ఇంత అరాచకం దేశంలో ఎక్కడా చూడలేదు: చంద్రబాబు ధ్వజం

టిడిపి నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
పాల్గొన్న ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,ప్రజా ప్రతినిధులు
ఇంత అరాచకం దేశంలో ఎక్కడా చూడలేదు: చంద్రబాబు ధ్వజం


గ్రామాల నుంచి తరిమేయడం చూడలేదు. భూములు బీళ్లు పెట్టడం ఎన్నడూ లేదు. ఇళ్లపై సామూహిక దాడులు గతంలో లేవు. ఇన్ని దాడులు,దౌర్జన్యాలు,విధ్వంసాలు ఎప్పుడూ లేవు.
ఊళ్లనుంచి తరిమేసి 100రోజులు దాటిపోయింది. భూముల నుంచి వెళ్లగొట్టి మూడున్నర నెలలైంది. 500పైగా కుటుంబాలు పరాయి గ్రామాల్లో తలదాచుకుంటున్నాయి. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇంత దుస్థితి లేదు.
పౌరుల ప్రాధమిక హక్కులను కాపాడే పోరాటం ఇది. ఆస్తుల భద్రత,ప్రాణాల రక్షణ కోసం పోరాటం. 
శాంతియుతంగా ''ఛలో ఆత్మకూరు'' నిర్వహిస్తున్నాం. బాధితులకు న్యాయం చేసేందుకే ఈ కార్యక్రమం చేపట్టాం.
''మా ఇంటికి మేము వెళ్తున్నాం..మాకు అండగా అందరూ ఉండాలి..మా ప్రాణాలకు, ఆస్తులకు రక్షణగా ఉండాలి'' అని బాధితులే అడుగుతున్నారు. అందుకే తెలుగుదేశం పార్టీ మొత్తం నాయకత్వం బాధితులకు అండగా ఉంటోంది. 
సొంతూళ్లో నివసించే  హక్కు కోసం బాధితుల పోరాటం ఇది. సొంత భూములు సాగు చేసుకోవడం కోసం రైతుల ఆరాటం. 
రాజ్యాంగం కల్పించిన పౌర హక్కుల సాధనే టిడిపి లక్ష్యం. 
వైసిపి ప్రభుత్వ బాధితులకు టిడిపి అండగా ఉంటుంది.
కార్యకర్తలను కాపాడుకోవడం రాజకీయ పార్టీల విధి. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలన్నీ మనగలగాలి.
పల్నాడులో మానవ హక్కుల ఉల్లంఘనను అందరూ ఖండించాలి. బాధిత కుటుంబాలకు సంఘీభావంగా ఉండాలి.
దాడులు,దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయాలి. స్వేచ్ఛగా నివసించే హక్కు పౌరులు అందరికీ ఉంది. భూములు సాగు చేసుకునే హక్కు ప్రతి రైతుకు ఉంది. 
నచ్చిన పార్టీకి ఓటేసే స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించింది. టిడిపికి ఓటేసిన వారిపై దాడులు, దౌర్జన్యాలు అత్యంత హేయం.
టిడిపికి ఓటేసినవాళ్ల ఆస్తుల ధ్వంసం అమానుషం.
ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ఈ నెల 11న ''ఛలో ఆత్మకూరు''. పౌర హక్కులను కాపాడేందుకే ''ఛలో ఆత్మకూరు'' కార్యక్రమం.
పల్నాట గ్రామాల్లో దాడులు, దౌర్జన్యాలను ప్రతిఒక్కరూ ఎండగట్టాలి. వైసిపి ప్రభుత్వ అరాచకాలకు ముగింపు పడాలి.
టిడిపి పోరాటం ఇంతటితో ఆగదు. అక్రమ కేసులను ఎదుర్కొంటాం, బాధితుల పక్షాన పోరాడతాం. కార్యకర్తల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణగా ఉంటాం.