స్పందనపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

17–09–2019,
అమరావతి.


*అమరావతి: స్పందనపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష*


*స్పందన ద్వారా అందే వినతుల పరిష్కారంలో నాణ్యతకోసం అధికారులకు వర్క్‌షాపులు: సీఎం*


దీనిపై కార్యాచరణ ప్రణాళిక తయారుచేశాం : సీఎం
ఎమ్మార్వోలు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లకు వర్క్‌షాపు: సీఎం
మనం సమస్యలు తీరుస్తామన్న ఆశతో ప్రజలు మన దగ్గరకు వస్తారు: సీఎం
వినతులు ఇచ్చేవారి స్థానంలో మనం ఉంటే.. ఎలా ఆలోచిస్తామో.. అదే రీతిలో మనం స్పందించాల్సి ఉంటుంది: సీఎం
అప్పుడే స్పందనకు ఆర్థం ఉంటుంది: సీఎం
ఎమ్మార్వోలు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు మరింత మానవీయ దృక్పథంతో వినతులకు పరిష్కారం చూపాలి: సీఎం
దీనికోసమే ఈ వర్క్‌షాపులు : సీఎం


*రాష్ట్ర స్థాయిలో చీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈనెల 24, 27 తేదీల్లో వర్క్‌షాపు.*


అక్టోబరులో జిల్లాల స్థాయిలో రెండురోజులపాటు వర్క్‌షాపులు : సీఎం


దిగువస్థాయి అధికారులకు మరింత మోటివేషన్‌ పెంచడమే దీని ఉద్దేశం: సీఎం


కలెక్టర్లు కూడా ఈ వర్క్‌షాపులో పాల్గొనాలి: సీఎం
నవంబర్‌ నెల నుంచి స్పందన వినతుల విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉంటుంది


*గ్రామ సెక్రటేరియట్లను అక్టోబరు 2 నుంచి ప్రారంభిస్తున్నాం: సీఎం*
గ్రామ సచివాలయాల్లో సోషల్‌ ఆడిట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి: సీఎం
 కొత్త రేషన్‌కార్డులు, పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి 
డిసెంబరు నుంచి ఇవ్వాలి : సీఎం
అక్టోబరు, నవంబరు నెలల్లో సామాజిక తనిఖీలు పూర్తిచేయాలి: సీఎం
గ్రామ, వార్డు సెక్రటేరియట్‌ అందుబాటులోకి రాగానే అక్కడే డిస్‌ప్లే ఉండాలి: సీఎం
రేషన్‌కార్డులు, పెన్షన్లు ఉన్నవారి జాబితాను బోర్డులో పెట్టాలి: సీఎం
ఇళ్లపట్టాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితా కూడా పెట్టే ప్రయత్నంచేయాలి: సీఎం
ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను పెట్టాలి:
ఈ జాబితామీద ఏమైనా అభ్యంతరాలు ఉన్నా, పథకం ఎవ్వరికీ అందకపోయినా ఆ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలి: సీఎం
అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందాలి: సీఎం
వారికి అందించాల్సిన ధర్మం, బాధ్యత మనదే: సీఎం


*సొంతంగా ఆటో, ట్యాక్సీ, మాక్సీ కాబ్‌లు నడుపుకుంటున్నవారికి ఏడాదికి రూ.10వేల పథకంపై రివ్యూ*
దరఖాస్తులు తీసుకోవడం, వాటికి తనిఖీలు, ఆమోదంపై సీఎం సమీక్ష


*ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్లస్థలాల పంపిణీపై సీఎం సమీక్ష*
లబ్ధిదారుల ఎంపిక, వెరిఫికేషన్‌ వేగవంతం చేయాలని సీఎం ఆదేశం
సెప్టెంబరు ఆఖరు నాటికి డేటా కలెక్షన్, వెరిఫికేషన్‌ పూర్తికావాలన్న సీఎం
అక్టోబరు చివరి నాటికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి ఎంతో తేల్చాలన్న సీఎం
నవంబర్‌ నుంచి అవసరమైన చోట భూముల కొనుగోలు ప్రక్రియ ప్రారంభంకావాలన్న సీఎం
ఈ కార్యక్రమం మీద అధికారులు దృష్టిపెట్టాలన్న సీఎం


