13–09–2019
అమరావతి
అమరావతి: సచివాలయంలో నీతి ఆయోగ్ బృందంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్, అధికారుల భేటీ
నీతిఆయోగ్ వైస్‌ఛైర్మన్ రాజీవ్‌కుమార్‌కు ప్రజంటేషన్ ఇచ్చిన అధికారులు
రంగాల వారీగా రాష్ట్రంలో పరిస్థితులను వివరించిన అధికారులు
*చీఫ్‌సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం*
రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధిని రెండింటినీ ముందుకు తీసుకెళ్తున్నాం: చీఫ్‌సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం
విభజన కారణంగా రాష్ట్రానికి నష్టం జరిగింది: సీఎస్
దాన్ని పూడ్చాలంటే నీతి ఆయోగ్ సహకారం అవసరం: సీఎస్
అది నీతిఆయోగ్ వల్లే సాధ్యమవుతుంది: సీఎస్
అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఉన్న ఏపీ, విభజన కారణంగా అభివృద్ధికి దూరమైంది: సీఎస్
పరిశ్రమలు, సేవలు, వ్యవసాయం.. ఈరంగాలే అభివృద్ధికి చోదకాలు:
విశాఖపట్నం, విజయనగరం, కడప ఆస్పిరేషనల్ జిల్లాలు:
వీటితోపాటు శ్రీకాకుళం, ప్రకాశం, అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాలను కూడా అభివృద్ధి చేయాల్సి ఉంది:
15వ ఆర్థిక సంఘం, నీతిఆయోగ్‌లు ఉదారంగా సహాయం చేయాల్సిన అవసరం ఉంది:
సమగ్రాభివృద్ధితో మోడల్ స్టేట్ గా రాష్ట్రాన్ని తయారుచేయాలని గౌరవ ముఖ్యమంత్రిగారి సంకల్పం: సీఎస్
5 ట్రిలియన్ అమెరికన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం దిశగా కేంద్రం అడుగులేస్తోంది: సీఎస్
రాష్ట్రానికి కూడా తగిన రీతిలో సహాయం చేస్తే ఆ లక్ష్య సాధనలో మేం కూడా భాగస్వాములం అవుతాం: సీఎస్
దేశం 10–11 శాతం వృద్ధిరేటు సాధించాలని అనుకున్నప్పుడు రాష్ట్రానికి సహాయం ఉండాలి: సీఎస్
తగిన వనరులు, నైపుణ్యం, అంకిత భావం ఉన్న అధికారులు, దృఢ నిశ్చయం ఉన్న నాయకత్వం మాకు ఉన్నాయి: సీఎస్
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలికాలంలో అనేక చర్యలు తీసుకుంది: సీఎస్
బహుముఖ ప్రణాళికలతో ముందడుగు వేస్తున్నాం: సీఎస్
పరిపాలనలో వికేంద్రీకరణకు గ్రామసచివాలయాలు తీసుకొచ్చాం: సీఎస్
విభజనలో భాగంగా హామీ ఇచ్చిన కడప స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలి: పారదర్శకతతో కూడిన విధానాలను పరిపాలనలోకి తీసుకు వచ్చాం:
గడచిన అసెంబ్లీ సమావేశాల్లో 18 చట్టాలు చేశాం: సీఎస్
మొదటిసారిగా జ్యుడిషియల్ ప్రివ్యూ చట్టాన్ని తీసుకు వచ్చాం: సీఎస్
టెండర్లను జ్యుడిషియల్ ప్రివ్యూకు పంపేలా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు: సీఎస్
వైజాగ్– చెన్నై, చెన్నై – బెంగుళూరు కారిడార్లలో క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నాం:సీఎస్
పెట్టుబడులకు కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నాం, మీ సహకారం కావాలి:సీఎస్
నేపుణ్యాభివృద్ధికోసం 25 ఇంజినీరింగ్ కాలేజీలను ఎంపిక చేస్తున్నాం:సీఎస్
కాలుష్యాన్ని నివారించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం:సీఎస్
డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెడుతున్నాం, దీనికి సహకారం కావాలి:సీఎస్
నిరక్షరాస్యతను నిర్మూలించడానికి అమ్మ ఒడిని ప్రారంభిస్తున్నట్టుగా వెల్లడించిన సీఎస్
దీనికి మానవ వనరుల అభివృద్ధిశాఖ నుంచి తగిన సహాయం అందేలా చూడాలన్న సీఎస్
