మా డిమాండ్లు నెరవెరుస్తున్న ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు:పేరం శివ నాగేశ్వరరావు

మా డిమాండ్లు నెరవెరుస్తున్న ముఖ్యమంత్రి కి కృతజ్ఞతలు:పేరం శివ నాగేశ్వరరావు
విజయవాడ: సాగునీటి త్రాగునీటి సమస్యల పరిష్కారనికై ప్రకాశం బ్యారేజీ తరువాత  చెక్ డ్యామ్ లు నిర్మించాలని చేసిన డిమాండ్ కు స్పందించిన  ముఖ్యమంత్రి కి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలుగు రాష్టాల కన్వీనర్ పేరం శివ నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు.బుధవారం గాంధీ నగర్ రిపబ్లిక ప్రెస్ క్లబ్ లో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన విలేకరుల సమవేశంలో ఆయన మాట్లాడుతూ కృష్ణ, గుంటూరు జిల్లాలో సాగునీటి తాగునీటి పరిష్కారనికై  కృష్ణ నదిపై ప్రకాశం బ్యారేజీ తరువాత చెక్ డ్యామ్లు నిర్మించాలని గతకొద్ది వారాల క్రితం నిరాహరదీక్ష చేసి ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి కి వినతి పత్రం సమర్పించామని తెలిపారు. అందుకు  అణుగుణంగా స్వందించి చెక్ డ్యాముల నిర్మాణానికి అంగీకారాన్ని తెలిపి ప్రకటించడం హర్షణీయమని  అన్నారు.లక్షల క్యుసెక్కుల నీరు వృధా ఆవుతుందని ఆ నీరు వృధా కాకుండా చెక్ డ్యాముల నిర్మాణం తో అరికట్టవచ్చునని చెప్పారు.  ఈ చెక్ డ్యాముల నిర్మాణం వలన కృష్ణ, గుంటూరు జిల్లాల సాగునీటి, త్రాగునీటి సమస్య పరిష్కారమే కాకుండ రెండు జిల్లాలు వ్యవసాయ పారిశ్రామిక రంగాలలో గణణీయమైన అభివృద్ధి సాధిస్తాయని తెలిపారు. భూగర్భజలాల నీటి మట్టం పెరిగి భవిష్యత్ తరాలకు అభివృద్ధి బాట వేస్తాయని తెలిపారు. చెక్ డ్యాముల నిర్మాణాని తక్షణమే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని కోరారు.