పోలవరం ఇరిగేషన్‌, పవర్‌ప్రాజెక్ట్‌ పనులు 'మెగా'కు ఎలా కట్టబెట్టారు?  

తేది. 24-09-2019


విలేకరుల సమావేశం వివరాలు.


పోలవరం ఇరిగేషన్‌, పవర్‌ప్రాజెక్ట్‌ పనులు 'మెగా'కు ఎలా కట్టబెట్టారు?  


- సింగిల్‌ టెండర్‌ వేసిన మెగా సంస్థ ఎంపికలోని మర్మమేమిటి?


- పాతబిల్లులు చెల్లించమని బెదిరించి, ఏజెన్సీల మెడలు వంచి, పోలవరం పనుల్లో తక్కువకు బిడ్లు వేయించారు


- ఢిల్లీ వెళ్లి అవార్డులు తీసుకోవడానికి మంత్రి అనిల్‌కు ముఖం చెల్లడం లేదు.


శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు.  


పోలవరం ఇరిగేషన్‌, పవర్‌ ప్రాజెక్ట్‌ల వ్యవహారంలో జగన్మోహన్‌రెడ్డి రోజుకో విధంగా చిత్రవిచిత్రమైన విన్యాసాలు చేస్తున్నారని, హైడల్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ గురించి మాట్లాడాల్సిన ఏపీ జెన్‌కో అధికారులు, మంత్రులు తెల్లమొహాలు వేసుక్కూర్చుంటే, ముఖ్యమంత్రేమో కాంట్రాక్టర్లతో కలిసి కేసీఆర్‌తో మంతనాలు జరుపుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్‌నేత, మాజీ మంత్రి,  దేవినేని ఉమామహేశ్వరరావు ఎద్దేవా చేశారు. మంగళవారం ఆయన పార్టీ రాష్ట్రకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్‌ ఇరిగేషన్‌ పనులు పీపీఏ (పోలవరం ప్రాజెక్ట్‌ అథారిటీ), కేంద్ర జలవనరుల శాఖ, సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌ (సీవీసీ), డ్యామ్‌డిజైన్‌ రివ్యూప్యానెల్‌ ఆధ్యర్యంలో జరుగుతుండగా రూరల్‌ ఎలక్ట్రికల్‌ కార్పొరేషన్‌ (ఢిల్లీ) రుణసాయంతో, ఏపీ జెన్‌కో ఆధ్వర్యంలో, 960 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్ట్‌ పనులు జరుగుతున్నాయని ఉమా పేర్కొన్నారు. ఈ పనులకు సంబంధించి రివర్స్‌టెండరింగ్‌ పేరుతో డ్రామాలాడిన రాష్ట్ర ప్రభుత్వం, జీవో-67లోని నిబంధనలకు విరుద్ధంగా, సింగిల్‌ టెండర్‌ను పరిగణనలోకి తీసుకొని, ప్రాజెక్ట్‌నిర్మాణ పనుల్లో ఏమాత్రం అనుభవం, అర్హతలేని 'మెగా' కంపెనీని ఎలా ఎంపిక చేసిందో, ఎవరి ప్రమేయంతో ఎంపిక చేసిందో ఇరిగేషన్‌, జెన్‌కో అధికారులు, సంబంధిత మంత్రులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ ప్రాజెక్ట్‌ పనులకు సంబంధించి టర్బైన్ల పనులన్నీ చివరి దశకొచ్చిన సమయంలో, మరో రెండేళ్లలో విద్యుత్‌ ఫలాలు రాష్ట్రానికి అందుతున్న వేళ, పోలవరం విద్యుత్‌ పవర్‌ప్రాజెక్ట్‌ పనులకు మళ్లీ టెండర్లు పిలిచి, 58నెలల కాలవ్యవధితో వేరేసంస్థకు పనులప్పగించడం, తెలివిగల జగన్‌కే సాధ్యమైందని మాజీమంత్రి దెప్పిపొడిచారు. గతప్రభుత్వంలో పవర్‌ప్రాజెక్ట్‌ పనులు పొందిన సంస్థ, 2022 ఫిబ్రవరి నాటికి పూర్తిచేస్తామని, 960 మెగావాట్ల జలవిద్యుత్‌ని అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేస్తే,  దాన్ని కాదని వేరేసంస్థకు అవేపనులు, ఇంకాఎక్కువ సమయంతో కట్టబెట్టడానికి జగన్మోహన్‌రెడ్డి ఎందుకు ఉవ్విళ్లూరారో సమాధానం చెప్పాలని దేవినేని నిగ్గదీశారు. ఆసంస్థకు ఎక్కువ సమయమివ్వడం వల్ల దాదాపు 15,484 మిలియన్‌యూనిట్లను, యూనిట్‌ రూ.4 చొప్పున  కొనుగోలు చేసినా,  15,484 యూనిట్లకు రూ.6193 కోట్లను రాష్ట్రప్రభుత్వం నష్టపోనుందని ఆయన స్పష్టంచేశారు. ఇద్దరు ముఖ్యమంత్రులు గోదావరి నీటిని ఎలా శ్రీశైలానికి తీసుకెళ్లాలని చర్చిస్తుంటే, సమావేశంలో రాష్ట్ర ఇరిగేషన్‌మంత్రి లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. వేమిరెడ్డి, వైవీ.సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి అనే కాంట్రాక్టర్లతో కలిసి జగన్మోహన్‌రెడ్డి జరిపిన చర్చల్లో ఎక్కడా కూడా రాష్ట్రసాగునీటి విభాగం అధికారులుగానీ, విద్యుత్‌శాఖాధికారులు గానీ, సదరు శాఖల మంత్రులుగానీ లేకపోవడం విడ్డూరంగా ఉందని ఉమా చెప్పారు. చర్చల్లో కాంట్రాక్టర్లమయం తప్ప, అధికారులు, మంత్రులు మచ్చుకైనా లేకుండా ఇద్దరు ముఖ్యమంత్రులు నాలుగుగంటలు చర్చించడం జరిగిందన్నారు. వీరంతా కలిసి,  గోదావరి నీళ్లను శ్రీశైలానికి తరలిస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు నాలుగు గంటలపాటు ఏఏ అంశాలపై చర్చించారో ఎందుకు బహిర్గతం చేయడంలేదన్నారు. ఇరురాష్ట్రాల మధ్యగల విద్యుత్‌ సమస్యలపై చర్చించారో,  తెలంగాణ నుంచి రావాల్సిన రూ.5వేలకోట్ల విద్యుత్‌ బకాయిల గురించి చర్చించారో, షెడ్యూల్‌9-10లోని అంశాల గురించా... లేక ఢిల్లీలోని ఏపీభవన్‌ ఆస్తులగురించి మాట్లాడారో,  లేక గోదావరిజలాలు తెలంగాణలో పారించడానికి ఎన్నికిలోమీటర్లు కాలువలు, టన్నెల్స్‌ తవ్వాలి.. ఆ పనులు రూ.లక్షా40వేల కోట్ల పోలవరంపనుల్ని ఏసంస్థకైతే అప్పగించారో అదేసంస్థకు ఇవ్వడానికి  ఆలోచనలు చేశారో జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు చెప్పాలని దేవినేని డిమాండ్‌చేశారు. ఇవేవీ కాకుండా గత ఎన్నికల్లో కేసీఆర్‌ చేసిన సాయానికి ప్రతిఫలంగా జగన్మోహన్‌రెడ్డి ఏం సాయం చేయబోతున్నాడని చర్చించారా.. లేక రాబోయే ఎన్నికల గురించి చర్చలు జరిపారో ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించాలని ఉమా డిమాండ్‌ చేశారు. నిన్నటి సమావేశానికి కూడావెళ్లని రాష్ట్ర జలవనరుల మంత్రి, అధికారంలోకి వచ్చి 4 నెలలైనా పోలవరం పనుల్లో ఒక్కబొచ్చె కూడా సిమెంట్‌ వేయడం చేతగాని ఆయనకు,  30లక్షల క్యూబిక్‌మీటర్ల కాంక్రీట్‌ పనులు చేయించిన నాపై ఆరోపణలు చేయడానికి ఏంఅర్హత ఉందని ఉమా ప్రశ్నించారు. జగన్మోహన్‌రెడ్డి పోలవరం వెళ్లినప్పుడు, పనులుచేస్తున్న సంస్థ చాలా స్పష్టంగా 2020కి పనులన్నీ పూర్తి చేస్తామని చెప్తే, లేదు.. లేదు..అలా వద్దు 2021జూన్‌కి పూర్తి చేయాలని స్వయంగా ముఖ్యమంత్రే చెప్పారని మాజీ మంత్రి గుర్తుచేశారు. 2017 సెప్టెంబర్‌లో నవయుగ కంపెనీ రూ.3220కోట్లకు పవర్‌ప్రాజెక్ట్‌ నిర్మాణం పూర్తిచేస్తామంటే, మెగా ఇంజనీరింగ్‌ కంపెనీ సంస్థ, రూ.3455 కోట్లకు కడతామని చెప్పడం జరిగిందన్నారు. రూ. 235కోట్లు ఎక్కువ అడిగిన అదే మెగా సంస్థ, 2019 సెప్టెంబర్‌లో రూ.2810 కోట్లకు పనులు చేయడానికి సిద్ధపడటం వెనుక ఉన్న లోగుట్టు ఏమిటో జగన్మోహన్‌రెడ్డి తెలియచేయాల న్నారు. అప్పటికి, ఇప్పటికీ రూ.645కోట్ల తక్కువకు మెగా కంపెనీ ఎలా టెండర్లు వేసిందన్నారు. రెండేళ్లలో కాళేశ్వరం పనులు చేస్తున్న  మెగా ఇంజనీరింగ్‌ కంపెనీ పోలవరం హైడ్రోప్రాజెక్ట్‌ పనుల్ని తక్కువ మొత్తానికి చేయడానికి, అంతే తక్కువకు టెండర్లు వేయడానికి ఎందుకు సిద్ధపడిందో, ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గిందో చెప్పాలని ఉమా కోరారు. పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు తగ్గించాలని కేసీఆర్‌ శాసనసభలో చెప్తే, జగన్మోహన్‌రెడ్డి దాన్ని ఎందుకు ఖండించలేదన్నారు? కేసీఆర్‌ చెప్పింది తప్పు, దానికి నేను ఒప్పుకోను అని జగన్మోహన్‌రెడ్డి ఎందుకు అనడం లేదని ఉమా నిలదీశారు. పోలవరం జలాలను ఆంధ్రప్రదేశ్‌ భూభాగం నుంచే రాయలసీమకు, నెల్లూరుకు తీసుకెళ్తామనే మాట జగన్‌ నోటినుంచి ఎందుకు రావడం లేదన్నారు? కేసీఆర్‌తో లాలూచీపడి గత ఎన్నికల్లో లబ్దిపొందిన జగన్మోహన్‌రెడ్డికి, ఆంధ్రరాష్ట్ర రైతాంగం ప్రయోజనాలను కేసీఆర్‌కు తాకట్టుపెట్టే హక్కు ఎవరిచ్చారని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రూ.235 కోట్లు ఎక్కువ కావాలని అడిగిన మెగా సంస్థ,  రాష్ట్రప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.1800 కోట్ల పాతబిల్లుల కోసం, ఇప్పుడు జగన్‌ ఆదేశాలకు అనుగుణంగా తక్కువకు టెండర్లు వేసిందన్నారు. తక్కువకు వేస్తేనే బిల్లులు ఇస్తామని బెదిరించీ మరి, రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీల మెడలు వంచిందన్నారు. గతంలో వైఎస్‌ జలయజ్ఞంలో చేసిన పాపాలను కడిగి, 75 శాతం పోలవరం పనులను పూర్తిచేసినందుకుగాను కేంద్రం నుంచి రాష్ట్రానికి పలు అవార్డులు, రివార్డులు వచ్చాయని దేవినేని తెలిపారు. కేంద్రం ఇస్తామన్న అవార్డులు తీసుకోవడానికి ఢిల్లీ  వెళ్లడానికి రాష్ట్రమంత్రికి ముఖం చెల్లడం లేదని ఆయన ఎద్దేవాచేశారు. అక్కడికి వెళ్లే చంద్రబాబు హయాంలో పోలవరం పనుల్లో జరిగిన పురోగతిని అంగీకరించాల్సి వస్తుందనే భయం మంత్రి అనిల్‌లో ఉందన్నారు. కేటగిరి 1ఏలో కాంప్రహెన్సివ్‌ వాటర్‌డేటా బేస్‌ఇన్‌ పబ్లిక్‌ డొమైన్‌లో మొదటి బహుమతిగా రూ.2లక్షలు, కేటగిరి-5లో ప్రమోషన్‌ ఆఫ్‌ బేసిన్‌లెవల్‌ ఇంటిగ్రేటడ్‌ వాటర్‌ రీసోర్స్‌ మేనేజ్‌మెంట్‌ కింద రూ.2లక్షలు, కేటగిరి-1బీలో ఎసెస్‌మెంట్‌ ఆఫ్‌ది ఇంపాక్ట్‌ క్టైమెట్‌ఛేంజ్‌ ఆఫ్‌ రిసోర్స్‌ కింద రూ.1.5లక్షల ప్రైజ్‌మనీ రూపంలో మూడు అవార్డులు గత ప్రభుత్వ పనితీరు ఆధారంగా రావడం జరిగిందని మాజీమంత్రి ఉమా వివరించారు. ఈ అవార్డులే గాక, టీడీపీ ప్రభుత్వం చేపట్టిన నీరు-చెట్టు, ఇతర నీటినిర్వహణ కార్యక్రమాల వల్ల  35 అవార్డులు రావడం