*వైయస్సార్‌ కంటి వెలుగు కింద 5.3 కోట్లమంది ప్రజలకు కంటి పరీక్షలు: సీఎం*
ఆరు విడతలుగా కార్యక్రమం: సీఎం
మూడేళ్ల కాలంలో మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కంటికి సంబంధించిన వైద్యం అందేలా చర్యలు : సీఎం
*అక్టోబరు 10నుంచి 16 వరకూ తొలిదశ*
అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 70 లక్షల మందికి పైగా విద్యార్థులకు కంటిపరీక్షలు : సీఎం
*రెండో విడత కార్యక్రమం నవంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకూ: సీఎం*
*3,4,5,6 విడతలు ఫిబ్రవరి 1 , 2020 నుంచి : సీఎం*
పిల్లలకు అయిపోయిన తర్వాత మిగిలిన ప్రజలకు అందరికీ పరీక్షలు, చికిత్సలు దశలవారీగా అందిస్తాం: సీఎం
జిల్లాల్లో టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు: సీఎం
పటిష్టంగా ఈ కార్యక్రమం అమలు కావాలి: సీఎం
కంటి వెలుగు కార్యక్రమంకోసం చేసిన ఏర్పాట్లను సమీక్షించిన సీఎం
ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించామన్న అధికారులు
మొదటి స్క్రీనింగ్‌లో చికిత్స అవసరమున్న విద్యార్థులను గుర్తించి ఆమేరకు వారికి తదుపరి చికిత్స అందిస్తామన్న అధికారులు


*రూ.560 కోట్లతో కంటి వెలుగు కార్యక్రమం*
స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్‌ శస్త్రచికిత్స, ఇతర కార్యక్రమాలన్నీ వైయస్సార్‌ కంటి వెలుగు కింద చేపట్టనున్న ప్రభుత్వం


పౌష్టికాహార లోపం, రక్తహీనతను అధిగమించడంపై సీఎం సమీక్ష
గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్లు, అంగన్‌వాడీ కేంద్రాలను సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే ఈసమస్యను అధిగమించవచ్చన్న విశ్వాసం నాకు ఉంది: సీఎం
పౌష్టికాహార లోపంతో పిల్లలు, తల్లులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాల్లోని పేదరికంతో ఉన్న మహిళలను ఆ సమస్యనుంచి గట్టెక్కించాలి: సీఎం
ప్రభుత్వం ఇంతగా ఖర్చుచేస్తున్నా... పౌష్టికాహార లోపం ఎందుకు వస్తోందన్న సీఎం
అవసరమైతే మరింత ఖర్చు చేద్దాం, కాని సమస్యలు తీరాలి: సీఎం
వాలంటీర్లు ప్రతి ఇంటినీ సర్వేచేసి, పిల్లలను, తల్లులను, మహిళలను అంగన్‌వాడీ కేంద్రాల దగ్గరకు వెళ్లేలా మోటివేట్‌ చేయండి: సీఎం
అక్కడ వారికి పరీక్షలు నిర్వహించండి: సీఎం
పౌష్టికాహారలోపం, ఎనీమియా పరీక్షలు నిర్వహించండి: సీఎం
పరీక్షలు నిర్వహించిన తర్వాత వారి ఆరోగ్య కార్డులో పొందుపరిచి ఎప్పటికప్పుడు మానిటర్‌ చేయాలి: సీఎం
మానిటరింగ్‌ బాధ్యత కూడా వాలంటీర్లకు అప్పగించాలి: సీఎం
అంగన్‌వాడీల ద్వారా ఏమేమి ఇవ్వబోతున్నామో వాలంటీర్లకు సమాచారం ఇచ్చి, ఆమేరకు అవన్నీ కూడా పిల్లలకు, తల్లులకు అందేలా చూడాల్సిన బాధ్యత ఉంది: సీఎం
*పారిశుద్ధ్యం, ఆహారం, తాగునీటిపైనా ప్రజలకు అవగాహన కల్పించాలి: సీఎం*
వచ్చే సమీక్షా సమావేశానికి దీనిపై ఏం చర్యలు తీసుకున్నారన్నదానిపై నివేదించాలని సీఎం ఆదేశం


*పౌష్టికాహారలోపం, రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు రూ.43 లు రోజుకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం: సీఎం*
అలాగే పౌష్టికాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులకు రూ.18లు రోజుకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం: సీఎం


