గుంటూరులో కాల్‌మనీ కలకలం


గుంటూరు : గుంటూరులో కాల్‌మనీ కలకలం రేపింది. రత్నారెడ్డి అనే వడ్డీ వ్యాపారి తమ నుంచి అధిక వడ్డీలు వసూలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్నారని 'స్పందన' కార్యక్రమంలో ప్రజలు ఫిర్యాదు చేశారు. స్పందనలో ఫిర్యాదు రావడంతో పోలీసులు ఆయనపై కేసు నమోదు చేసి, నిఘాలో ఉంచారు. తర్వాత ఆయన ఆఫీసులో తనిఖీలు చేపట్టి, బ్యాంకు పాస్‌బుక్కులు, ఏటీఎం కార్డులు, పొలం పాస్ బుక్కులు, ఖాళీ ప్రామీసరీ నోట్లతో పాటు కొన్ని దస్తావేజులు పోలీసులకు లభించాయి. రత్నారెడ్డి కేవలం ఉద్యోగస్థులను టార్గెట్ చేసుకొని వడ్డీ వ్యాపారం చేస్తున్నాడని, బాధితులెవరైనా ఉంటే తమకు మరింత సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. మరోవైపు రత్నారెడ్డి నుంచి లక్ష నలబై వేల నగదు, 38 పాస్ బుక్కులు, దాదాపు వంద ఖాళీ ప్రామీసరీ నోట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.