జరిగిందన్నారు. సమర్థవంతమైన నీటినిర్వహణ చర్యలవల్ల ఏపీ 75 పాయింట్లతో రెండోస్థానంలో ఉంటే, 74పాయింట్లతో గుజరాత్‌ తర్వాతి స్థానంలో నిలిస్తే, 50పాయింట్లతో తెలంగాణ పదో స్థానానికి పరిమితమైన విషయాలను మంత్రి అనిల్‌ ఎందుకు గ్రహించడం లేదని ఉమా నిలదీశారు. ఇలాంటి వాస్తవాలు ఒప్పుకుంటే, పోలవరంలో మేం దోపిడీ చేశామని గతంలో వారు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఒప్పుకోవాల్సి వస్తుందనే  భయం ముఖ్యమంత్రిలో, ఇరిగేషన్‌ మంత్రిలో కనిపిస్తోందన్నారు. ఎన్నికల్లో పంచినపుస్తకాల్లో , సాక్షి మీడియాలో విషం చిమ్ముతూ, పోలవరం పనుల్లో రూ.20175కోట్ల అవినీతి చేశామని మాపై బురదజల్లిన జగన్మోహన్‌రెడ్డి, కేంద్రమిచ్చే అవార్డులు తీసుకోవడానికి ఏముఖం పెట్టుకొని వెళతాడని దేవినేని నిలదీశారు. జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో కోర్టుల చుట్టూ తిరిగే వారిని పోలవరం పనులు పర్యవేక్షించడానికి ప్రభుత్వం నియమించడం దురదృష్టకరమన్నారు. నలుగురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసి, పోలవరం ప్రాజెక్ట్‌పై 20 ఏళ్లుగా పనిచేస్తున్న ఇంజనీర్‌ ఇన్‌చీఫ్‌ వెంకటేశ్వరరావును జగన్‌ ఎందుకు తొలగించాడన్నారు. తనకు కావాల్సిన వాళ్లకు పనులప్పగించడం కోసం, గత ప్రభుత్వంపై బురదజల్లడానికి సహకరించని అధికారులను  తొలగించి, తన అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా ఉన్నవారిని నియమించడంలోని ఆంతర్యమే మిటని ఉమా ప్రశ్నించారు. విజిలెన్స్‌ కేసుల్లో ఉన్న అధికారిని పోలవరం డ్యామ్‌ పనుల్లో ముఖ్యఅధికారిగా నియమించారన్నారు. సింగిల్‌ టెండర్‌ విధానంలో, ఏ విధమైన సడలింపులు, వెసులుబాట్లతో మెగా సంస్థకు ఎలా పనులు అప్పగించారో, ఇదే సంస్థ గతంలో రూ.235 ఎక్కువ కావాలని చెప్పి, ఇప్పుడు రూ.645 కోట్లకు తక్కువగా ఎలాటెండర్లు వేసిందో, జలవనరులశాఖ, ఏపీజెన్‌కో అధికారులు స్పష్టం చేయాలన్నారు.  దాదాపు రూ.900 కోట్ల తక్కువకు పనులు చేసేలా మెగా సంస్థను ఎలా మెడలు వంచారో, ఆ సంస్థకే టర్బైన్ల కాంట్రాక్ట్‌ కూడా అప్పగించడం వెనకున్న మర్మమేమిటో స్పష్టం చేయాలని ఉమా డిమాండ్‌ చేశారు.టర్బైన్ల పనుల్లో అనుభవముండి, 450 మెగావాట్ల పనులు చేసి ఉంటేనే విద్యుత్‌ ప్రాజెక్ట్‌ పనులు అప్పగించాలన్న నిబంధనను కాదని, లిఫ్ట్‌ ఇరిగేషన్‌, పైపులైన్ల పనులు చేసుంటే చాలని చెప్పి, పవర్‌ప్రాజెక్ట్‌ పనులు  మెగా సంస్థకు ఎలా కట్టబెట్టారన్నారు? దీనిపై ఇరిగేషన్‌ మంత్రి, విద్యుత్‌శాఖ మంత్రులు ఎందుకు మాట్లాడరని ఉమా ప్రశ్నించారు. డయాఫ్రమ్‌ వాల్‌, అప్పర్‌ కాపర్‌డ్యాం, లోయర్‌ కాపర్‌డ్యామ్‌, అప్రోచ్‌ఛానల్‌, స్పిల్‌ఛానల్‌ 48గేట్ల నిర్మాణం లాంటివి ఎక్కడున్నాయో, పోలవరం పనులు ఎలా జరుగుతున్నాయో తెలియని మంత్రి అనిల్‌, 75శాతం ప్రాజెక్ట్‌ పనులు పూర్తిచేసిన తెలుగుదేశం ప్రభుత్వంపై, 30సార్లు డ్యామ్‌ ప్రాంతానికి వెళ్లిన