శివప్రసాద్‌కు భౌతికకాయానికి టీఆర్ఎస్ ఎంపీ నివాళి

శివప్రసాద్‌కు భౌతికకాయానికి టీఆర్ఎస్ ఎంపీ నివాళి..
తిరుమల : టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆదివారం ఉదయం టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు తిరుపతికి చేరుకుని.. శివప్రసాద్ భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. శివప్రసాద్ మరణవార్త చాలా బాధేసిందన్నారు.
మిత్రుడ్ని కోల్పోయా : 'పార్లమెంటులో మేమిద్దరం కలిసి ఎన్నో పోరాటాలు చేశాము. ఇద్దరి మద్య 15 ఏళ్ల రాజకీయ అనుబంధం ఉంది. రాష్ట్ర విభజన సమసమయంలో ఆయన ఏపీకోసం.. నేను తెలంగాణా కోసం చేసిన పోరాటాలు గుర్తుకు వచ్చాయి. మంచి నాయకుడ్ని, మిత్రుడ్ని కోల్పోయాను' అని చెబుతూ నామా కంటతడిపెట్టారు. కాగా.. టీడీపీని వీడి టీఆర్ఎస్‌లో చేరిన సంగతి తెలిసిందే.