27–09–2019
అమరావతి
*సీనియర్ నాయకుడు బలిరెడ్డి సత్యారావు మృతి – సీఎం వైయస్.జగన్ సంతాపం
అమరావతి: విశాఖ జిల్లాకు చెందిన వైయస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బలిరెడ్డి సత్యారావు మృతి పట్ల ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బలిరెడ్డి సత్యారావు కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సంతాçపం తెలియజేశారు. బలిరెడ్డి సత్యారావు ప్రజలకు ఎనలేని సేవలందించారని ముఖ్యమంత్రి కొనియాడారు. విశాఖ జిల్లాకు, ముఖ్యంగా చోడవరం నియోజకవర్గానికి ఆయన మరణం తీరనిలోటని ముఖ్యమంత్రి అన్నారు.