మాచర్లలో టీడీపీ కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాన్ని  ఖండించిన చంద్రబాబు

తేది. 30-09-2019


మాచర్లలో టీడీపీ కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులు, అక్రమ నిర్బంధాన్ని  ఖండించిన చంద్రబాబునాయుడు 


జైలు గోడల మధ్య కూడా హత్యలు చేయించిన చరిత్ర వైఎస్‌ కుటుంబానిది


అహింస, సేవాతత్పరత వంటి గాంధీ సిద్ధాంతాలే టీడీపీ సిద్ధాంతాలు 


అక్టోబర్‌ 2 పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు


 చట్టాన్ని చేతిలో తీసుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను వేధిస్తే ఊరుకునేది లేదని పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు తెలిపారు. సోమవారం నాడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, పార్టీ న్యాయవాద విభాగం సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు గారు మాట్లాడుతూ..   గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం గంగలగుంట గ్రామంలో పార్టీ మారలేదన్న కక్షతో తప్పుడు కేసులను బనాయించి మాచర్ల రూరల్‌ ఇన్‌స్పెక్టర్‌ భక్తవత్సలరెడ్డి అక్రమంగా 12 రోజుల పాటు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్న బలహీన వర్గానికి చెందిన బత్తుల శ్రీరాములు, మేకల రమణయ్య, బత్తుల శ్రీనులను పీఎస్‌లో నిర్బంధించి వేధించడాన్ని ఆయన ఖండించారు. వారి కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు ఊరి నుంచి తరిమివేసి.. పంట పొలాలను నాశనం చేయడం దుర్మార్గమన్నారు. జైలు గోడల మధ్య కూడా హత్యలు చేయించిన చరిత్ర వైఎస్‌ కుటుంబానికి ఉందన్నారు. అభివృద్ధిని వదిలేసి రాజకీయపరమైన ఆధిపత్యం కోసం హింసాత్మక నేరాలకు పాల్పడటం వైకాపా నేతల దిగజారుడుతనానికి నిదర్శనమని చంద్రబాబు గారు తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులపై జరుగుతున్న దాడులకు, పెడుతున్న అక్రమ కేసులకు జగన్మోహన్‌రెడ్డినే బాధ్యత వహించాలన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్టంగా మారిస్తే చూస్తూ సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ శ్రేణులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద పెడుతున్న అక్రమ కేసులు, సోషల్‌మీడియా వాలంటీర్లపై పెడుతున్న కేసులు, వేధింపుల గూర్చి పార్టీ న్యాయవాద విభాగంతో సమీక్షించారు. వైకాపా నాయకులు చట్టాలను ఉల్లంఘిస్తున్న వైనానికి రాష్ట్ర ప్రజల తరపున పోరాటానికి సిద్ధమని చంద్రబాబునాయుడు గారు తెలిపారు.    


  అక్టోబర్‌ 2న జాతిపిత, స్వాతంత్య్ర సమరయోధుడు మహాత్మగాంధీ 150వ జయంతి వేడుకలను పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఉదయం 10.50 గం.లకు నిర్వహించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. అహింత ద్వారానే మానవ సమాజం హింస నుంచి బయటపడుతుందని చెప్పిన మహనీయుడు గాంధీ అని చంద్రబాబు గారు తెలిపారు. అందరికీ ఉపాధి, నివాసం, విద్య, ఆరోగ్యం ఉండాలన్న గాంధీ ఆశయాలే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలన్నారు. నిరాడంబరమైన జీవితంతో ప్రపంచ చరిత్రను మలుపుతిప్పిన గాంధీజీ జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు. అహింస, సేవాతత్పరత, రుజువర్తన వంటి గాంధీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఎమ్మెల్సీ రామకృష్ణ, ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్‌, మాజీ జెడ్పీ ఛైర్‌పర్సన్‌ అనురాధ, టీడీపీ లీగల్‌సెల్‌ సభ్యులు పాల్గొన్నారు.


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
గుంటూరు కేంద్రంగా కమిషనరేట్‌
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image