నరసరావుపేటలో144సెక్షన్ పై యనమల ఆగ్రహం
పత్రికా ప్రకటనలో వైసిపి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన యనమల
కోడెల మరణం వెనుక వైసిపి నేతల కుట్ర ఉంది. వైసిపి నేతలు, ప్రభుత్వం, పోలీసులు, సాక్షి మీడియానే కోడెల చావుకు కారణం. క్రిమినల్ లా కింద వాళ్లపై కుట్రదారులుగా నమోదు చేయాలి.
చనిపోయాక కూడా కోడెల మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లనీకుండా చేస్తారా..? 144సెక్షన్ పెట్టి నాయకుల పార్ధివ దేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లనివ్వక పోవడం దేశంలో ఎక్కడా జరగలేదు.
మంత్రి బొత్స వ్యాఖ్యలను బట్టే దీనిని హత్య కేసు కింద నమోదు చేయాలి. విదేశాల్లో ఉన్న కొడుకే చంపాడని వైసిపి నేత సాయి తో ఫిర్యాదు చేయించారు.
బొత్స వ్యాఖ్యలు, సాయి ఫిర్యాదు కలిపి చూస్తే రెండూ ఒకే రకంగా ఉన్నాయి, వైసిపి నేతల కుట్రను ఇవన్నీ బహిర్గతం చేస్తున్నాయి. కోడెల ఆత్మహత్యకు వీళ్లంతా ప్రేరేపించారు. వీళ్లందరిపై భారతీయ నేర శిక్షాస్మృతి కింద కేసులు పెట్టాలి.
ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం ఇది ఆత్మహత్యే అని ధ్రువీకరించారు. ఈ నివేదికపై సీఎం జగన్మోహన్ రెడ్డి ఏమంటారు...? వైసిపి నేతలు ఫోరెన్సిక్ రిపోర్ట్ పై ఏమంటారు..?
27ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న, 37ఏళ్ల రాజకీయ జీవితం గడిపిన కోడెల ప్రాణాలను వైసిపి ప్రభుత్వం, వైసిపి నేతలే బలి తీసుకున్నారు. ఆయన బలవన్మరణానికి వైసిపి నేతలే బాధ్యత వహించాలి.
తక్షణమే నరసరావుపేటలో నిషేధాజ్ఞలు తొలగించాలి. ఒక మహా నాయకుడి పార్ధివ దేహానికి ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు గొప్ప వీడ్కోలు పలికేందుకు ప్రభుత్వం అడ్డుపడకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలి.
యనమల రామకృష్ణుడు
శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత
వైసిపి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన : యనమల