నూకలు శాతం పై విశ్లేషణ

చిత్తూరు సెప్టెంబర్ 23 (అంతిమ తీర్పు):


ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం వారి ప్రమాణాల ప్రకారం ప్రజా పంపిణీ బియ్యం లో 25 % వరకు నూకలు ఉండవచ్చు. ఏప్రిల్ 2020 నుండి 15 % నూకలతో నాణ్యమైన బియ్యంన్ని రాష్ట్ర ప్రభుత్యం వారు
 ప్రజాపంపిణీ ద్వారా ప్రజలకు ఇవ్వదలిచారు. 


25 % నుండి 15 % నూకలు తగ్గించటానికి రైస్ మిల్లర్లకు  ఏ మేరకు రొక్కం చెల్లించవచో అంచనా వేయటానికి ప్రస్తుతం గోడౌన్ వారిగా నూకలు శాతం తెలుసుకుంనేందుకు  కమిషనర్  పౌర సరఫరాల శాఖ , వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ, విజయవాడ వారి ఆదేశాల మేరకు, జిల్లా సంయుక్త పరిపాలనాధికారి వారి ఆధ్వర్యంలో, జిల్లా సరఫరా అధికారి, జిల్లా మేనేజరు, జోనల్ మేనేజరు ,సహాయ మేనేజరు ( సాంకేతిక) వారు జిల్లాలో గల బియ్యం నిల్వ గోదాములలో (ఏర్పేడు మరియు రేణిగుంట గోదాములలో) నిల్వ ఉన్న బియ్యం యొక్క నమూనాలను (శాంపిల్) సేకరించి  అందులో గల నూకలు శాతం పై విశ్లేషణ జరిపి  నివేదికను కేంద్ర కార్యాలయమునకు సమర్పించడము జరుగును.