చిన్నపొరపాట్లు కూడా తావివ్వరాదు


రాష్ట్రముఖ్యమంత్రి పర్యటనలో చిన్నపొరపాట్లు కూడా తావివ్వరాదు, అప్రమత్తంగా విధులు నిర్వహించాలి  -  జిల్లా కలెక్టర్ 
రాష్ట్రముఖ్యమంత్రి పర్యటన ముందస్తు ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, అర్బన్ ఎస్.పి 


తిరుపతి, సెప్టెంబర్ 28:  రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల శ్రీవారికి పట్టువస్త్రాలు సమరించడానికి ఈ నెల 30 న సోమవారం జిల్లాకు రానున్నారని ఏర్పాట్లు పగడ్భందీగా చేపట్టాలని, చిన్నపొరపాటుకు కూడా తావివ్వరాదని జిల్లా కలెక్టర్ డా.భరత్ గుప్తా అన్నారు. శనివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయంలో  జిల్లా కలెక్టర్, అర్బన్ ఎస్.పి. తుడ విసి గిరిషా , తిరుపతి ఆర్డీఓ, ఎయిర్ పోర్ట్ అధికారులతో ముఖ్యమంత్రి పర్యటనలో అధికారుల విధులు నిర్వహణ పై దిశానిర్దేశం చేసి ముందస్తు  వాహన శ్రేణి పరిశీలన విమానాశ్రయం నుండి తిరుమల వరకు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వివరిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి మద్యాహ్నం 3.00 గంటలకు విమానాశ్రయం చేరుకుంటారని అక్కడి నుండి తిరుచానూరు వద్ద టిటిడి కొత్తగా నిర్మించిన పద్మావతి నిలయం వసతి సముదాయం 3.15 గంటలకు ప్రారంభిస్తారని , తిరుపతి అలిపిరివద్ద అలిపిరి - చెర్లోపల్లి జంక్షన్ నాలుగులేన్ల రోడ్డు నిర్మాణానికి సాయంత్రం 4.15 గంటలకు శంకుస్థాపన చేసి తిరుమల బయలుదేరివెలతారని అన్నారు. తిరుమల చేరుకుని 5.15 గంటలకు నందకం  అతిధి గృహంవద్ద మాతృశ్రీ వకులదేవి వసతి సముదాయం నకు శంకుస్థాపన చేసి, పద్మావతీ అతిధిగృహం  చేరుకుంటారు,రాత్రి 7.00 గంటలకు తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు, 8.00 గంటలకు పెద్ద శేష వాహనం సేవలో పాల్గొని రాత్రి తిరుమలలో బస చేస్తారు. అక్టోబర్ 1 న ఉదయం 9.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని గన్నావరం బయలు దేరి వెళతారని విధులు కేటాయించిన అధికారులు ముఖ్యమంత్రి పర్యటనలో అప్రమత్తంగా వుండి పర్యటన విజయవంతం చేయాలని సూచించారు. 
 అర్బన్ ఎస్.పి. బందోబస్తు ఏర్పాట్లుపై పోలీస్ అధికారులకు పలుసూచనలు చేశారు. ముఖ్యమంత్రి రాక సమయంలో విఐపిలను అనుమతి, ప్రజలు వినతులు అందించేందుకు వేచి వుండాల్సిన ప్రదేశాలను పాత ఎయిర్పోర్ట్ వద్ద పరిశీలించి బ్యారీకేడ్ల నిర్మాణం జాగ్రత్తగా ఏర్పాటు చేయాలని నిరంతర నిఘా వుండాలని, ముఖ్యమంత్రి కాన్వాయ్ నందు ఇతరవాహనాలు ఎట్టిపరిస్థిల్లో అనుమతివ్వరాదని సూచించారు. అనతరం తిరుచానూరు పద్మావతి నిలయం వసతి సముదాయం, అలిపిరివద్ద నాలుగులేన్ల శిలాఫలకం ఏర్పాటు పరిశీలించి తిరుమల బయలు దేరి వెళ్లారు. 
 ఈ ముందస్తు ఏర్పాట్ల పరిశీలలనలో ఆర్.ఐ.ఓ. స్వామి, డిఎస్.పిలు  చంద్రశేఖర్, గంగయ్య,రామరాజు, నందకుమార్ ,ప్రసాద్, రాజు,  ఎయిర్పోర్ట్ టర్మినల్ మెంజర్ బాబీ,  కమాడెంట్ శుక్లా, ఆర్ అండ్ బి ఈఈ దనంజయరాజు, డి ఈ సహదేవరెడ్డి, డిఎం అండ్ హెచ్ ఓ రామగిడ్డయ్య, తహశీల్దార్ విజయసింహా రెడ్డి, డిటిలు ఈశ్వర్,శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -----