వైభ‌వంగా ప్రారంభ‌మైన ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రులు. 

విజయవాడ: సెప్టెంబర్ 29 (అంతిమ తీర్పు).:           , ఇంద్ర‌కీలాద్రి... 
* ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం ఇంద్ర‌కీలాద్రిపై శ్రీదుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామివార్ల దేవ‌స్థానంలో వైభ‌వంగా ప్రారంభ‌మైన ద‌స‌రా శ‌ర‌న్న‌వ‌రాత్రులు. 
* స్న‌ప‌నాభిషేకం అనంత‌రం ఉద‌యం 9 గంట‌ల నుండి భ‌క్తుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తించిన దుర్గ‌గుడి అధికారులు
* స్వ‌ర్ణ‌క‌వ‌చాలంకృత దుర్గాదేవిగా ద‌ర్శ‌న‌మిస్తున్న జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ‌
* అష్ట భుజాల‌తో సింహాస‌నం మీద త్రిశూల‌ధారియై క‌న‌క‌పు ధ‌గ‌ధ‌గ‌ల‌తో మెరిసిపోతున్న శ‌క్తిస్వ‌రూపిణి
* దసరా ఉత్సవాల నేప‌ధ్యంలో ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు 
* భ‌క్తుల‌తో కిట‌కిట‌లాడుతున్న ఇంద్ర‌కీలాద్రి, దిగువున్న ఉన్న ఘాట్‌రోడ్డు, రావిచెట్టుసెంట‌ర్‌, వినాయ‌కుని గుడి క్యూ మార్గాలు 
* జై.. దుర్గా.. జైజై జ‌గ‌జ్జ‌న‌నీ అంటూ భ‌క్తుల నామ‌స్మ‌ర‌ణ‌తో మారుమ్రోగుతున్నఇంద్ర‌కీలాద్రి
* క్యూ మార్గాల‌లో చిన్నారుల‌కు పాలు పంపిణీ 
* భ‌క్తుల పుణ్య‌స్నానాల‌తో (జ‌ల్లు స్నానం) కిట‌కిట‌లాడుతున్న దుర్గాఘాట్‌. 
* కేశ‌ఖండ‌న‌శాల‌లో దుర్గ‌మ్మ‌కు పెద్ద‌సంఖ్య‌లో త‌ల‌నీలాలు స‌మ‌ర్పిస్తున్న భ‌క్తులు
* ఆదివారం సెల‌వుదినం కావ‌డంతో కుటుంబ‌స‌మేతంగా ఇంద్ర‌కీలాద్రికి చేరుకుంటున్న భ‌క్త‌జ‌న సందోహం 
* ఇంద్ర‌కీలాద్రి ప‌రిస‌ర ప్రాంతాల చుట్టూ పెద్ద సంఖ్య‌లో బందోబ‌స్తు నిర్వ‌హిస్తున్న పోలీసులు 
* అమ్మ‌వారి ద‌ర్శ‌నానికి చేరుకునేందుకు వీఐపీల‌కు పున్న‌మీఘాట్‌లో ప్ర‌త్యేక ఏర్పాట్లు
* ఇంద్ర‌కీలాద్రిపై జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను కుటుంబ సమేతంగా దర్శించుకున్న రాష్ట్ర ప‌శుసంవ‌ర్థ‌క శాఖా మంత్రి మోపిదేవి వెంకటరమణ 
* దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న విజ‌య‌వాడ న‌గ‌ర పోలీస్ క‌మీష‌న‌ర్ సీహెచ్ ద్వార‌కా తిరుమ‌ల‌రావు


Popular posts
చంద్రబాబూ రాజకీయాలనుంచి తప్పుకో.నీ మైండ్‌ కరప్ట్‌ అయింది.
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
మిత్ర ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ..