తిరుమల, 2019 సెప్టెంబరు 23
టిటిడి నూతన ధర్మకర్తల మండలి సభ్యుల ప్రమాణస్వీకారం
నూతనంగా ఏర్పడిన టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు తిరుమల శ్రీవారి ఆలయంలో సోమవారం ఉదయం 9.00 నుండి 10.30 గంటల మధ్య ప్రమాణ స్వీకారం చేశారు.
ముందుగా ఎక్స్-అఫిషియో సభ్యులైన ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ మన్మోహన్ సింగ్, టిటిడి శ్రీ అనిల్ కుమార్ సింఘాల్, ఎండోమెంట్స్ కమిషనర్ శ్రీమతి పద్మజ ప్రమాణ స్వీకారం చేశారు.
అనంతరం ఇందులో నూతన ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ మేడా మల్లికార్జునరెడ్డి, శ్రీ బి.పార్థసారథిరెడ్డి, శ్రీ పి.ప్రతాప్ రెడ్డి, డా. నిచితా, శ్రీ కె.పార్థసారథి, శ్రీ మురళీకృష్ణ, శ్రీ ఎన్.శ్రీనివాసన్, శ్రీ జె.రామేశ్వరరావు, శ్రీ ఎన్.సుబ్బారావు, శ్రీ జి.వెంకటభాస్కర్‌రావు, శ్రీ డి.దామోదర్‌రావు, శ్రీ ఎంఎస్.శివశంకరన్, శ్రీ కుమారగురు, శ్రీ సి.ప్రసాద్‌కుమార్, శ్రీ ఎమ్. రాములు, శ్రీ కె.శివకుమార్, శ్రీ యువి.రమణమూర్తి రాజులు ప్రమాణస్వీకారం చేశారు. సోమవారం గరుడాళ్వార్ సన్నిధిలో పాలకమండలి సభ్యులతో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా ముగ్గురు సభ్యులు శనివారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం విదితమే.
ప్రమాణ స్వీకారం చేసిన 17 మంది సభ్యులలో ఐదుగురు సభ్యులు ఆంగ్లంలో, మిగిలి వారు తెలుగులో ప్రమాణం చేశారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన ధర్మకర్తల మండలి సభ్యులందరినీ టిటిడి చైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి అభినందించారు,
శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో గౌరవ సభ్యులకు వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. తిరుమల ప్రత్యేకాధికారి శ్రీ ఎ.వి. ధర్మారెడ్డి రంగనాయకుల మండపంలో బోర్డు సభ్యులందరికీ శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో టిటిడి సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి, అదనపు సివిఎస్వో శ్రీ శివకుమార్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు.