ఉత్సవ కమిటీలో 50 శాతం మహిళా రిజర్వేషన్ ఎక్కడ?
మహిళలకు ప్రాధాన్యత లేని ఉత్సవ కమిటీని రద్దు చేయాలి
దేవాలయంలో కాంట్రాక్టు చేస్తున్నవారికి ఉత్సవ కమిటీలో స్థానం ఏవిధంగా కల్పిస్తారు
ముఖ్యమంత్రి మాటలకి, ప్రకటనకి చేతలకు పొంతన లేదు
దసరా ఉత్సవ కమిటీ లో మహిళలకి ప్రాధాన్యత కల్పించకపోవడం దురదృష్టకరం అని పదేపదే ముఖ్యమంత్రి గారు నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం కోటా ఉంటుందని చేస్తున్నటువంటి ప్రకటనలు కేవలం ప్రకటనలకే పరిమితం అయ్యాయని వాస్తవ రూపంలో అమలు కావని చెప్పడానికి కనకదుర్గమ్మ గుడి ఉత్సవ కమిటీ నియామక మే నిదర్శనమని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ ఈరోజు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆరోపించారు. అదేవిధంగా కనకదుర్గమ్మ గుడి మీద భోజనాల కాంట్రాక్టర్ ఉన్నటువంటి వ్యక్తులకు ( జొన్నలగడ్డ రమేష్ ) ఉత్సవ కమిటీ లో ఏ విధంగా స్థానం కల్పిస్తారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటువంటి వ్యక్తులు ఉత్సవ కమిటీ ని అడ్డం పెట్టుకొని కాంట్రాక్టు లో నాసిరకం పనులు చేయారని గ్యారెంటీ ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ కమిటీని నిలుపుదల చేసి మహిళలకు ప్రాధాన్యం కల్పించేలా నూతన కమిటీని ప్రకటించాలని కాంట్రాక్టర్లను ఉత్సవ కమిటీ నుండి తీసివేసి ప్రభుత్వం తమ పారదర్శకతను చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మహేష్ కోరారు.
ఉత్సవ కమిటీలో 50 శాతం మహిళా రిజర్వేషన్ ఎక్కడ