*208వ ఎస్ఎల్బీసీ సమావేశంలో ముఖ్యమంత్రి శ్రీవైయస్.జగన్*
ఇచ్చిన హామీలు, చెప్పిన మాటలు నిలబెట్టుకునేలా ముందడుగు వేస్తున్నాం: ఎస్ఎల్బీసీ సమావేశంలో సీఎం శ్రీ వైయస్.జగన్
విశ్వసనీయతను నిలబెట్టుకునేలా అడుగులు : సీఎం శ్రీ వైయస్.జగన్
ప్రభుత్వం, బ్యాంకర్లు కలిస్తేనే క్రెడిబిలిటీ నిలబడుతుంది: సీఎం శ్రీ వైయస్.జగన్
వివిధ వర్గాల ప్రజలకు చేయూతనివ్వడానికి, వారిని ఆదుకోవడానికి ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది:
ప్రభుత్వం వివిధ పథకాలకింద అనేకమందికి నగదు ఇస్తుంది:
ఈ డబ్బు నేరుగా లబ్ధిదారులకు చేరాలి : సీఎం శ్రీ వైయస్.జగన్
బ్యాంకులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈడబ్బును మినహాయించకోకూడదు: సీఎం శ్రీ వైయస్.జగన్
దీనికోసం మినహాయించుకోలేని రీతిలో అన్‌ఇన్‌కంబర్డ్ బ్యాంకు ఖాతాలు తెరవాలి:
వడ్డీలేని రుణాల కింద రైతులకు, డ్వాక్రా సంఘాలకు సున్నావడ్డీ కింద ఇవ్వాల్సిన డబ్బును ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెల్లిస్తుంది:
ఈ విషయంలో బ్యాంకర్లు ఏం కోరినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం:
మా ఆర్థికశాఖతో టచ్‌లో ఉండండి.. వడ్డీలేని రుణాల కింద ఇవ్వాల్సిన డబ్బును నిర్దేశించిన సమయానికి చెల్లిస్తాం:
గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి... సున్నా వడ్డీకింద చెల్లింపును రశీదు రూపంలో వారికి అందిస్తారు:
సున్నావడ్డీల కింద ఎవరెవరికి వడ్డీ డబ్బులు చెల్లించాలో మాకు జాబితా ఇవ్వండి చాలు, వాటిని మేం చెల్లిస్తాం:
ముద్ర పథకం రుణాల పంపిణీని విస్తృతం చేయడంపై దృష్టిపెట్టాలి:
చిన్న చిన్న దుకాణాలు, తోపుడు బళ్లకింద చిరువ్యాపారాలు చేసేవారికి గుర్తింపు కార్డులు ఇస్తాం:
చిరువ్యాపారులకు ప్రోత్సాహం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి:
ప్రభుత్వం ప్రతినెలా ఒక పథకాన్ని అమలు చేస్తుంది:
దీనికి బ్యాంకర్ల సహాయ సహకారాలు అవసరం :
ఎక్కడ సమస్య ఉన్నా.. ప్రభుత్వం ముందుకు వస్తుంది, వాటిని పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటుంది:
మేం చాలా ప్రోయాక్టివ్ గా ఉంటాం:
ఖరీఫ్‌లో రుణాల పంపిణీ లక్ష్యానికి చేరువుగా ఉందని బ్యాంకు అధికారులు చెప్పడం సంతోషకరం: సీఎం వైయస్.జగన్
వర్షాలు బాగా పడ్డాయి, రిజర్వాయర్లలో నీళ్లుకూడా ఉన్నందున రబీలో రైతులకు రుణాలు ఎక్కువగా అవసరమయ్యే అవకాశం ఉంది, ఆమేరకు బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం: సీఎం వైయస్.జగన్
వ్యవస్థలను సరిదిద్దే ప్రయత్నాలు చేస్తున్నాం, విప్లవాత్మక మార్పులు తీసుకు వస్తున్నాం:
జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్ టెండరింగ్ చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి:
పోలవరం పనుల్లో రివర్స్ టెండరింగ్ ప్రక్రియద్వారా రూ.782 కోట్లు ప్రజలధనాన్ని ఆదాచేశాం:
దేశంలో ఎవ్వరూ ఇలాంటి విప్లవాత్మక చర్యలు చేపట్టలేదు:
ఏ రాష్ట్రంలో కూడా జ్యుడిషియల్ ప్రివ్యూ, రివర్స్‌టెండరింగ్ విధానాలు లేవు:
రూ.100 కోట్లు దాటిన ఏ టెండర్‌నైనా జడ్జి దృష్టికి తీసుకెళ్తున్నాం:
పారదర్శక విధానాల్లో జ్యుడిషియల్ ప్రివ్యూ అత్యుత్తమం:
ఏ రాష్ట్రం కూడా రివర్స్ టెండరింగ్ అమలు చేయడంలేదు:
పీపీఏల విషయంలో అదే విధంగా విప్లవాత్మక విధానాలు చేపట్టాం:
అధికారంలోకి రాగానే విద్యుత్ అధికారులతో మేం రివ్యూ పెడితే డిస్కంలపై రూ.20వేల కోట్ల బకాయిలు ఉన్నాయని చెప్పారు, 13 నెలలుగా చెల్లింపులు లేవని చెప్పారు:
అధిక ధరకు చేసుకున్న పీపీఏలపై సమీక్ష చేయకపోతే డిస్కంలు బతికి బట్టకట్టవు:
రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు చాలా ఎక్కువుగా ఉన్నాయని పారిశ్రామిక వేత్తలు వెనకడుగు వేస్తున్నారు వేసే పరిస్థితి ఉంది:
పరిశ్రమలకిచ్చే కరెంటు ఛార్జీలను ఇంకా పెంచే అవకాశం కూడాలేదు:
విద్యుత్‌రంగంలో పరిస్థితులను సరిద్దిడానికి ప్రయత్నాలు చేస్తున్నాం:
విద్యుత్‌రంగం పునరుద్దరణకు మీ అందరి సహకారం కావాలి: