శివప్రసాద్ పార్థివదేహానికి మంత్రి పెద్దిరెడ్డి నివాళి.. భావోద్వేగం
తిరుపతి : టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ పార్థివదేహానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. శివప్రసాద్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. 'రాజకీయాలకు సంబంధం లేకుండా ఆయనతో నాకు అవినాభావా సంబంధం ఉంది. శివప్రసాద్ విలక్షణ రాజకీయ నాయకుడు. రాజకీయాలకు అతీతంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఆయన అకాల మరణం జిల్లా వాసులకు తీరని లోటు. ఆయన ఆత్మశాంతి చేరుకూరాలని భగవంతున్ని కోరుకుంటున్నాను. అన్నయ్య అని ప్రేమతో పిలిచే నేతను కోల్పోయాం' అని పెద్దిరెడ్డి మీడియాకు వెల్లడిస్తూ ఆవేదనకు లోనయ్యారు. ఈ సందర్భంగా శివప్రసాద్ కుటుంబ సభ్యులను మంత్రి పరామర్శించారు. అంత్యక్రియలు 23న సోమవారం అగరాలలో నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా టీడీపీ సీనియర్ నాయకుడు శివప్రసాద్‌కు నివాళులర్పించేందుకు పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత లోకేష్ సోమవారం తిరుపతికి రానున్నారు.
శివప్రసాద్ పార్థివదేహానికి మంత్రి పెద్దిరెడ్డి నివాళి.. భావోద్వేగం