పవిత్ర కార్యం.. పునరుద్ధరణ


కృష్ణమ్మకు నిత్యహారతుల పునరుద్ధరణకు నిర్ణయం
పవిత్ర సంగమం నుంచి దుర్గాఘాట్‌కు మార్చే యోచన
నిర్వహణ ఖర్చు తగ్గడంతోపాటు దుర్గగుడికి ప్రత్యేక ఆకర్షణ
దేవదాయశాఖ కమిషనర్‌ అనుమతుల కోసం ఎదురుచూపులు
పరమపావన కృష్ణవేణమ్మకు నిత్యహారతులను పునరుద్ధరించేందుకు కనకదుర్గమ్మ దేవస్థానం అధికారులు నిర్ణయించారు. ఇకనుంచి పవిత్ర సంగమం దగ్గర కాకుండా దుర్గమ్మ దేవస్థానానికి అతి సమీపంలో ఉన్న దుర్గాఘాట్‌ వద్ద నవదుర్గలకు ప్రతీకగా కృష్ణమ్మకు నిత్య హారతులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనివల్ల ఖర్చులు గణనీయంగా తగ్గడంతోపాటు అమ్మవారి దేవస్థానానికి ప్రత్యేక ఆకర్షణగా కృష్ణా హారతుల కార్యక్రమం నిలుస్తుందని భావిస్తున్నారు.
విజయవాడ: గత మూడేళ్లుగా ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణానదీ తీరాన గోదావరి-కృష్ణా జలాల పవిత్ర సంగమ ప్రదేశంలో నేత్రపర్వంగా నిర్వహిస్తున్న నిత్యహారతి కార్యక్రమం గత నెలలో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. భక్తుల మనోభావాలతో ముడిపడిన 'కృష్ణా హారతి' కార్యక్రమాన్ని కొనసాగించేందుకు శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక నుంచి పవిత్ర సంగమం దగ్గర కాకుండా దుర్గమ్మ దేవస్థానానికి అతి సమీపంలో ఉన్న దుర్గాఘాట్‌ వద్ద నవదుర్గలకు ప్రతీకగా కృష్ణమ్మకు నిత్య హారతులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దీనివల్ల ఖర్చులు గణనీయంగా తగ్గడంతోపాటు అమ్మవారి దేవస్థానానికి ప్రత్యేక ఆకర్షణగా కృష్ణా హారతుల కార్యక్రమం నిలుస్తుందని భావిస్తున్నారు. దుర్గాఘాట్‌కు ఇరువైపులా అతి సమీపంలోనే ప్రకాశం బ్యారేజీ, భావానీ ద్వీపం ఉన్నాయి. నిత్యం పర్యాటకులతో ఈ ప్రాంతాలు కళకళలాడుతుంటాయి. తాజాగా దుర్గాఘాట్‌ వద్ద ప్రతిరోజూ సాయం సంధ్య వేళ.. ఆహ్లాదకరమైన వాతావరణంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే కృష్ణాహారతి కార్యక్రమం జతకలిస్తే ఈ ప్రాంతం ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని దుర్గగుడి అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. అనుమతి కోసం ఎదురుచూస్తున్నారు.
పుష్కరాలకు ప్రారంభమై : మూడు సంవత్సరాల క్రితం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ కార్యక్రమానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. ఇందుకోసం ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా-గోదావరి జలాల పవిత్ర సంగమ ప్రదేశం అనువైనదిగా భావించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పవిత్ర సంగమం వద్ద కృష్ణానదిలో రెండు పంట్లు ఏర్పాటు చేసి.. ఆ వేదిక మీద నుంచి కనువిందుగా నిత్య హారతి కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్య పద్ధతిలో కనకదుర్గమ్మ దేవస్థానం, డీవీఆర్‌ ఫౌండేషన్‌ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నిత్య హారతి కార్యక్రమాన్ని కొనసాగించేలా గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పుష్కరాలు ముగిసిన తర్వాత కూడా జనం భారీగా తరలివస్తుండటంతో 'నిత్యహారతి' కార్యక్రమంగా మార్చి పవిత్ర సంగమ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగానే పవిత్ర సంగమం వద్ద ఫెర్రీ నదీ పరివాహక ప్రాంతాన్ని రూ.42 కోట్లతో అభివృద్ధి చేశారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర ఘాట్‌ను అత్యాధునికంగా నిర్మించారు. అప్పటి నుంచి రోజూ సాయంత్రం 6.45 గంటల నుంచి 40 నిమిషాల పాటు కృష్ణా హారతుల కార్యక్రమం కనువిందుగా సాగేది. కానీ ఇటీవల కృష్ణానదికి వరదలు వచ్చినప్పటి నుంచి నిత్య హారతులు నిలిచిపోయాయి. ఈ హారతులిచ్చేందుకు వేదికగా నిలిచిన రెండు పంట్లు ఒడ్డుకు చేరాయి. మూడేళ్లుగా కృష్ణా హారతుల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డీవీఆర్‌ ఫౌండేషన్‌ సంస్థ ఆ బాధ్యతల నుంచి తప్పుకుంది. ఫలితంగా భక్తులు, పర్యాటకులతో సందడిగా ఉండే పవిత్ర సంగమ ప్రదేశం ప్రస్తుతం వెలవెలబోతోంది.
