పడవను తీయలేని ప్రభుత్వం, పోలవరం పూర్తిచేస్తుందా

తేది. 25-09-2019


విలేకరుల సమావేశం వివరాలు


పడవను తీయలేని ప్రభుత్వం, పోలవరం పూర్తిచేస్తుందా?


- గోదావరి పడవ ప్రమాద మృతులకుటుంబాలను ఆదుకోవడంలో జగన్‌ సర్కారు విఫలం.                        


శ్రీ నిమ్మకాయల చినరాజప్ప  


గోదావరిలో పడవప్రమాదం జరిగి 26మంది చనిపోతే, ఆ దుర్ఘటనపై ప్రభుత్వం కిందిస్థాయి అధికారులు, పోలీసులతో తూతూమంత్రపు ప్రకటనలు చేయిస్తూ, ప్రమాదానికి కారకులైన అసలు దొంగలను కాపాడాలని చూస్తోందని మాజీ హోంమంత్రి, టీడీపీ సీనియర్‌ నేత నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. తమవారిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉన్న పడవ ప్రమాదబాధితుల కుటుంబాలను ఆదుకోవడంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యధోరణితోనే   వ్యవహరిస్తోందన్నారు. తమవారి మృతదేహాలు అప్పగించాలని కోరుతూ మృతుల కుటుంబాలు కన్నీళ్లతో వేడుకుంటున్నా, అధికారులు మంత్రులు స్పందించకపోవడం ఈ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని చినరాజప్ప చెప్పారు. ప్రమాదం జరిగి రెండు వారాలవుతున్నా కూడా ప్రభుత్వం నీళ్లల్లో మునిగిన పడవను బయటకు తీయలేకపోయిందన్న ఆయన, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు, దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగి 21మంది చనిపోతే, రెండ్రోజుల్లోనే పడవను వెలికితీసి, మృతుల కుటుంబాలకు రూ.20లక్షల వంతున (ఒక్కో కుటుంబానికి) పరిహారం అందించి న్యాయంచేయడం జరిగిందన్నారు. ఇప్పుడు ప్రమాదం జరిగితే మంత్రులుగానీ, ముఖ్యమంత్రి గానీ ఏ విధమైన చర్యలు తీసుకోకుండా కంటితుడుపు చర్యలతో సరిపెట్టారని నిమ్మకాయల తెలిపారు. పడవ ప్రమాదంపై పర్యాటకశాఖా మంత్రి రోజుకోలా మాట్లాడితే, జలవనరుల శాఖా మంత్రేమో, ప్రమాద ప్రాంతంలో ఒక్కరోజు హడావుడి చేసి కనిపించకుండా పోయాడని మాజీమంత్రి ఎద్దేవాచేశారు. ప్రమాదానికి గురైన పడవను వెలికితీయడం చేతగాని ప్రభుత్వం, దాన్ని తీసేవారు ఎవరైనాఉంటే ఆ జిల్లా అధికారులను కలవాలని కోరుతూ సోషల్‌మీడియాలో ప్రకటనలివ్వడం రాష్ట్రప్రభుత్వ అసమర్థతకు సంకేతం కాదా అని నిమ్మకాయల  ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏవైనా దుర్ఘటనలు, ప్రమాదాలు, ప్రకృతివిపత్తులు జరిగితే ప్రభుత్వాలపై నిందలు వేసే జగన్మోహన్‌రెడ్డి, ప్రభుత్వంలోకి వచ్చాక కూడా అదేపద్ధతిని కొనసాగించడం ఆయనలోని మానసిక జాడ్యాన్ని సూచిస్తోందన్నారు. గోదావరిలో మునిగిన పడవను తీయడంచేతగాని రాష్ట్రజలవనరుల మంత్రి అనిల్‌, పోలవరం ప్రాజెక్ట్‌ని అప్పుడు పూర్తిచేస్తాం...  ఇప్పుడు పూర్తిచేస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని చినరాజప్ప దెప్పిపొడి చారు. పోలవరంలో 75శాతం పనులు చంద్రబాబు ప్రభుత్వమే పూర్తిచేశాక, ఇప్పుడొచ్చిన వైసీపీ ప్రభుత్వం తనకు అనుకూలమైన సంస్థలకు పనులు అప్పగించడానికి వాటితో చీకటి ఒప్పందాలు చేసుకుంటోందన్నారు. పోలవరం పనుల్ని రెండేళ్లలో పూర్తిచేస్తామని ప్రగల్భాలు పలుకుతున్న మంత్రి అనిల్‌, నవయుగ సంస్థను కాదని, అనుభవం లేని మెగాసంస్థకు ప్రాజెక్ట్‌ పనులు అప్పగించడం వెనకున్న లోగుట్టుని ప్రజలకు తెలియచేయాలని మాజీహోం మంత్రి సూచించారు.
గుంంం


Popular posts
*అక్రమ మద్యం విక్రయాలపై ఎస్.ఐ బాజిరెడ్డి డేగకన్ను* ఒకరి అరెస్ట్, 9 మద్యం బాటిళ్ళు స్వాధీనం... వింజమూరు, అక్టోబర్ 17 (అంతిమ తీర్పు- దయాకర్ రెడ్డి): వింజమూరు మండలంలో అక్రమ మద్యం విక్రయదారులకు ఎస్.ఐ బాజిరెడ్డి సిం హస్వప్నంలా మారారు. తాజాగా శనివారం నాడు మండలంలోని తమిదపాడు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు సాగిస్తున్న చీల్ల.తిరిపాలు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి 9 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకున్నారు. నిందితునిపై కేసు నమోదు చేసి ఉదయగిరి కోర్టులో హాజరు పరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు ఎస్.ఐ బాజిరెడ్డి పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శుక్రవారం నాడు చాకలికొండ గ్రామంలో ఇతర రాష్ట్రాలకు చెందిన 61 మద్యం బాటిళ్ళను స్వాధీనం చేసుకుని అక్రమంగా విక్రయిస్తున్న బోడేపూడి.నాగేశ్వరరావు అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మండలంలో అక్రమ మద్యం విక్రయాలపై పూర్తి నిఘా ఉంచిన పోలీసులు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గక అక్రమార్కుల భరతం పడుతుండటం పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్.ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ పల్లె సీమల్లో ప్రశాంతకు భంగం కలిగించే ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలను కూకటి వేళ్ళతో సహా పెకలించి వేస్తామన్నారు. పేకాట, కోడి పందేలు, నిషేదిత గుట్కా విక్రయాలపై తన మొబైల్ నెంబర్ 9440796375 కు సమాచారం అందించాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వివరాలు అందించిన వారి పేర్లును అత్యంత గోప్యంగా ఉంచుతామన్నారు. మండలంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రజలందరూ కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.
Image
వింజమూరు బంగ్లాసెంటెర్ లో గుట్కాలు పట్టివేత* ఒకరి అరెస్ట్... వింజమూరు, అక్టోబర్, 18 (అంతిమ తీర్పు-దయాకర్ రెడ్డి): నెల్లూరు జిల్లా, వింజమూరు మండల కేంద్రం లోని బంగ్లా సెంటర్ వద్ద ఆదిలక్ష్మి ప్రావిశన్ షాప్ లో ఆదివారం ఉదయం కలిగిరి సీఐ శ్రీనివాసరావు, వింజమూరు యస్ ఐ బాజిరెడ్డి లు ఆకస్మిక తనికీలు నిర్వహించారు, ఇందులో భాగంగా 9762 నిషేదిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకొని షాప్ యజమాని మూలి హజరత్ రెడ్డి ని అరెస్ట్ చేసారు. ఈ సందర్బంగా వింజమూరు ఐ బాజిరెడ్డి మాట్లాడుతూ... నిషేదిత గుట్కా ఉత్పత్తుల అమ్మకాలపై తమ శాఖకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు జిల్లా sp భాస్కర్ భూషణ్ కావలి DSP ప్రసాద్ ఆదేశాలమేరకు తమ సర్కిక్ ఇన్సోఏక్టర్ శ్రీనివాసరావు సూచనలమేరకు సంయుక్తంగా దాడులు నిర్వహించడం జరిగిందని అన్నారు. సత్వరమే సదరు నిందితుడిపై కేసు నమోదు చేయటంతోపాటు కోర్టు కు హాజరు పరచనున్నామన్నారు. అంతేగాక వింజమూరు మండలం లో ఎక్కడైనా సరే అక్రమ మద్యం విక్రయాలు, నిషేదిత గుట్కాల అమ్మకాలు, కిడిపంద్యాలు, పేకాట, తదితర చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలపై ప్రజలు ఎప్పటికప్పుడు తమకు సమాచారం అందించాలని యస్ ఐ బాజిరెడ్డి మండల ప్రజలకు సూచించారు.
Image
పేదల పక్షపాతి, విశ్రాంత ఐఏఎస్‌ యుగంధర్‌ ఇక లేరు
గుంటూరు కేంద్రంగా కమిషనరేట్‌
నేటి నుంచి గ్రామ సచివాలయాల వద్ద‌ ఖరీఫ్ విత్తనాల పంపిణీ 
Image