ఖమ్మం,  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రాంతీయ సదస్సు__

 


_*రేపు  TUWJ ( IJU ) ఖమ్మం,  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రాంతీయ సదస్సు* ____________________________


తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జర్నలిస్టులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందని ఆశించం అయితే తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులను నిరాశకు గురిచేయటమే కాకుండా పూర్తిగా ఉపేక్షిస్తూ వస్తుంది.  సమస్యల పరిష్కారం పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంది. దురదృష్టకరం ఏమిటంటే గతంలోనే బాగుండేది అనే పరిస్థితి కల్పిస్తుంది. జర్నలిస్టుల సొంత ఇంటి కల నిజం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో హామీ ఇచ్చినా ఆ దిశగా ఒక్క అడుగు ముందుకు పడకపోవడం విచారకరం. గతంలో ఉన్న ఆరోగ్య బీమా పథకాన్ని తీసివేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జర్నలిస్టులందరికి ఙెహెచ్ఎస్ పధకం కింద ఆరోగ్య భద్రత కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం దానిని పూర్తి స్థాయిలో అమలు చేయడం లేదు. అక్రిడిటేషన్ ల జారీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 239 జీవో  వలన అనేక మందికి అన్యాయం జరుగుతుంది.  ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. వృత్తి పరమైన ఒత్తిడిలో అనేకమంది అకాల మరణం పొందుతున్నారు. 
మరోపక్క మీడియా రంగం అనేక ఒత్తిడిలకు గురై విలవిల్లాడుతొన్న పరిస్థితి అందోళన కలిగిస్తుంది. దేశ వ్యాప్తంగానే రాజ్యాంగ వ్యవస్థలు దుర్వినియోగమవటం,  భిన్నమైన ఆలోచనలు సహించలేకపోవటం, మూక దాడులకు పాల్పడటం,  మీడియా రంగంలోకి కార్పోరేట్ శక్తులు చొచ్చుకురావటం నేడు మనం చూస్తున్నాం. ఆ సంస్కృతే మన గడ్డపై కూడ ప్రభావం చూపుతుంది.  ఒక్కో కొమ్మను కొట్టి తమ ఆధీనంలో  నాటుకోవటం వల్ల ఆ కొమ్మలు ఎండి పోతున్నాయి. మాట్లాడే వారు మౌనం వహిస్తున్నారు. 
ఈ నేపథ్యంలో వృత్తి సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం ఉద్యమిస్తునే ప్రజాస్వామ్య విలువల విధ్వంసాన్ని నిలువరించే ప్రయత్నానికి మనం నడుం బిగించాలి
ప్రస్తుత పరిస్థితి పై చర్చించుకొని భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ రూపొందించుకోవటం కోసం TUWJ IJU రాష్ట్ర వ్యాప్తంగా ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా రేపు  సత్తుపల్లి లో ( M R GARDENS,  సిద్దారం రోడ్  ) ఖమ్మం,  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ప్రాంతీయ సదస్సు ఉదయం 10 గంటలకు జరుగుతుంది. కావున  జర్నలిస్టులు అధిక సంఖ్యలో  పాల్గొని సదస్సు ను  విజయవంతం చేయగలరు.


*సదస్సు లో పాల్గొనే యూనియన్  ముఖ్య నేతలు* 


దేవులపల్లి అమర్ గారు 
 IJU జాతీయ అధ్యక్షులు,   
అంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ  మరియు జాతీయ మీడియా సలహాదారు కె. శ్రీనివాసరెడ్డి 
TUWJ సలహాదారు


వై. నరేందర్ రెడ్డి 
IJU జాతీయ కార్యదర్శి 


నగునూరి శేఖర్ 
TUWJ రాష్ట్ర అధ్యక్షులు 


కె. విరహాత్ అలీ 
TUWJ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 


అమర్ నాధ్ 
మాజీ ప్రెస్ కౌన్సిల్ సభ్యులు 


కె. సత్యనారాయణ 
IJU జాతీయ కార్యవర్గ సభ్యులు 


దాసరి కృష్ణారెడ్డి 
IJU జాతీయ కార్యవర్గ సభ్యులు 


కె. రామనారాయణ 
TUWJ రాష్ట్ర ఉపాధ్యక్షులు *TUWJ  IJU ఖమ్మం,  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీల తరఫున* 
-- నర్వనేని వెంకట్రావు, ఖమ్మం  జిల్లా అధ్యక్షులు 
-- B V రమణారెడ్డి ,  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు


Popular posts
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆ రోజున జాతీయ బాలల దినోత్సవం అని ఆయనకు తెలియదా?
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నెల్లూరు జిల్లాలో రెండవసారి మహాత్ముని పర్యటన
Image