దసరాకు 28 ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్ : దసరా పండగను పురస్కరించుకుని వివిధ ప్రాంతాలకు 28 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి సీహెచ్. రాకేష్ తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 31 వరకు ఆయా ప్రాంతాలకు రైళ్లు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు.
సికింద్రాబాద్-కాకినాడ టౌన్‌కు 10 సర్వీసులు : రైలు నెంబర్ 07003 సికింద్రాబాద్-కాకినాడటౌన్ స్పెషల్ రైలు అక్టోబర్ 1న రాత్రి 8.45 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.20 గంటలకు కాకినాడటౌన్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కాకినాడ టౌన్-సికింద్రాబాద్ స్పెషల్ రైలు (నెంబర్ 07004) అక్టోబర్ 2న రాత్రి 8 గంటలకు కాకినాడటౌన్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.50 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. సికింద్రాబాద్-కాకినాడటౌన్ స్పెషల్ రైలు(నెంబర్ 07075) అక్టోబర్ 4, 25వ తేదీల్లో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రాత్రి 7.45 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు కాకినాడటౌన్‌కు చేరుకుంటుంది. రెండు రైళ్లు కాజీపేట, వరంగల్, ఖమ్మం, రాయన్‌పాడు, గుడివాడ, కౌకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, ద్వారకపుడి, సామర్లకోట స్టేషన్లలో ఆగనున్నాయి. సికింద్రాబాద్-కాకినాడటౌన్ స్పెషల్ రైలు(నెంబర్ 07434) అక్టోబర్ 7, 10 తేదీల్లో సికింద్రాబాద్ స్టేషన్లో రాత్రి 7.25 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.45 గంటలకు కాకినాడటౌన్‌కు చేరుకుంటుంది. కాకినాడటౌన్-సికింద్రాబాద్ స్పెషల్ రైలు(నెంబర్ 07428) అక్టోబర్ 8, 26 తేదీల్లో కాకినాడటౌన్ స్టేషన్లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.40 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఈ రైళ్లు నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, ద్వారకపుడి, సామర్లకోట స్టేషన్లలో ఆగనున్నాయి. కాకినాడటౌన్-సికింద్రాబాద్ స్పెషల్ రైలు(నెంబర్ 07076) అక్టోబర్ 13న రాత్రి 7.05 గంటలకు కాకినాడటౌన్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 5.55 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఈ రైలు సామర్టకోట, ద్వారకపుడి, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయన్‌పాడు, ఖమ్మం, వరంగల్, కాజీపేట స్టేషన్లలో ఆగనుంది.
సికింద్రాబాద్-నర్సాపూర్- హైదరాబాద్‌కు 2 సర్వీసులు : సికింద్రాబాద్-నర్సాపూర్ స్పెషల్ రైలు(నెంబర్ 07256) అక్టోబర్ 1న సికింద్రాబాద్‌లో సాయంత్రం 5.40 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు నర్పాపూర్కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నర్సాపూర్-హైదరాబాద్ స్పెషల్ రైలు(నెంబర్ 07255) అక్టోబర్ 2న సాయంత్రం 6 గంటలకు నర్సాపూర్‌లో బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 3.55 గంటలకు సికింద్రాబాద్, 4.30 గంటలకు హైదరాబాద్ స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ రైళ్లు నల్లగొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, పాలకొల్లు స్టేషన్లలో ఆగనుంది.
సికింద్రాబాద్-నాగర్సోల్కు 6 సర్వీసులు : సికింద్రాబాద్-నాగర్సోల్ స్పెషల్ రైలు(నెంబర్ 07145) అక్టోబర్ 5న రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 11 గంటలకు నాగర్సోల్ స్టేషన్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో నాగర్సోల్-సికింద్రాబాద్ స్పెషల్ రైలు(నెంబర్ 07063) అక్టోబర్ 6న మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.25 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఈ రైళ్లు మల్కాజిగిరి, మేడ్చల్, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణా, సేలు, జాల్నా, ఔరంగాబాద్ స్టేషన్లలో ఆగనున్నాయి. సికింద్రాబాద్-నాగర్సోల్ స్పెషల్ రైలు(నెంబర్ 07064) అక్టోబర్ 6, 8 తేదీల్లో సికింద్రాబాద్ స్టేషన్లో రాత్రి 9.05 గంటలకు బయల్దేరి మరుసటి మధ్యాహ్నం 11.00 గంటలకు నాగర్సోల్కు చేరుకుంటుంది. నాగర్సోల్-సికింద్రాబాద్ స్పెషల్ రైలు(నెంబర్ 07063) అక్టోబర్ 7, 9 తేదీల్లో మధ్యాహ్నం 3 గంటలకు నాగర్సోల్లో బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 4.25 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. ఈ రైళ్లు మల్కాజిగిరి, కామారెడ్డి, నిజామాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణా, పర్బనీ, సేలు, జాల్నా, ఔరంగాబాద్ స్టేషన్లలో ఆగనున్నాయి.
విల్లుపురం-సికింద్రాబాద్‌కు 10 సర్వీసులు : విల్లుపురం-సికింద్రాబాద్ స్పెషల్ రైలు(నెంబర్ 06043) అక్టోబర్ 2, 9, 16, 23, 30 తేదీల్లో విల్లుపురం స్టేషన్లో సాయంత్రం 4 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.25 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌కు చేరుకుంటుంది. సికింద్రాబాద్-విల్లుపురం స్పెషల్ రైలు(నెంబర్ 06044) అక్టోబర్ 3, 10, 17, 24, 31 తేదీల్లో రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు విల్లుపురం స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ మార్గంలో నడిచే రైళ్లు చెంగల్పేట్, తాంబ్రం, చెన్నయ్ఎగ్మోర్, సుళ్లూరుపేట, నాయుడుపేట, గూడురు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్లగొండ స్టేషన్లలో ఆగనున్నాయి.
దసరాకు 28 ప్రత్యేక రైళ్లు