సోలార్‌ ఎనర్జీని కొనుగోలు చేయలేదంటూ వస్తున్న వార్తలు అవాస్తవం

30-09-2019
అమరావతి


*ఏపీ విద్యుత్ శాఖ కార్యదర్శి పత్రికా ప్రకటన*


విజయవాడ: విండ్‌, సోలార్‌ ఎనర్జీని కొనుగోలు చేయలేదంటూ వస్తున్న వార్తలు అవాస్తవం: విద్యుత్‌ శాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్‌
వాతావరణ మార్పులు కారణంగా గడచిన 10 రోజులుగా విండ్‌, సోలార్‌ విద్యుత్పత్తి సరిగ్గాలేదు: విద్యుత్‌ శాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్‌
పీక్‌ అవర్స్‌లో విద్యుత్‌ జెనరేట్‌ కావడంలేదు 
గడచిన 10 రోజుల్లో 3వేల మెగావాట్ల సౌర విద్యుత్‌కుగాను ఒకరోజు మాత్రమే కొద్దిసేపు గరిష్టంగా 815 మెగావాట్లు వచ్చింది
కనిష్టంగా 28 మెగావాట్లు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి
బొగ్గు నిల్వలపై ప్రభుత్వానికి సరైన ప్రణాళిక లేదన్న సమాచారన్ని తోసిపుచ్చిన విద్యుత్‌ శాఖ
గత ఏడాదితో పోలిస్తే అధికంగానే బొగ్గును నిల్వచేసుకున్నాం: విద్యుత్‌శాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్‌
2018  సెప్టెంబరు 30న జెన్‌కో పరిధిలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో నిల్వలు 29,543 మెట్రిక్‌ టన్నులు: 
2019 సెప్టెంబరు 30న బొగ్గు నిల్వలు 46,486 మెట్రిక్ టన్నులు
ముందుస్తుగా ప్లాన్‌ చేసుకోవడంవల్లే దాదాపు 16వేల మెట్రిక్‌ టన్నులు అదనంగా ఉండేలా చూసుకున్నాం
ఇందువల్లే 2018 జూన్, జులై, ఆగస్టు నెలలతో పోలిస్తే.. ఈఏడాది ఎక్కువ విద్యుత్ ను ఉత్పత్తిచేశాం:
బొగ్గు సరఫరాలో తీవ్ర అంతరాయాల సమయంలో ఈ అదనపు నిల్వలు కొంతమేర ఊరటనిచ్చాయి: 
కేఎస్కే థర్మల్ కేంద్రానికి రూ.120 కోట్లు చెల్లింపులు పూర్తిచేశాం:
విద్యుత్ ఎక్స్చేంజి నుంచి ఇవ్వాళ్టి నుంచి విద్యుత్ను కొనుగోలు చేస్తున్నాం
వచ్చే 7 రోజులపాటు రోజుకు 8 ర్యాక్ల చొప్పున సింగరేణి నుంచి బొగ్గు వస్తోంది: