ఇసుక కొరత మినీ నోట్ల రద్దు లాంటింది : డొక్కా

ఇసుక కొరత మినీ నోట్ల రద్దు లాంటింది : డొక్కా మాణిక్యవరప్రసాద్
అమరావతి : ఇసుక కొరత మినీ నోట్ల రద్దు లాంటిందని డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. ఇసుక కొరతతో 20లక్షల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వానికి భవన నిర్మాణ కార్మికుల ఉసురు తగులుతుందన్నారు. ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టడమే ప్రభుత్వాన్ని నడపడమా? అని ప్రశ్నించారు. అన్న క్యాంటీన్లు మూసివేసి ప్రభుత్వం ఏం సాధించిందని నిలదీశారు. అన్న క్యాంటీన్ పథకంపై నిప్పులు పోశారని డొక్కా మాణిక్య వరప్రసాద్‌ ఫైర్ అయ్యారు.