విలువలు బోధించే గురువులందరికీ వందనం : మంత్రి మేకపాటి గౌతమ్

 


తేదీ: 04-09-2019,
 అమరావతి.


విజ్ఞానం అందించి..విచక్షణ నేర్పించి..విలువలు బోధించే గురువులందరికీ వందనం : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డిఅమరావతి, 04,సెప్టెంబర్ : విద్యాబుద్ధులు చెప్పేవారు మాత్రమే గురువులు కాదు, మనకు తెలియని విషయాలేవైనా మనకు నేర్పించే ఎవరినైనా గురువుగానే భావించాలని ..అటువంటి గురువులందరికీ పరిశ్రమలు, వాణిజ్య, ఐ.టీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పురాణ కాలం నుంచి భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో గురువుకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని..ఆదియుగం నుంచి ఆధునిక యుగం వరకూ సాగిన మానవజాతి పరిణామక్రమంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా కీలకమైందన్నారు మంత్రి మేకపాటి. మనకు ప్రపంచాన్ని పరిచయం చేసేది అమ్మానాన్నలైతే ఆ ప్రపంచంలో ఎలా జీవించాలో నేర్పించేది గురువులేనని మంత్రి అన్నారు. 'విద్యకు విద్యార్థులు అంకితం- ఉపాధ్యాయులు విద్యార్థులకు అంకితం' అని ఆచరించి చూపించిన మహనీయుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజైన సెప్టెంబర్ 5వ తేదీన గురువులందరినీ గుర్తు చేసుకుని పూజించుకోవడం ఆ గురువులందరికీ సమాజమిచ్చే సముచిత గౌరవమన్నారు. శంకరాచార్యుడు, రామానుజాచార్యుడు, మధ్వాచార్యుడు, తులసీదాస్ వంటి ఎందరో మహానుభావులు మన దేశాన్ని తమ బోధనలతో పావనం చేసిన గురువులన్నారు. నేటితరం ఉపాధ్యాయులు తమ వృత్తిని ఉపాధి కోసమే కాకుండా విద్యార్థుల అవసరాల మేరకు నైపుణ్యాలను పదునుపెట్టేందుకు కృషి చేసి 'జాతినిర్మాత'లుగా నిలవాలన్నారు. నవ తరానికి చదువుతో పాటు సంస్కారం నేర్పి మంచి సమాజ నిర్మాణం స్థాపించడంలోనూ తమ పాత్రను పోషించాలని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి.. ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.


 


Popular posts
జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించండి.. * కమిషనర్‌ను కలిసిన నెల్లూరు హౌసింగ్ సొసైటీ ప్ర‌తినిధులు‌ నెల్లూరు: పాత్రికేయుల‌కు నెల్లూరులో ప్ర‌భుత్వం కేటాయించిన జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ అభివృద్ధికి స‌హ‌క‌రించాల‌ని కోరుతూ ది నెల్లూరు జర్నలిస్టుల మ్యూచువల్లి ఎయిడెడ్ కో- అపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ నెల్లూరు అ‌డహక్ కమిటీ కన్వీనర్, అధ్యక్షులు వి.శేషాచలపతి, కో- కన్వీనర్, ఉపాధ్యక్షులు వల్లూరు ప్రసాద్‌కుమార్ బుధవారం మున్సిప‌ల్ కమిషనర్ కె.దినేష్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కన్వీనర్ శేషాచలపతి మాట్లాడుతూ కొత్తూరులో ఉన్న న్యూ జర్నలిస్ట్ కాలనీకి సంబంధించిన 20 ఎకరాల లే అవుట్‌లో ఉన్న పబ్లిక్, ఓపెన్ స్పెసెస్ స్థలాలు, రోడ్లను కార్పొరేషన్‌లోని టౌన్ ప్లానింగ్ విభాగం త‌ర‌ఫున అభివృద్ధి చేయాలని కోరారు. జ‌ర్నలిస్టులు కొత్తగా ఇల్లు నిర్మించుకోనున్న వారికి టౌన్ ప్లానింగ్ ద్వారా హౌస్ ప్లాను అనుమతులను వెంటనే ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం నిర్ణిత రుసుముతో ప్లాను మంజూరు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో డైరెక్టర్ గట్టుపల్లి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
Image
ఆదిశేషయ్య కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన శ్రావణ్ కుమార్ ...
Image
87 మంది సినిమా జ‌ర్న‌లిస్టులైన ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు ఐదువేలు చేయూత‌
Image
సింగపూర్‌: నాలుగు అంశాలను పునాదులుగా చేసుకుని సమగ్రాభివృద్ధికోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రణాళికలు
భోజన ప్యాకెట్లు పంపిణీ చేసిన టి.డి.పి నేతలు
Image