నెలలు తరబడి దర్శనమిస్తున్న లీజు బోర్డులు

గతంలో గుంటూరుకు క్యూ కట్టిన కార్పొరేట్‌ వ్యాపార సంస్థలు


పోటీలు పడి ప్రారంభించిన షాపింగ్‌ మాల్స్‌


నేడు వ్యాపారాలు లేక అద్దెలు కట్టలేని పరిస్థితి


నాడు పెద్దనోట్ల రద్దు.. జీఎస్టీ.. ఆ తర్వాత ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్రభావం


నెలలు తరబడి దర్శనమిస్తున్న లీజు బోర్డులు


దిగి వస్తున్న భవన యజమానులు


30 శాతం అద్దె తగ్గింపు... ఖాళీ చేయవద్దని వినతులు


గుంటూరు నగరానికి గతంలో క్యూ కట్టిన కార్పొరేట్‌ సంస్థలు నేడు వెనుకంజ వేస్తున్నాయి. పోటీపడి ప్రారంభించిన షాపింగ్‌ మాల్స్‌లో వ్యాపారాలు లేక అద్దె కట్టలేని పరిస్థితులు నెలకొన్నాయి. మూడేళ్ల కిందటి నోట్ల రద్దు.. జీఎస్టీ ప్రభావంతో క్రమేణా వ్యాపారాలు క్షీణించగా.. ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్రభావం కూడా ఉండడంతో దుకాణాలు మూతపడుతున్నాయి. షాపులు ఖాళీ అవుతుండడంతో యజమానులు కూడా 30 శాతం అద్దె తామే తగ్గిస్తామంటూ ముందుకు వస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.


 


బూజుపట్టిన లీజు బోర్డులు


బ్రాడీపేట 4వ లైనులో కమర్షియల్‌ స్పేస్‌ లీజు బోర్డులు నెలలు తరబడి ఉంటుం డటంతో బూజు పడుతున్నాయే కాని అద్దెలకు రావడం లేదని పలువురు యజమానులు ఆందోళన చెందుతున్నారు. రూ.కోట్లు వెచ్చించి వ్యాపార సముదాయాలు నిర్మిస్తే అద్దె తీసుకునేందుకు ఆయా కంపెనీలు, వ్యాపారులు వెనుకాడుతున్నారు. అలాగని తక్కువకు ఇవ్వలేక రెండు - మూడేళ్లుగా లీజు బోర్డులు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు.


 


గుంటూరు: రాజధాని ప్రక టన నేపథ్యంలో గుంటూరు నగరం జెట్‌ స్పీడ్‌తో అభివృద్ధి చెందుతుందని అంతా ఊ హించారు. వెనుకా ముందు ఆలోచించ కుండా కార్పొరేట్‌ వ్యాపార సంస్థల నుంచి చిన్న వ్యాపారుల వరకు కోట్లు వెచ్చించి వ్యాపార సంస్థలు ప్రారంభించారు. ముఖ్యం గా లక్ష్మీపురం మెయిన్‌ రోడ్డు గడిచిన రెండేళ్లలో ఊహించని విధంగా మారి పోయింది. బ్రాడీపేట మెయిన్‌ రోడ్డు, నాలుగో లైనులో కూడా ఇదే తరహాలో ప్రముఖ వ్యాపార సంస్థలు వచ్చాయి. వస్త్ర దుకాణాలు, బంగారం, సెల్‌ఫోన్‌ ఎలక్ర్టానిక్‌ షోరూంలు, బ్యాంక్‌లు, ఫుడ్‌ కోర్ట్‌లు.. ఇలా అనేక వ్యాపార సంస్థలు వెలిశాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో కమర్షియల్‌ స్పేస్‌కు విపరీతమైన గిరాకీ వచ్చింది. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కార్పొరేట్‌ వ్యాపార సంస్థలు వాలిపోయాయి. తామే నిర్మాణం పూర్తిచేసు కొని అద్దె చెల్లిస్తామని ముందుగా అడ్వాన్స్‌లు కూడా ఇస్తామంటూ పోటీ పడ్డారు. అప్పటివరకు ఆయా రోడ్లలో కనిపిం చిన రెసిడెన్షియల్‌ భవనాలు మాయమై.. వ్యాపార సంస్థలు, మాల్స్‌ దర్శనమిచ్చాయి. ఆయా రోడ్లలో కమర్షియల్‌ స్పేస్‌ చదరపు అడుగు రూ.80 నుంచి రూ.130 వరకు అద్దె పలికింది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో మాత్రం చదరపు అడుగుకు రూ.120కు తగ్గకుండా అద్దె తీసు కున్నారు. రాజధాని నేపథ్యంలో వివిధ జిల్లా లు, ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారి సంఖ్య కూడా పెరిగింది. ఉద్యోగులు, ఆ యా వ్యాపార సంస్థల వల్ల ఇతర ప్రాంతాల నుంచి వచ్చే జనాభా కూడా ఎక్కువైంది. దీంతో మొదటిలో ఆయా వ్యాపారాలు బాగానే సాగాయి. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత బాగుంటుందని ఆయా సంస్థల నిర్వాహకులు ఆశపడ్డారు.


నోట్ల రద్దు.. జీఎస్టీ ప్రభావంతో..


