విష్ణువర్దన్ రెడ్డి అరెస్ట్ ను ఖండించిన చంద్రబాబు
కోడుమూరు టిడిపి ఇన్ చార్జ్ విష్ణువర్దన్ రెడ్డి అరెస్ట్ ను ఖండించిన చంద్రబాబు. తెలుగుదేశం నాయకులను వైసిపి టార్గెట్ చేయడంపై మండిపాటు. పవిత్రమైన ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. ఆత్మకూరులో 150దళిత కుటుంబాలను నెలల తరబడి గ్రామ బహిష్కారం చేసినా చర్యలు లేవు. వారి తరఫున పోరాడుతున్న తెలుగుదేశం నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎస్సీలకు న్యాయం చేయాలని పోరాడే టిడిపి నేతలపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటి కేసులు పెట్టడంకన్నా దారుణం ఇంకోటి లేదు.
టిడిపి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు 12మందిపై అక్రమ కేసులు బనాయించారు. అచ్చెన్నాయుడిపై ఒకే అంశంపై తాడేపల్లిలో, టెక్కలిలో 2కేసులు పెట్టారు. మహిళా కమిషన్ మాజీ ఛైర్మన్ నన్నపనేని రాజకుమారిపై ఎస్సీ,ఎస్టీ అక్రమ కేసు బనాయించారు. 43ఏళ్ల క్రితం అంశంపై సోమిరెడ్డిపై తప్పుడు కేసు పెట్టారు. బెందాలం అశోక్, బాల వీరాంజనేయ స్వామి, కరణం బలరామ్, కూన రవికుమార్ తదితరులపై అక్రమంగా కేసులు పెట్టారు. కుటుంబరావు భూమి 37ఏళ్ల అంశంపై సుప్రీంకోర్ట్ స్టేటస్ కో ఆదేశాలున్నా ప్రహరీగోడలు కూల్చేశారు, భూమి స్వాధీనం బోర్డులు పెట్టారు. 19 తప్పుడు కేసులు పెట్టి కోడెలను బలితీసుకున్నారు.
వైసిపి ప్రభుత్వ వేధింపులకు అంతేలేకుండా పోయింది. వైసిపి నేతల అరాచకాలను ప్రజలే నిరసించాలి. మేధావులు, ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు వీళ్ల ఆగడాలను ఖండించాలి.
చంద్రబాబు నాయుడు
శాసన సభ ప్రధాన ప్రతిపక్ష నేత
విష్ణువర్దన్ రెడ్డి అరెస్ట్ ను ఖండించిన చంద్రబాబు