అమితాబ్ బచ్చన్  కీర్తి కిరీటంలో ఓ కలికితురాయి

 


*అమితాబ్ బచ్చన్  కీర్తి కిరీటంలో ఓ కలికితురాయి* 


సుప్రసిద్ధ నటులు శ్రీ అమితాబ్ బచ్చన్ గారిని దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిందనే వార్త నాకెంతో సంతోషాన్ని కలిగించింది. అలుపెరుగని కెరటం లాంటి వారి నట జీవితం గొప్ప వ్యక్తిత్వ వికాస పాఠం. నటనలో తనకంటూ ఒక ఒరవడిని సృష్టించుకున్నారు. అమితాబ్ గారి కీర్తి కిరీటంలో దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ఓ కలికితురాయి. వారికి నా తరఫున, జనసైనికుల తరఫున హృదయపూర్వక అభినందనలు. అన్నయ్య చిరంజీవి గారు నటించిన ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా'లో కీలక పాత్రలో అమితాబ్ గారు నటించిన సందర్భంలో సెట్లో కలిశాను. ఎంతో హుందా అయిన వారి వ్యక్తిత్వం, స్నేహపూర్వకంగా పలకరించిన తీరు మరచిపోలేనివి. - పవన్ కల్యాణ్
అధ్యక్షులు, జనసేన