పెద్ద నోట్ల రద్దు.. జీఎస్టీ ఏర్పాటుతో ఒక్క సారిగా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. దీంతో పాటు రియల్‌ఎస్టేట్‌ రంగం కుదేలు కావ డంతో ఆ ప్రభావం అన్ని వ్యాపార సంస్థలపై పడింది. గడిచిన మూడేళ్లుగా వ్యాపార రం గంలో ఒడిదుడుకులు ప్రారంభమయ్యాయి. దీంతో రూ.లక్షలు అద్దెలు చెల్లించి వ్యాపార దుకాణాలు, మాల్స్‌ నిర్వహించడం భారంగా మారింది. దీనికితోడు ఆన్‌లైన్‌ షాపింగ్‌ ప్రభావం కొంతవరకు మాల్స్‌, కార్పొరేట్‌ వ్యాపార సంస్థలపై కూడా పడింది. సిబ్బం ది కి జీతాలు ఇవ్వలేక, అద్దెలు చెల్లించలేక నిర్వాహకులు సతమతమయ్యారు. దీంతో ఆయా రోడ్లలోని పలు సంస్థలు మూసివేసే పరిస్థితికి వచ్చాయి.


 


దిగివచ్చిన యజమానులు


తాము దుకాణాలను నిర్వహించలేమని కొందరు చేతులెత్తేయడంతో భవన యజ మానులు దిగి వచ్చారు. ప్రస్తుతం చెల్లిస్తున్న అద్దెలో 30శాతం తగ్గించేందుకు అంగీ కరించారు. దీంతో కొందరు తాత్కాలికంగా మూసివేత ఆలోచన విరమించుకున్నారు. అయితే మరికొందరు మాత్రం దుకాణాలను వేరే వారికి అమ్ముకోవడమో, మూసివే సు కోవడమో తప్ప మరో మార్గంలేదనే నిర్ణయానికి వచ్చారు. లక్ష్మీపురం రోడ్డులో రెండు ప్రముఖ దుకాణాలకు అద్దె 40 శాతం వరకు తగ్గించినట్లు తెలుస్తుంది. మరో దుకాణం మూసివేత దిశగా ఉన్నట్లు సమాచారం. దానిని మరో సంస్థ లీజుకు తీసుకునే ఆలోచనలో ఉంది. లక్ష్మీపురం రోడ్డుతోపాటు, బ్రాడీపేట నాలుగో లైను లోనూ పలు దుకాణాలు మూతపడే అవ కాశం ఉన్నట్లు వ్యాపారవర్గాల్లో చర్చ నడు స్తోంది. ఫుడ్‌కోర్ట్స్‌ పరిస్థితి కొంత ఆశా జనకంగా ఉంది. కార్పొరేట్‌ వ్యాపార సంస్థలే కాక చిన్నచిన్న దుకా ణాలు, బ్రాండెడ్‌ షాపులు సైతం వ్యాపా రాలు చేయలేని పరిస్థితికి వచ్చాయి. కొందరు స్థాయికి మించిన అద్దెలకు తీసు కోకపోవడంతో ప్రస్తుత పరిస్థితుల్లో మనుగడ సాగించగలుగుతున్నారు. రానున్న రోజుల్లో మరింత గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవ కాశం ఉందని వారు అంటున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, రాజఽధాని పనులు నిలిపివేయడంతో ఆ ప్రభావంపై నగరంలోని వ్యాపారాలపై మరింత ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.


Popular posts
87-88 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థుల కలయిక
Image
*పేదలకు వరప్రసాదినిలా 108, 104 సేవలు* తిప్పిరెడ్డి.నారపరెడ్డి..... వింజమూరు, జూలై 1 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం లాంచనంగా ప్రారంభించిన 108, 104 అంబులెన్సు వాహనాలు పేద వర్గాల ప్రజలకు వరప్రసాదినిగా మారనున్నాయని మండల వై.సి.పి కన్వీనర్ తిప్పిరెడ్డి.నారపరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు వై.యస్.జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్రలో భాగంగా రాష్ట్రంలో వై.సి.పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా 108, 104 సేవలను విస్తరించనున్నామని హామీ ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ నేపధ్యంలో దాదాపుగా 201 కోట్ల రూపాయల నిధులను వెచ్చించి 1088 అంబులెన్సు వాహనాలను విజయవాడలోని బెంజి సర్కిల్ కూడలి వద్ద ప్రారంభించడం అభినందనీయమని నారపరెడ్డి కొనియాడారు. దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖర్ రెడ్డి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు నాడు ఆరోగ్యశ్రీతో పాటు 108 వాహనాలను అందుబాటులోకి తేవడం జరిగిందన్నారు. కాలక్రమేణా 108 వాహనాల వ్యవస్థ మరుగున పడి వాటి మనగడే ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి జగన్ తండ్రి బాటలో పయనిస్తూ ఒకేసారి 1088 అంబులెన్సు వాహనాలను ప్రజలకు సేవ చేసేందుకు ప్రారంభించి అటు తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ ఇటు ఆపదలలో ఉన్నవారికి ఆపద్భాంధవునిలా నిలిచారన్నారు. ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి.చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో ఈ అంబులెన్సు వాహనాలు త్వరలోనే ఉదయగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు కేటాయించనున్నారని నారపరెడ్డి తెలియజేశారు. ప్రజల సం క్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న యువ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన పధకాలతో పాటు అదనంగా కొత్త పధకాలకు శ్రీకారం చుడుతుండటం గొప్ప విషయమన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉన్నప్పటికీ ప్రజల సం క్షేమమే లక్ష్యంగా సుపరిపాలన అందిస్తున్న సి.యం జగన్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారని తిప్పిరెడ్డి.నారపరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
Image
హర్జిత్ సింగ్ పోరాట పటిమ పోలీసు శాఖ కు ఆదర్శం : డి‌జి‌పి గౌతమ్ సవాంగ్ IPS
Image
చనిపోయాక కూడా ఆవ్యక్తికి మనశ్శాంతి లేకుండా దుష్ప్రచారమా?
గుండెపోటుతో మరణించిన వాలంటీర్ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం: సీఎం  వైయస్.జగన్
Image