చంద్రబాబుగారిపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తెలుగుదేశంపై బురదజల్లడం మాని, మెగాకంపెనీ బిడ్‌ను బయటపెట్టాలన్నారు. జీవో 67లో చెప్పినట్లుగా ఇద్దరు బిడ్డర్లుంటేనే రివర్స్‌ టెండర్‌ అవుతుందని, అలా కాకుండా రీటెండర్లతో ఒకే బిడ్డర్‌ను ఎలా ఎంపిక చేశారని ఉమా ప్రశ్నించారు. గోదావరిలో మునిగిపోయిన పడవను బయటకు తీయలేని ఈ అసమర్థ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందా అని ఆయన ఎద్దేవా చేశారు. నీతి, నిజాయితీ, సిగ్గు అంటూ మాట్లాడే మంత్రి అనిల్‌ ఈ టెండర్లలో జరిగిన గోల్‌మాల్‌పై ఎందుకు నోరెత్తడం లేదన్నారు. తెలుగుదేశం పాలనలో నిబద్ధతతో పనిచేసిన అధికారులతో, వైసీపీ ఎందుకు పనిచేయించలేకపోతుందన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు, నలుగురు కాంట్రాక్టర్లు రెండు గంటలు ఏం చర్చించారో, రాష్ట్రానికి ఏం వెలగబెట్టారో బయట పెట్టాలని దేవినేని తేల్చిచెప్పారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
గుంటూరు కేంద్రంగా కమిషనరేట్‌
*పేకాట స్థావరంపై కలిగిరి సి.ఐ మెరుపు దాడులు* వింజమూరు, అక్టోబర్ 5 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరుజిల్లా వింజమూరు మండలంలోని నందిగుంట గ్రామ సమీపంలో పేకాట స్థావరంపై సోమవారం సాయంత్రం కలిగిరి సర్కిల్ ఇన్స్ పెక్టర్ శ్రీనివాసరావు స్వయంగా మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో 35,600 రూపాయల నగదు, 12 ద్విచక్ర వాహనాలు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడంతో పాటు 10 మంది పేకాట రాయుళ్ళను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సి.ఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ కలిగిరి సర్కిల్ పరిధిలోని కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాలలో అసాంఘిక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితులలోనూ ఉపేక్షించబోమన్నారు. పేకాట, కోడి పందేలు, అక్రమంగా మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కా విక్రయాలపై ఉక్కుపాదం మోపనున్నామని హెచ్చరించారు. ఈ మండలాలలో ఎక్కడైనా సరే ఛట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్బడినా, శాంతి భధ్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. శాంతి భధ్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. అసాంఘిక శక్తుల సమాచారమును ప్రజలు తమకు తెలియపరిచి శాంతి భధ్రతల పరిరక్షణకు దోహదపడాలని సి.ఐ ప్రజలకు పిలుపునిచ్చారు. సమాచారం అందించిన వారి వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలియజేశారు. పేకాట శిబిరంపై ఆకస్మికంగా నిర్వహించిన మెరుపు దాడులలో కలిగిరి ఎస్.ఐ వీరేంద్రబాబు, వింజమూరు ఎ.ఎస్.ఐ సాయి ప్రసాద్, వింజమూరు, కలిగిరి పోలీస్ స్టేషన్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.
Image