*రాజీవ్ కుమార్, నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్*
సీఎం ఢిల్లీ వచ్చినప్పుడు సుదీర్ఘంగా నాతో చర్చించారు: రాజీవ్ కుమార్, నీతిఆయోగ్ వైస్ ఛైర్మన్
నవరత్నాలు కార్యక్రమాలను నాకు వివరించారు: రాజీవ్ కుమార్
సీఎం ఆలోచన, విజన్, ప్రణాళికలు చాలా బాగున్నాయి:
సీఎం వైయస్ జగన్ అంకిత భాగం, విజన్ నన్ను ఆకట్టుకున్నాయి:
వచ్చిన మూడు నాలుగు నెలల్లోనే పనితీరు చూపారు:
మేం చేయదగ్గదంతా చేస్తాం, తగిన రీతిలో సహకారం అందిస్తాం:
అభివృద్ధి పథంలో రాష్ట్రం ముందు ఉండేలా తోడ్పాటును అందిస్తాం:
మానవాభివృద్ధి సూచికలను పెంచేందుకు తగిన రీతిలో సహకారం అందిస్తాం:
రాష్ట్రంలో నిరక్షరాస్యత జాతీయ సగటు కన్నా ఎక్కువ ఉంది:
రాష్ట్రానికి పారిశ్రామిక వాటా కూడా తక్కువుగా ఉంది:
బడ్జెట్‌లో సగానికిపైగా మానవవనరుల వృద్ధికోసం ఖర్చుచేస్తున్నారు:
పారిశుధ్య కార్యక్రమాలు బాగానే నిర్వహిస్తున్నారు:
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై ముందడుగు వేయాలి:
జీరోబడ్జెట్‌నేచరల్ ఫార్మింగ్‌కు నేను చాలా అనుకూలం, దీన్ని పోత్సహించాలి:
రాష్ట్ర రెవిన్యూలోటు కాస్త ఆందోళనకరంగా ఉంది:
బడ్జెయేతర ఖర్చులు పెరిగినట్టు కనిపిస్తున్నాయి:
పెట్టుబడులు, పబ్లిక్ రుణాలపై దృష్టిపెట్టాలి:
మేం మీతో çపనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం:
గ్రామాల్లో, పట్టణాల్లో ఇళ్లనిర్మాణంపై దృష్టిపెట్టాలని కోరుతున్నాం:
పప్పు దినుసులు, నూనెగింజల సాగును దేశవ్యాప్తంగా పెంచడానికి ప్రయత్నిస్తున్నాం:
వాటికి సరైన మద్దతు ధర ఇచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం:
మహిళల్లో రక్తహీనత రాష్ట్రంలో చాలా ఎక్కువగా ఉంది:
మహిళా, శిశుసంక్షేమంపై దృష్టిపెట్టాలి:
బియ్యం, వంటనూనెల్లో ఖనిజలవణాలు, విటమిన్లు ఉండేలా చూడాలి:
దీనిపై కేంద్ర ఆహార శాఖతో కలిసి పనిచేస్తున్నాం:
తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన:
ఫుడ్ ప్రాససింగ్, ఆగ్రో ఉత్పత్తుల ఎగుమతులపై దృష్టిసారించాలన్న నీతిఆయోగ్
*సీఎం శ్రీ వైయస్. జగన్*
నిరక్షరాస్యతను అధిగమించిడానికి బహుముఖ ప్రణాళికలు అమలు చేస్తున్నాం: నీతి ఆయోగ్‌కు తెలిపిన ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్
రాష్ట్రంలోని మొత్తం 44వేలకు పైగా స్కూళ్లను దశలవారీగా అభివృద్ది చేస్తున్నాం: సీఎం
మొదటి దశలో 15వేల స్కూళ్లలో 9 రకాల కనీస సదుపాయాలు కల్పిస్తున్నాం:సీఎం
వచ్చే ఏడాది నుంచి 1 నుంచి 8 వరకూ ఇంగ్లిషు మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నాం: సీఎం
ఆపై వచ్చే సంవత్సరం 9,10 తరగతుల్లో ఇంగ్లిషు మాధ్యమాన్ని ప్రవేశపెడుతున్నాం: సీఎం
ప్రైవేటు స్కూళ్లలో అధిక ఫీజులు కారణంగా చాలామంది పేదలు పిల్లలను స్కూళ్లకు పంపించలేకపోతున్నారు:
చక్కటి సౌకర్యాలతో నాణ్యమైన విద్యను ప్రభుత్వ స్కూళ్లలో అందించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాం: సీఎం
పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించడానికి ఏడాదికి రూ.15వేలు ఇస్తాం, జనవరి 26న అమ్మ ఒడి పథకం అమలు: సీఎం
మొదట పేదల కడుపులు నింపితే ఆతర్వాత వాళ్లు స్కూళ్లవైపు దృష్టిపెడతారు:సీఎం
నిరక్షరాస్యతను సున్నాస్థాయికి తీసుకురావడమే లక్ష్యం: సీఎం
పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను ఉంచడానికి ప్రయత్నాలు చేస్తున్నాం: సీఎం
కేంద్ర మానవవనరుల అభివృద్దిశాఖ ''అమ్మ ఒడి''ని స్పాన్సర్ చేస్తే.. దేశానికి మోడల్‌గా నిలుస్తుందని నీతిఆయోగ్‌ను కోరిన అధికారులు
పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడానికీ చర్యలు : నీతిఆయోగ్‌కు వివరించిన సీఎం
ఆహారం లోపం ఒకటైతే, పారిశుధ్యం, తాగునీరు, అనారోగ్య వాతావరణం దీనికి మరో కారణం: సీఎం
వీటిని నివారించడానికి అన్ని చర్యలూ చేపడుతున్నాం: సీఎం
పరిశుభ్రమైన నీటిని ప్రతి ఇంటికీ అందించడానికి వాటర్‌గ్రిడ్‌ను తీసుకు వస్తున్నాం: సీఎం
గిరిజన ప్రాంతాల్లో, మారుమూల ప్రాంతాల్లో రక్తహీనత అధికంగా ఉంది: సీఎం
అంగన్‌వాడీల కింద, మధ్యాహ్న భోజనం కింద ఇస్తున్న ఆహారం నాణ్యతను బాగా పెంచుతున్నాం:సీఎం
ఇప్పటికే పంపిణీచేస్తున్న బియ్యంలో నాణ్యత పెంచామన్న సీఎం
విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తామన్న సీఎం
ఆరోగ్యరంగంలో కూడా చాలా మార్పులు తీసుకు వస్తున్నాం:
ఆరోగ్యంపై ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు :
ఆరోగ్యశ్రీ పరిధిలోకి మరిన్ని జబ్బులను చేరుస్తున్నాం:
డిసెంబరులో ప.గో.జిల్లాలో తొలిసారిగా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నాం:
డెంగీ, మలేరియా కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకు వస్తున్నాం:
ప్రభుత్వ ఆస్పత్రులన్నీ జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నాం:
స్కూళ్లు, ఆస్పత్రులు విషయంలో శరవేంగా ముందుకు వెళ్తున్నాం:
నాడు – నేడు కింద వీటిని అభివృద్ధి చేస్తున్నాం:
ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేలా వీటిని తయారుచేస్తున్నాం:
ప్రజలకు వైద్యం ఖర్చులు తగ్గిస్తున్నాం: సీఎం
ప్రతి గ్రామ, వార్డు సచివాలయాల్లో 10 మందికి కొత్తగా ఉద్యోగాలు కల్పించాం: సీఎం
ఆక్వాకల్చర్‌లో నాణ్యమైన ఉత్పాదనలకోసం అత్యుత్తమ విధానాలను అనుసరించేలా ప్రయత్నాలు చేస్తున్నట్టు సీఎం చెప్పారు
కొత్తగా ల్యాబ్‌లు ఏర్పాచేస్తున్నట్టు వెల్లిడించారు
వారసత్వంగా వచ్చిన కొన్ని సమస్యలతో రాష్ట్రం బాధపడుతోంది: సీఎం
గత ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ అయినప్పటికీ రూ. 2.27లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది: సీఎం
మేం అధికారంలోకి వచ్చాక బడ్జెట్ అంతే ఉంచి అంతర్గతంగా కొన్నిమార్పులు చేసుకున్నాం:
నాలుగు రకాలుగా రాష్ట్రానికి ఆదాయం వస్తుంది:
రాష్ట్ర రెవిన్యూ నుంచి వచ్చే ఆదాయం ఒకటైతే,
కేంద్ర పన్నుల నుంచి వచ్చే వాటా మరొకటి: సీఎం
ఒక విధానం ప్రకారం కేంద్ర పన్నల నుంచి వాటా వస్తుంది: సీఎం
ఇక రుణాల విషయంలో కూడా ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులు ఉన్నాయి:సీఎం
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్రాంట్లు తగ్గకుండా చూడాలి: సీఎం
నీతి ఆయోగ్‌సమావేశంలో సీఎం శ్రీ వైయస్.జగన్మోహన్‌రెడ్డి, నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్‌కుమార్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, కురసాల కన్నబాబు, మేకపాటి గౌతం, గుమ్మనూరు జయరాములు, చీఫ్ సెక్రటరీ ఎల్వీసుబ్రహ్మణ్యం, నీత్ ఆయోగ్ బృందం ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.