రాష్ట్రస్థాయి ఈతల పోటీల్లో  పతకాలు సాధించిన సంస్థ ఉద్యోగి

విజయవాడ 
రాష్ట్రస్థాయి ఈతల పోటీల్లో  పతకాలు సాధించిన సంస్థ ఉద్యోగి
సెప్టెంబర్ 15న శ్రీకాకుళం మాస్టర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన  ఆంధ్రప్రదేశ్  రాష్ట్రస్థాయి ఈతల పోటీ ఛాంపియన్ షిప్ లో  ప్రతిభ కనబరచి 4 పతకాలు సాధించిన సంస్థ ఉద్యోగి శ్రీ జి. వి. ప్రసాద్ ను ఎం. డి. శ్రీ ఎన్.వి.సురేంద్రబాబు, ఐ.  పి .ఎస్. తన ఛాంబర్ లో అభినందించారు. సంస్థలో ప్రతిభ కల్గిన క్రీడాకారులు చాలామంది ఉన్నారని, ప్రతిభకి ఏదీ ఆటంకం కాదని ఈ సందర్భంగా ఆయనన్నారు .
హెడ్డాఫిస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆపరేషన్స్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న శ్రీ ప్రసాద్,  55-59  సంవత్సరాల కేటగిరీలోని 100   మీటర్లు మరియు 50 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ విభాగాల్లో  ద్వితీయస్థానం పొంది 2 వెండి పతకాలు , 200  మీటర్ల ఫ్రీ స్టైల్ మరియు ఇండివిడ్యువల్  మిడ్ లే లో   తృతీయస్థానం పొంది 2 రజత పతకాలు సాధించారు. ఓవరాల్ ఛాంపియన్ షిప్  ని   కృష్ణ జిల్లా  కైవసం  చేసుకోగా తాను కూడా ఆ జట్టులో ఉండడం  గర్వంగా ఉందని శ్రీ ప్రసాద్ తెలిపారు .2004  నుండి ఇప్పటివరకు కూడా  ప్రతి సంవత్సరం ఏదో ఒక పతకం సాధిస్తూనే ఉంటూ సుమారు 32  పతకాలు గెలిచారు. వాటిలో  4 బంగారు ,20 కాంస్యం,8 రజతం ఉన్నాయి. 
అంతేకాకుండా వరదలు గానీ ఏదైనా విపత్కర పరిస్థితులు సంభవించినపుడు గానీ నీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రాష్ట్రీయ లైఫ్ సేవింగ్ సొసైటీలో శిక్షణ కూడా పొందియున్నారు.