బ్రహమొక్కటే పరబ్రహ్మమొక్కటే..

బ్రహమొక్కటే పరబ్రహ్మమొక్కటే..


💐తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తన🙏


గానం.  శ్రీ జి. బాలకృష్ణ ప్రసాద్ గారు, 
            శ్రీ పి.ఎస్. రంగనాధ్ గారు మరియు 
             శ్రీ జి. నాగేశ్వర నాయుడు గారు
రాగం. నాదనామక్రియ


రేకు : 177 - 5
సంపుటము : 2 - 385
రేకు రాగము : బౌళితందనాన ఆహి తందనానా పురే
తందనాన  భళా తందనాన


కందువగు హీనాధికములిందు లేవు 
అందరికీ శ్రీహరే అంతరాత్మ | 
ఇందులో జంతుకులమింతా ఒకటే 
అందరికీ శ్రీహరే అంతరాత్మ 


నిండార రాజు నిద్రించు నిద్రయు ఒకటే అండనే బంటు నిద్ర అదియు ఒకటే | 
మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమిఒకటే చండాలుడుండేటి సరిభూమి ఒకటే 


అనుగు దేవతలకును అల కామసుఖమొకటే 
ఘన కీట పశువులకు కామ సుఖము ఒకటే | 
దిన మహోరాత్రములు తెగి ధనాఢ్యున కొకటే 
వొనర నిరుపేదకును ఒక్కటే అవియు


కొరలి శిష్టాన్నములు కొను ఆకలొకటే 
తిరుగు దుష్టాన్నములు తిను ఆకలొకటే | 
పరగ దుర్గంధములపై వాయు వొకటే 
వరస పరిమళముపై వాయు వొక్కటే 


కడగి ఏనుగు మీద కాయు ఎండొకటే 
పుడమి శునకము మీద బొలయు ఎండొకటే | 
కడు పుణ్యులను పాప కర్ములను సరిగావ జడియు శ్రీ వేంకటేశ్వరు నామ మొకటే....💐