జగన్‌ వికృతి చర్యలతో టిటిడి పవిత్రత ప్రశ్నార్ధకం

తేదీ: 19.09.2019


 


జగన్‌ వికృతి చర్యలతో టిటిడి పవిత్రత ప్రశ్నార్ధకం


టిటిడిని రాజకీయ పునరాసంలా టిటిడి కేంద్రంగా మార్చారు


     - మంతెన సత్యనారాయణ రాజు, మద్దిపట్ల సూర్యప్రకాష్‌ 


 తిరుమలకు 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలని వైఎస్‌ చెబితే ఇప్పుడు జగన్‌ టిటిడి మొత్తాన్ని తెలంగాణకు అప్పగించేలా వ్యవహరిస్తున్నారు.  ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలకు విరుద్ధంగా జగన్‌ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ప్రతిష్టాత్మకమైన తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో సభ్యులను ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్లనే ఎంపిక చేస్తారు. కాని జగన్‌ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యాపారవేత్తలను, జగన్‌ కేసులు మోస్తున్న వారిని పెట్టడం ధైవత్వం, పవిత్రతను కించపరచినట్లే అవుతుంది. టిటిడిని రాజకీయ పునరావాస కేంద్రం బోర్డుగా మార్చారు. 


 వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేసీఆర్‌ కనుసన్నల్లో ఆయన మెప్పు పొందేందుకు అనుక్షణం ఆరాటపడుతున్నారు. పవిత్రమైన టిటిడిని తెలంగాణ బోర్డులా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పక్క రాష్ట్రాల నుంచి ఇంత మందిని బోర్డు సభ్యులుగా చేయడం వెనక ఆంతర్యం ఏమిటి? దేవ స్థానం నిధులు ఆయా రాష్ట్రాలకు కేటాయించమని సభ్యులు డిమాండ్‌ చేస్తే బోర్డు పరిస్థితి ఏంటి? జగన్‌ వికృతమైన చర్యలకు దేవస్థానం బోర్డు భవిష్యత్‌ ప్రశ్నార్ధకంగా మారుస్తున్నారు. కేసీఆర్‌ సూచనల మేరకే బోర్డు సభ్యుల సంఖ్యను పెంచారు. రాష్ట్రాన్ని మీరు పాలిస్తున్నారో లేక కేసీఆర్‌ పాలిస్తున్నారో అర్ధం కాని ఆయోమయంలో ప్రజలున్నారు. కేసీఆర్‌ కుటుంబంలోనే ఇద్దరితో పాటు ఆయన ఆనుచరుడు ఒకరు, వాళ్ల అబ్బాయి చెప్పారని మరోకరికి బోర్డు సభ్యులుగా అవకాశం ఇవ్వటం దేనికి సంకేతం? ఏపీకి 8 మంది, తెలంగాణకి 7 మంది, తమిళనాడుకి 4 మంది, కర్ణాటక 3 మంది, మహారాష్ట్రకి 1, ఢిల్లీకి 1 సభ్యులుగా కేటాయించారు. రాష్ట్రంలో సమర్ధులు ఎవ్వరు లేరా? స్థానికులకు 75% రిజర్వేషన్‌ అమలు చేస్తామని చెప్పి దేశ వ్యాప్తంగా ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి టిటిడిలో ఎందుకు రిజర్వేషన్‌ అమలు చేయలేదు? 75% అంటే కనీసం 18 మంది కేవలం మన రాష్ట్రం నుంచి తీసుకోవాలి. జగన్‌ ప్రభుత్వం కేవలం మాటల ప్రభుత్వం అని ప్రజలకు అర్ధం అయ్యింది. మహిళలకు పెద్ద పీట వేస్తామని ఎన్నికల ఊదరగొట్టిన జగన్‌ తీరా అధికారంలోకి వచ్చిన తరువాత తిలోధకాలు పలికారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు దేవాలయాల్లో నామినేటెడ్‌ పోస్టుల్లో 50% కల్పిస్తామని బిల్లును టిటిడి బోర్డులో ఎందుకు అమలు చేయలేదు? టిటిడి బోర్డు సభ్యులుగాఎంతో ఆధ్యాత్మికంగా ఉన్న వారిని తీసుకోవాలి. జగన్‌ ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యాపారస్తులను, జగన్‌ కేసులను ఎదుర్కొంటున్న వారిని, మద్యం వ్యాపారులకు స్థానం కల్పించారు.  


 ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ్యులు, మంత్రులకు రెండు లేఖలు మించి ఎక్కువ అనుమతించుకుండా తెలంగాణ మంత్రులకు మాత్రం 10 లేఖలు ఇచ్చినా అనుమతించటం వెనక ఉన్న లోగుట్టును భయటపెట్టాలి. మాట తప్పను మడమ తిప్పనని చెప్పిన జగన్‌ 75% రిజర్వేషన్‌ను టిటిడిలో ఎందుకు అమలు చేయలేదు? అడగక ముందే స్పందించే స్వామిజీలు ఇంత అన్యాయం జరుగుతుంటే నోరు మెదపటానికి ఎందుకు వెనకాడుతున్నారు?


 


 ఐఖి/-          ఐఖి/-


మద్దిపట్ల సూర్యప్రకాష్‌      మంతెన సత్యనారాయణ రాజు


తెలుగు యువత          శాసన మండలి సభ్యులు