కృష్ణా హారతి విశిష్టతలివీ : కృష్ణా హారతి కార్యక్రమంలో భాగంగా వేద పండితులు నదీమతల్లికి ఇచ్చే వివిధ రకాల పవిత్ర హారతులను కనులారా దర్శించుకునే భక్తులకు సకల సౌభా గ్యాలు సిద్ధించడంతోపాటు పంచ భూతాత్మకమైన ప్రకృతిని ఆరాధిం చిన పుణ్యఫలం దక్కుతుందని పండితులు చెబుతున్నారు. సృష్టికి మూలమైన ఓంకార నాదాన్ని వినడం.. చూడటం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని, శుభ పరంపరలు కలుగుతాయని, ఓంకార హారతులను దర్శించుకోవడం వల్ల భక్తులకు మోక్షసిద్ధి కలుగుతుందంటున్నారు. దేవతా స్వరూపమైన నాగసర్పం దీర్ఘాయువుకు, పవిత్రకు ప్రతీక. నాగ హారతిని దర్శించడం వల్ల భక్తులకు సంతాన సౌభాగ్యం, రోగ నివారణ, దోషాలు తొలగిపోతాయని చెబుతారు. లోక బాంధవుడైన సూర్యభగవానుడు దుర్గమ్మకు కుడి కన్ను. సూర్యహారతి దర్శనం వల్ల భక్తులకు జ్ఞానం, ఆరోగ్యం లభిస్తాయి. పాడిపంటలు, మనస్సును ప్రభావితం చేసే చం రద్రుడు అమ్మవారికి ఎడమ కన్ను. చంద్రహారతి దర్శనం వల్ల భక్తులకు పరోపకార బుద్ధి, దానగుణం, ధార్మికత వృద్ధి చెందు తాయి. పరమేశ్వరుడి నామాలతో కూడిన పంచహారతి దర్శనం వల్ల భక్తుల మహాపంచ పాతకాలు నశిస్తాయి. పంచ ప్రాణాలను స్వాగతం పలుకుతుంది. మల్లేశ్వరస్వామి వారి కటాక్షం లభిస్తుంది. మహేశ్వరుడికి వాహనంగా ఉన్న నంది హారతి దర్శనం వల్ల భక్తులకు నిర్మలమైన జ్ఞానం, సకల ధర్మాచరణ ఫలప్రాప్తి సిద్ధిస్తుంది. సింహ హారతి దర్శనం వల్ల భక్తులకు విజయం, దుర్గమ్మ అనుగ్రహం లభిస్తాయి. సమాజానికి రక్షణ కల్పించే మహిమాన్విత కుంభ హారతిని దర్శించుకుంటే భక్తులకు అగణ్యమైన పుణ్యం, పంచ భూతాత్మకమైన జీవరక్ష లభిస్తుంది. ఇరవై ఏడు నక్షత్రాలలోనే కోట్లాదిమంది మానవులు జన్మిస్తారు. నక్షత్ర హారతి దర్శనం వల్ల భక్తులకు తేజస్సు. పుణ్య ఫలం లభిస్తాయి.
ప్రభుత్వం అనుమతిస్తే : ప్రభుత్వం నుంచి అను మతి వస్తే కృష్ణా హారతి కార్యక్రమాన్ని పునః ప్రారంభిస్తాం. ఇంత వర కు నిత్యహారతి కార్య క్రమానికి అయ్యే ఖర్చులో 75 శాతం అంటే నెలకు రూ.5 లక్షలకు పైగా శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం నిధుల నుంచి చెల్లించాం. మిగిలిన 25 శాతం నిధులను డీవీఆర్‌ ఫౌండేషన్‌ సంస్థ వెచ్చించి ఈ కార్యక్రమాన్ని కొనసాగించింది. ఇప్పుడు 90 శాతం నిధులను దేవస్థానమే చెల్లించాలని ఆ సంస్థ ప్రతినిధులు కోరారు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాం. ఇంతవరకు ప్రభుత్వ నిర్ణయం వెలు వడలేదు. దీంతో డీవీఆర్‌ ఫౌండేషన్‌ సంస్థ నిత్య హారతుల కార్యక్రమాన్ని నిలిపివేసింది. ఈ నేప థ్యంలో భక్తుల మనోభావాలను పరిగణనలోకి తీసు కుని ఇకనుంచి దేవస్థానం ఆధ్వర్యంలోనే కృష్ణానదికి నిత్యహారతులు ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించాం. దేవస్థానానికి చెందిన వేదపండితులే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతిరోజూ సా యంత్రం అమ్మవారి ప్రధాన ఆలయంలో పంచహా రతులు పూర్తయిన తర్వాత దుర్గాఘాట్‌ వద్ద కృష్ణా నదికి హారతులు ప్రారంభమవుతాయి. - ఎంవీ సురేష్‌బాబు, దుర్గగుడి కార్యనిర్వహణాధికారి


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆ రోజున జాతీయ బాలల దినోత్సవం అని ఆయనకు తెలియదా?
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నెల్లూరు జిల్లాలో రెండవసారి మహాత్ముని పర్యటన
Image