారం సమీక్ష నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి సుజాతారావు అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల కమిటీ సమగ్ర నివేదిక సమర్పించింది. వైద్య ఆరోగ్యశాఖలో చేపట్టాల్సిన సంస్కరణలను సిఫార్సు చేయడానికి రాష్ట్రప్రభుత్వం సుజాతారావు అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. కమిటీ సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా మూడు నెలలపాటు పర్యటించి పలువురి అభిప్రాయాల్ని తెలుసుకున్నారు. సామాన్య ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. గ్రామీణ స్థాయి నుంచి జిల్లాస్థాయి ఆస్పత్రుల వరకు వాటి పనితీరు, భవనాల  ఏర్పాటు వంటి అంశాలు సమీక్షలో చర్చకు వచ్చాయి. 104 వాహనాల పనితీరుతో పాటు కొన్ని జిల్లా ఆస్పత్రుల్లో ఇంకా మల్టీ స్పెషాలిటీ సేవలు అందుబాటులో లేవని, డాక్టర్ల కొరత, నిపుణల కొరతపై కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చ కొనసాగుతోంది.