*రాయలసీమ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలపై సీఎం సమీక్ష*


*కర్నూలు, కడప, ప్రకాశం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాల సమాచారం వస్తోంది: సీఎం*
అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశం


అనంతపురంలో చిరుధాన్యాల విత్తనాలను పంపిణీ చేస్తున్నామని చెప్పిన అనంతపురం కలెక్టర్‌


*వచ్చే ఏడాదినాటికి రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తిస్థాయిలో నింపేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలన్న సీఎం*
117 టీఎంసీల నీరు వెళ్లినా రిజర్వాయర్లు నిండలేదంటే.. కాల్వల పరిస్ధితి ఎలా ఉందో అర్థమవుతుందోన్న సీఎం
వరదజలాలు సద్వినియోగం చేసుకునే దిశగా చర్యలు తీసుకోవాలన్న సీఎం


*ఇసుక కొరతపై కలెక్టర్లతో సీఎం సమీక్ష*
వర్షాలు, వరదల కారణంగా ఇసుక అందుబాటులోకి రాలేదన్న అధికారులు
గోదావరి, కృష్ణా నదుల్లో ఇంకా ప్రవాహాలు ఉన్నాయన్న అధికారులు
వరద తగ్గిన వెంటనే రీచ్‌లు అందుబాటులోకి వస్తాయన్న అధికారులు
*వరద తగ్గగానే వీలైనంత ఇసుకను స్టాక్‌యార్డుల్లోకి తరలించడానికి ముమ్మర ప్రయత్నాలు చేయాలని సీఎం ఆదేశం*


కౌలు రైతులకు సంబంధించి రైతు భరోసా మార్గదర్శకాలపై గ్రామ సచివాలయ ఉద్యోగికి, వాలంటీర్లకు పూర్తిస్థాయి అవగాహన ఉండాలన్న సీఎం
దానికి సంబంధించిన పత్రాలపై వారికి అవగాహన కల్పించాలన్న సీఎం
దరఖాస్తు పత్రాలు, ప్రొఫార్మాలు అన్నీకూడా అక్టోబరు 2 నాటికి అందుబాటులో ఉంచాలన్న సీఎం
లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తిచేయాలని సీఎం ఆదేశం


Popular posts
బాబా సాహెబ్ గారి గురించి తప్పక తెలుసుకోవాల్సిన అంశాలు
Image
*శాంతి భద్రతల పరిరక్షణ కోసం అందరం కృషి చేద్దాం..* నూతన సి.ఐ శ్రీనివాసరావు... ఉదయగిరి, జూలై 31 (అంతిమ తీర్పు-ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ప్రజలందరూ కూడా ప్రశాంత వాతావరణములో జీవన ప్రమాణాలు కలిగి ఉండే విధంగా అందరం శాంతి భద్రతల పరిరక్షణ దిశగా ముందుకు సాగుదామని ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి నూతన సి.ఐగా భాద్యతలు చేపట్టిన జి.ఎల్.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. గత సి.ఐ రవికిరణ్ స్థానంలో శ్రీనివాసరావు నియామకం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలిగిరి, వింజమూరు, కొండాపురం మండలాలలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల భాగస్వామ్యంతో నిర్విరామంగా కృషి చేయనున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించేది లేదన్నారు. అక్రమ మద్యం విక్రయాలు, బెల్టు షాపులు, పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని సి.ఐ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎటు చూసినా కరోనా వైరస్ విస్తరిస్తున్నందున ప్రజలందరూ కూడా కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. ప్రభుత్వాలు ప్రజల సం రక్షణ కోసమే పనిచేస్తాయనే విషయమును ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. కంటైన్మెంట్ జోన్లులో అధికారుల సూచనలు, సలహాలు పాటిస్తూ కరోనా వైరస్ నియంత్రణ దిశగా తగు జాగ్రత్తలు వహించాలని ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Image
విలేకరిపై దౌర్జన్యం చేసిన ఎస్ఐపై చర్యలు తీసుకోండి :మీడియా ప్రతినిధులు 
Image
హైదరాబాద్‌లో నేటి కార్యక్రమాలు
వైసీపీ నేతల ఇసుక అక్రమాలను నిరూపిస్తా..