తిరుపతిలో ఈనెల 24 నా జాబ్ మేళా - శ్యామ మోహన్


తిరుపతి, సెప్టెంబర్ 22 : చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కళాశాల , రేణిగుంట    రోడ్, తిరుపతి నందు ఈనెల 24 న ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ సి.ఎస్.ఎస్. కార్పొరేషన్ నందు హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ టెక్నీషియన్ రూ.1.8 లక్షల వార్షిక వేతనం ఉద్యోగాలకు  జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లానైపుణ్యాభివృద్ధిఅధికారి శ్యామ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంజనీరింగ్ లేదా డిగ్రీ 2019 సంవత్సరములో పాస్ అయినవారు, ప్రస్తుతము చివరి సంవత్సరము (2019-2020) డిగ్రీ / ఇంజనీరింగ్ చదువుతున్న మరియు బ్యాక్ లాగ్స బ్జక్ట్స్  విద్యార్థులు   తమ  వివరాలను www.apssdc.in నందు కల జాబ్ ఫైర్ / స్కిల్ కనెక్ట్  డ్రైవ్ నందు నమోదు చేసుకోవలసి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులందరికీ 24-09-2019 తారీఖు నందు స్థానిక చదలవాడ రమణమ్మ ఇంజనీరింగ్ కాలేజీ, రేణిగుంట రోడ్, తిరుపతి నందు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడును. ఈ ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు (2019 passed outs ) తమ అడ్మిట్ కార్డు తో పాటు వారు ఉత్తీర్ణులైన ప్రొవిజనల్ సర్టిఫికెట్ లేదా కోర్స్ కంప్లీట్ సర్టిఫికేట్ లేదా మార్క్స్ సర్టిఫికెట్ ను తీసుకొని రావాలి అలాగే 2019-20 అభ్యర్థులు వారి రెస్యూమ్స్ మరియు తమ అడ్మిట్ కార్డు తీసుకొని రావాలని ఈ  అవకాశమును  సద్వినియోగ పరుచుకోవాలని ఆయన ఆప్రకటనలో తెలిపారు. సందేహాలకు మరిన్ని వివరాలకు  8121984014, 8465830771, 9542419974 మరియు Toll free: 18004252422 నెంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు . --- డి