లోక క‌ల్యాణార్థం కృష్ణ‌లంక‌లో మృత్తికా (మ‌ట్టి) శివ లింగానికి మ‌హా రుద్రాభిషేకం 

చూసిన క‌నుల‌దే భాగ్య‌ము...! 
* న‌య‌న మ‌నోహ‌రం.. భ‌క్తుల కోలాహ‌లం..
* హ‌ర‌..హ‌ర మ‌హాదేవ... శంభో..శంక‌రా అంటూ మారుమ్రోగిన కృష్ణ‌లంక  
* న‌గ‌రం న‌లుమూల‌ల నుంచి వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్త‌జ‌నం 
* లోక క‌ల్యాణార్థం కృష్ణ‌లంక‌లో మృత్తికా (మ‌ట్టి) శివ లింగానికి మ‌హా రుద్రాభిషేకం 
* 40 నిమిషాల పాటు నిరాటంకంగా పంచామృతాలు, పండ్లు, పూల‌తో శివ‌య్య‌కు అభిషేకాలు 
* దైవ‌భ‌క్తితో పాటు దేశ‌భ‌క్తిని పెంపొందించుకోవాల‌ని పిలుపునిచ్చిన అమ్మ ఆశ్ర‌మ సేవ‌కులు
        విజయవాడ :


         : హ‌ర‌...హ‌ర‌..  మ‌హాదేవ‌.. శంభోశంక‌రా... ఓంశ‌క్తి... ఓం న‌మ‌శ్శివాయ‌.. అంటూ భ‌క్తుల శివ నామ‌స్మ‌ర‌ణ‌తో కృష్ణ‌లంక ప్రాంతం ఆదివారం సాయంత్రం మారుమ్రోగింది. ప్ర‌స్తుతం సంభ‌విస్తున్న విప‌త్తుల కార‌ణంగా అనేక ర‌కాలుగా బాధ‌ప‌డుతున్న మాన‌వాళికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వ‌ర్యాలు, భ‌క్తి, జ్ఞాన, వైరాగ్యాలు  ప్రాప్తించాల‌నే సంక‌ల్పంతో, లోక క‌ళ్యాణార్థం గ‌డ్డం వి.ఎన్‌.ఎ.గ‌ణేష్‌, త‌ల్లం సురేష్ బాబు సంయుక్త ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడ కృష్ణ‌లంక‌లోని బియ్య‌పుకొట్ల బ‌జారులో ఆదివారం సాయంత్రం మృత్తికా (మ‌ట్టి) శివ లింగానికి నిర్వ‌హించిన మ‌హా రుద్రాభిషేకం ఆధ్యాంతం నేత్ర‌ప‌ర్వంగా సాగింది. అమ్మ చారిట‌బుల్ ట్ర‌స్ట్ (గుంటూరు) ఆధ్వ‌ర్యంలో అమ్మ ఆశ్ర‌మం గురువైన జ్ఞాన ప్రసన్న స్వామి (బాబాగారు), ఆశ్ర‌మ సేవ‌కులు పాల్గొని మ‌హా శివునికి విభూది, ప‌సుపు, కుంకుమ‌, రుద్రాక్ష‌లు, అన్నం, ప‌న్నీరు, పంచామృతాలు, నెయ్యి, పాలు, పెరుగు, త‌మ‌ల‌పాకులు, పండ్లు, వివిధ ర‌కాల పుష్పాల‌తో 40నిమిషాల పాటు నిరాంటంకంగా నిర్వ‌హించిన అభిషేకాలు వేలాదిగా త‌ర‌లివ‌చ్చిన భ‌క్తుల‌ను త‌న్మ‌య‌త్వం చేశాయి. కైలాస‌మే భువికి దిగి వ‌చ్చిందా... సాక్షాత్తుగా ఆ ప‌ర‌మేశ్వ‌రుడే విచ్చేసి త‌మ‌ను అనుగ్ర‌హించాడా అన్న రీతిలో సాగిన రుద్రాభిషేకాన్ని తిల‌కించిన భ‌క్తులు పుల‌కించిపోయారు. అభిషేకాలు జ‌రుగుతున్నంత‌సేపు త‌మ‌ను తాము మ‌ర‌చిపోయి హ‌ర‌..హ‌ర మ‌హాదేవ... శంభో..శంక‌రా... ప‌ర‌మేశ్వ‌రా.. పాహిమా.. పాహిమాం.. అంటూ నిన‌దించారు. అభిషేకాలు అనంత‌రం స్వామివారిని ప‌సుపు, కుంకుమ‌, విభూదితో శోభాయ‌మానంగా అలంక‌రించి దూప‌దీప నైవేద్యాలు స‌మ‌ర్పించి మ‌హా హార‌తిని గావించారు. రుద్రాభిషేకంలో పాల్గొన్న రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంప‌ల్లి శ్రీనివాస‌రావు మాట్లాడుతూ ప్ర‌జ‌ల్లో ఆధ్యాత్మిక చింత‌న పెంపొందించడంతో పాటు లోక క‌ళ్యాణార్థం మ‌హా శివునికి రుద్రాభిషేకం న‌య‌న మ‌నోహ‌రంగా నిర్వ‌హించడం అభినంద‌నీయం అని పేర్కొన్నారు. ఇటువంటి మ‌హోత్త‌ర‌మైన ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహ‌కుల‌ను, నేత్ర‌ప‌ర్వంగా రుద్రాభిషేకం నిర్వ‌హించిన అమ్మ ఆశ్ర‌మం గురువైన జ్ఞాన ప్రసన్న స్వామి (బాబాగారు)ని అభినందించారు. మ‌హా శివునికి అత్యంత ప్రీతిపాత్ర‌మైన రాబోయే కార్తీక‌మాసంలో పున్న‌మీఘాట్‌లో రుద్రాభిషేకం నిర్వ‌హించేందుకు కృషి చేస్తామ‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా రుద్రాభిషేకం అనంత‌రం నిర్వాహ‌కులు భ‌క్తుల‌కు తీర్థ‌ప్ర‌సాదాలు అంద‌జేశారు. రుద్రాభిషేకం అనంత‌రం అమ్మ ఆశ్ర‌మం సేవ‌కులు మాట్లాడుతూ ప్ర‌జ‌ల్లో దైవ‌భ‌క్తితో పాటు దేశ‌భ‌క్తి కూడా పెంపొందాలని అప్పుడే మాన‌వ జ‌న్మ‌కు సార్థ‌క‌త ఏర్ప‌డుతుంద‌న్నారు. నింగికెగిరిన జాతీయ జెండా వెనుక నేల‌కొరిగిన సైనికులు, స‌మ‌ర‌యోధులు అనేక మంది త్యాగ‌ధ‌నుల‌  ప్రాణాలు ఉన్నాయ‌ని మ‌రువ‌కండి అంటూ సూచించారు. ఆ త్యాగ‌మూర్తుల‌కు మ‌ర‌ణ‌మే లేద‌ని చాటేలా ప్ర‌తి ఇంటా జాతీయ జెండా ఉండేలా దీక్ష చేప‌ట్టి దేశం ప‌ట్ల మ‌న బాధ్య‌త‌ను నిరూపించుకోవాల‌ని సూచించారు. అనంంత‌రం జాతీయ గీతంతో కార్య‌క్ర‌మాన్ని ముగించారు. భ‌క్తులు వేలాదిగా త‌ర‌లివ‌చ్చి రుద్రాభిషేకాన్ని తిల‌కించారు.


