టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు

తిరుమల :
టిటిడి ధర్మకర్తల మండలి సమావేశంలో ముఖ్య నిర్ణయాలు 
టిటిడి ధర్మకర్తల మండలి తొలి సమావేశం సోమ‌వారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో జరిగింది. స‌మావేశం అనంత‌రం టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆ వివ‌రాలు ఇలా ఉన్నాయి.  ఆరు నెల‌లుగా పెండింగ్‌లో ఉన్న ప‌లు అంశాల‌పై చ‌ర్చించి పాల‌న‌కు ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు తీసుకున్నాం.  తిరుమ‌ల‌లో తాగునీటి స‌మ‌స్యను శాశ్వ‌తంగా ప‌రిష్క‌రించేందుకు బాలాజి రిజ‌ర్వాయ‌ర్ నిర్మాణం చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించాం. ఇందుకోసం అంచ‌నాల‌ను రూపొందించి వ‌చ్చే స‌మావేశంలో ఆమోదిస్తాం. అమ‌రావ‌తిలో శ్రీ‌వారి ఆల‌య నిర్మాణ వ్య‌యాన్ని రూ.36 కోట్ల‌కు త‌గ్గించి ఒక ప్రాకారంతో ఆల‌య నిర్మాణం చేప‌ట్టాల‌ని నిర్ణ‌యం. తిరుప‌తిలోని అవిలాలకు సంబంధించి తిరుప‌తివాసుల‌కు ఉప‌యోగ‌క‌రంగా ఉండేలా చెరువు, పార్కు మాత్ర‌మే నిర్మించాల‌ని నిర్ణయం. తిరుమ‌ల‌లో ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడేందుకు ఎల‌క్ట్రిక్ బ‌స్సులు, ఎల‌క్ట్రిక్ కార్లు ప్ర‌వేశ‌పెట్టాల‌ని నిర్ణ‌యం.  టిటిడిలో ప‌నిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల‌పై స‌మ‌స్య‌ల‌పై చ‌ర్చించేందుకు స‌బ్ క‌మిటీ ఏర్పాటుకు నిర్ణ‌యం.  రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించిన అనంత‌రం గ‌రుడ వార‌ధి నిర్మాణానికి నిధుల కేటాయింపుపై నిర్ణ‌యం. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ సింగ్‌, రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్‌ డా. ఎం.పద్మ, తుడ ఛైర్మ‌న్ ఎక్స్ అఫిషియో స‌భ్యుడు డా. చెవిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు యువి.ర‌మ‌ణ‌మూర్తి రాజు, మేడా మ‌ల్లికార్జున‌రెడ్డి,  కె.పార్థ‌సార‌థి, శ్రీ ముర‌ళీకృష్ణ‌, ఎన్‌.శ్రీ‌నివాస‌న్‌, జె.రామేశ్వ‌ర‌రావు, డా.ఎం.నిచిత‌,  ఎన్‌.సుబ్బారావు, జి.వెంక‌ట‌భాస్క‌ర్‌రావు, బి.పార్థ‌సార‌థిరెడ్డి, డి.దామోద‌ర్‌రావు, ఎంఎస్‌.శివ‌శంక‌ర‌న్‌, కుమార‌గురు, సి.ప్ర‌సాద్‌కుమార్‌,  మోరంశెట్టి రాములు,  పి.ప్ర‌తాప్ రెడ్డి,  కె.శివ‌కుమార్, తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి  ఎవి.ధ‌ర్మారెడ్డి, తిరుప‌తి జెఈవో  పి.బ‌సంత్‌కుమార్‌, సివిఎస్వో  గోపినాథ్ జెట్టి త‌దిత‌రులు పాల్గొన్నారు.


Popular posts
*వింజమూరు ప్రజలు జాగ్రత్తలు వహించండి* డాక్టర్ రమేష్.... వింజమూరు, సెప్టెంబర్ 22 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి పట్ల తగు జాగ్రత్తలు వహించాలని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైధ్యాధికారి డాక్టర్ రమేష్ కోరారు. ఇప్పటివరకు మండలంలో 500లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగిందన్నారు. అయితే అదే స్థాయిలో బాధితులు కోలుకుంటుండటం సంతోషకరమైన విషయమన్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ వైరస్ పట్ల అవగాహనా రాహిత్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం శ్రేయస్కరం కాదన్నారు. కరోనా నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖలు ఎంతగానో కృషి చేస్తున్నాయన్నారు. అయితే ప్రభుత్వ సూచనలను పెడచెవిన పెట్టడం వలన వైరస్ ప్రబలేందుకు పరోక్షంగా దోహదపడుతున్నామన్నారు. కనీస జాగ్రత్తలు పాటించిన పక్షంలో కరోనాను అంతమొందించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ప్రతి నిత్యం వేడి వేడి ఆహార పదార్ధాలను భుజించడం, దాహం వేసినప్పుడు గోరువెచ్చని నీటిని సేవించడం, యోగా, ముఖానికి మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి సూచనలను ప్రతి ఒక్కరూ విధిగా అలవాటు చేసుకోవాలన్నారు. వైరస్ సోకిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రమేష్ తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.
Image
*ఉపాధి పనుల్లో కొండంత అవినీతిని గోరంతగా ప్రజావేదికలో తేల్చిన అధికారులు* ఉదయగిరి, అక్టోబర్ 20 (అంతిమ తీర్పు - ఇంచార్జ్ దయాకర్ రెడ్డి): గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకం అధికారులకు కాసుల వర్షం కురిపించే కల్పతరువుగా రంగా మారింది. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలం లో 2017,2018,2019 సంవత్సరం నుంచి ఇప్పటివరకు జరిగిన 24.88 కోట్ల రూపాయలు పనులలో 7.69 లక్షలు రూపాయలు అవినీతి జరిగినట్లు సామాజిక తనిఖీ లో అధికారులు నిగ్గు తేల్చారు. దాదాపు 5 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రజలు గుసగుసలు వినిపిస్తున్నాయి.అంతే కాకుండా గ్రామాలలో లేని వారి పేర్లు ఫీల్డ్ అసిస్టెంట్ లు మస్టర్లలో వేసుకొని పెద్ద ఎత్తున ఉపాధి అధికారులు మండల స్థాయి అధికారులు అవినీతికి పాల్పడినట్లు తెలుస్తున్న అధికార పార్టీ నాయకులను లోబర్చుకుని పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన సామాజిక తనిఖీ ఆడిట్లో అవినీతి బయట పడకుండా పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు ప్రజలు అనుకుంటున్నారు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన సంబంధిత మండల ఉపాధి అధికారులు మండల స్థాయిఅధికారులపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వరికుంటపాడు ప్రాంత ప్రజలు కోరుతున్నారు.
Image
ఆ నేరస్తుడిని కఠినంగా శిక్షించాలి : సీఎం జగన్‌
16 న చిన్న, మధ్యతరహా పత్రికల రాష్ట్ర మహాసభ : మల్లెల      
చెన్నకేశవ స్వామి ఆలయ ఈవో నారాయణ రెడ్డి మృతి పట్ల మంత్రి సంతాపం