సిఎం క్యాంప్‌ కార్యాలయంలో శ్రీ గుర్రం జాషువా జయంతి

సిఎం క్యాంప్‌ కార్యాలయంలో శ్రీ గుర్రం జాషువా జయంతి
*- ఘనంగా స్వర్గీయ గుర్రం జాషువాకు నివాళి
*- పాల్గొన్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికార భాషాసంఘం చైర్మన్‌
*- ఈ సందర్బంగా పలువురు సాహిత్యకారులకు పురస్కారాలు
*- సీనియర్‌ నేత మరణంతో విశాఖకు వెళ్లాల్సి రావడంతో హాజరు కాలేకపోయిన సిఎం
అమరావతి: తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో ప్రఖ్యాత రచయిత శ్రీ గుర్రం జాషువా 124వ జయంతిని ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు శ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో పలువురు ప్రముఖులు, సాహితీ వేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రముఖ హాస్యనటుడు శ్రీ బ్రహ్మానందం, దేవాదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీలు శ్రీ నందిగం సురేష్, శ్రీ రఘురామకృష్ణంరాజు, ఎమ్మెల్యేలు శ్రీ మేరుగ నాగార్జున, శ్రీ మల్లాది విష్ణు తదితరులు ఈ కార్యక్రమంకు హాజరయ్యారు. తొలుత స్వర్గీయ గుర్రం జాషువా చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో వక్తలు మాట్లాడారు. సామాజిక అంశాలను, అసమానతలను ఎత్తిచూపుతూ స్వర్గీయ గుర్రం జాషువా చేసిన రచనలు అభ్యుదయ రచయితలకు స్పూర్తిగా నిలిచాయని అన్నారు. సామాజిక చైతన్యం కోసం నడుం కట్టి నేటి తరం కవులకు ఆయన ఆదర్శ ప్రాయంగా నిలిచారని కొనియాడారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రముఖ రచయితలు శ్రీ కత్తి పద్మారావు, శ్రీ బోయి హైమావతి, ఆచార్య శ్రీ గుజ్జర్లమూడి కృపాచారి, ఆచార్య శ్రీ చందు సుబ్బారావులకు పురస్కారాలు అందజేశారు. పార్టీ సీనియర్‌ నేత, మాజీమంత్రి బలిరెడ్డి సత్యారావు ఆకస్మిక మరణంతో, విశాఖపట్నంకు వెళ్ళడం వల్ల ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ కార్యక్రమానికి హాజరుకాలేక పోయారు.


Popular posts
*కలిగిరి కార్యదర్శి వి.మధు కు ఉత్తమ అవార్డు* ఉదయగిరి, ఆగష్టు 23 (అంతిమ తీర్పు- ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): ఉదయగిరి నియోజకవర్గంలోని కలిగిరి పంచాయితీ కార్యదర్శి వెలుగోటి. మధు ఉత్తమ కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఆగష్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రకటించిన ఉత్తమ అధికారుల జాబితాలో మధు ముందు వరుసలో నిలిచారు. గత 4 సంవత్సరాల నుండి ఆయన అవార్డులకు ఎంపిక కాబడుతుండటం గమనించదగిన విషయం. పంచాయితీ సెక్రటరీగా కలిగిరిలో గ్రామ పంచాయితీ అభివృద్ధికి బంగారు బాటలు వేశారు. ఎంతోకాలంగా ఆక్రమణల చెరలో ఉన్న పంచాయితీ స్థలాలకు కబ్జా కోరల నుండి విముక్తి కల్పించి ప్రభుత్వానికి ఆదాయ వనరులను చూపించారు. కరోనా కాలంలో ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయడంతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలను వేగవంతం చేశారు. ప్రతినెలా 1 వ తేదీన జరిగే ఫించన్ల పంపిణీ విషయంలో వెలుగోటి.మధు చేస్తున్న కృషి పలువురి ప్రశంసలు అందుకుంటున్నది. ఉదయం 7 గంటల కల్లా ఫించన్ల పంపిణీ లక్ష్యాలను అధిగమించి అందరి చేత బేష్ అనిపించుకుంటారు. వృత్తి పట్ల అంకితభావం కలిగిన మధును ఈ యేడాది కూడా ఉత్తమ కార్యదర్శి అవార్డు వరించడం అభినందనీయమని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
శ్రీ‌వాణి ట్ర‌స్టు దాత‌ల కోసం ఆన్‌లైన్ అప్లికేష‌న్ ప్రారంభం
అంబెడ్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ysrcp నేత దేవినేని ఆవినాష్
Image
ఆంధ్ర ప్రదేశ్‌ రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో ఇకపై ఆటో మ్యుటేషన్‌ సేవలు అమలు.