Popular posts
*వింజమూరు ప్రజలు జాగ్రత్తలు వహించండి* డాక్టర్ రమేష్.... వింజమూరు, సెప్టెంబర్ 22 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలోని ప్రజలు కరోనా వైరస్ మహమ్మారి పట్ల తగు జాగ్రత్తలు వహించాలని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైధ్యాధికారి డాక్టర్ రమేష్ కోరారు. ఇప్పటివరకు మండలంలో 500లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగిందన్నారు. అయితే అదే స్థాయిలో బాధితులు కోలుకుంటుండటం సంతోషకరమైన విషయమన్నారు. కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఈ వైరస్ పట్ల అవగాహనా రాహిత్యం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం శ్రేయస్కరం కాదన్నారు. కరోనా నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం, వైద్య ఆరోగ్యశాఖలు ఎంతగానో కృషి చేస్తున్నాయన్నారు. అయితే ప్రభుత్వ సూచనలను పెడచెవిన పెట్టడం వలన వైరస్ ప్రబలేందుకు పరోక్షంగా దోహదపడుతున్నామన్నారు. కనీస జాగ్రత్తలు పాటించిన పక్షంలో కరోనాను అంతమొందించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. ప్రతి నిత్యం వేడి వేడి ఆహార పదార్ధాలను భుజించడం, దాహం వేసినప్పుడు గోరువెచ్చని నీటిని సేవించడం, యోగా, ముఖానికి మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి సూచనలను ప్రతి ఒక్కరూ విధిగా అలవాటు చేసుకోవాలన్నారు. వైరస్ సోకిన వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రమేష్ తెలిపారు. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు.
Image
ఆ నేరస్తుడిని కఠినంగా శిక్షించాలి : సీఎం జగన్‌
16 న చిన్న, మధ్యతరహా పత్రికల రాష్ట్ర మహాసభ : మల్లెల      
చెన్నకేశవ స్వామి ఆలయ ఈవో నారాయణ రెడ్డి మృతి పట్ల మంత్రి సంతాపం
కరోనా నియంత్రణకు దక్కన్ టూబాకో కంపెనీ  గ్రూప్
Image