తెలుగువాడి చరిత్రను ప్రపంచానికి తెలియజేయడం గర్వకారణం

తెలుగువాడి చరిత్రను ప్రపంచానికి తెలియజేయడం గర్వకారణం


 *సైరా ప్రీరిలీజ్ వేడుకల్లో చిరంజీవి* 


 హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ తో పాటు పలువురు దర్శకులు, నిర్మాతలు , హాజరయ్యారు ఇంగ్లీష్ వారిపై మొట్టమొదటి యుద్ధం చేసింది మన తెలుగు వాడు కర్నూలుకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర వెండితెరపై ఎక్కించడం గత పుష్కరకాలంగా ఉన్న కోరిక అని దానిని పరుచూరి బ్రదర్స్ సహాయంతో వెండి తెరకెక్కించామని చిరంజీవి అన్నారు... 1978 సెప్టెంబర్ 22 ప్రాణం ఖరీదు సినిమా విడుదల రోజు ఎంత టెన్షన్ పడ్డానో ఈరోజు అదేవిధంగా టెన్షన్ గురవుతున్నారని చిరంజీవి అన్నారు ...పాత్ర లో లీనము అయిన తర్వాత తనకు వయసు గుర్తు రాదని తనకు ప్రేక్షకులే   గుర్తుకు వస్తారని,వారిని అలరించడమే తన లక్షణం అన్నారు... డూప్ లు కూడా సహించరని తానే అన్ని చేస్తానని చెప్పారు...


 తెలుగు సినిమా చరిత్రలో భారత దేశస్థాయిని అంతర్జాతీయ స్థాయిలో తీసుకెళ్లిన వ్యక్తులు మొదట శంకరాభరణం తరువాత మగధీర, బాహుబలి,తీసిన రాజమౌళి మాత్రమేనని అన్నారు..


 ఈ రోజున మనం స్వేచ్ఛాయుత వాతావరణంలో స్వచ్ఛమైన గాలి పిలుస్తున్నామంటే  స్వతంత్ర సమరయోధులు పెట్టిన భిక్షే అని వారి త్యాగ ఫలమే నని, ఈ సినిమా డబ్బులు కోసం కాదని ఆత్మతృప్తి కోసమేనని ప్రజలు చరిత్రను తెలుసుకోవాలనే ఉద్దేశంతో తీసామన్నారు.... పవన్ కళ్యాణ్ సినిమాకి చేయడం ఆనందంగా ఉందన్నారు...


 *ముఖ్య అతిధి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ*


 చిరంజీవిని ఒక అభిమానిగా చూస్తానని ఒక కుటుంబ సభ్యుడిగా కాదని ఆయన అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తిని ఆ రోజు తాను ఇంటర్మీడియట్ తప్పినప్పుడు చని పోదాం అనుకున్నాను. అని కానీ అన్నయ్య వదిన లే ఆపారని ఒక లక్ష్యం కోసం పని చేయమన్నారని ధ్తెర్యంగా ఉండమన్నారని అన్నారు..


 మొన్నామధ్య తెలంగాణలో ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆ బాధ అర్థం అయిందని అన్నారు...


 భారతదేశం మీద ఇతర దేశాలు దాడి చేశాయి గాని భారతదేశం ఏ దేశం మీద దాడి చేయలేదని అలాంటి దేశంలో ఇంగ్లీషు దొరల పెత్తనాన్ని వ్యతిరేకించింది మన తెలుగు వాడు కావడం గర్వించదగిన విషయం అన్నారు....
అకస్మాత్తుగా మద్య లొ ఒక అభిమాని రావడంతో సెక్యూరిటీ అడ్డుకున్నారు..వారిని వారించి ఫోటో దిగి పంపారు..... చివరలొ చిరంజీవి మాట్లాడుతూ  ముగించే సమయంలో    ఉండగా మరో అభిమాని స్టేజి మీదకి దూసుకొచ్చి గందరగోళం నెలకొంది.....